వెనకకు భగవద్గీత ముందుకు
1 అర్జునవిషాద యోగము
||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ ప్రథమోऽధ్యాయః - అర్జునవిషాదయోగః

15 వ శ్లోకం

పాఞ్చజన్యం హృషీకేశో దేవదత్తం ధనఞ్జయః |
పౌణ్డ్రం దధ్మౌ మహాశఙ్ఖం భీమకర్మా వృకోదరః ||1-15|| .

పాంచజన్యాన్ని హృషీకేశుడూ, దేవదత్తాన్ని ధనంజయుడూ, పౌంద్రకమనే మహాశంఖాన్ని భీమకర్ముడైన వృకోదరుడు ఊదారు.
ఆదిశంకరాచార్యులవారు : ఈ శ్లోకానికి శంకరులు భాష్యం చెప్పలేదు. 2.10 నుండి వీరి భాష్యం గ్రంథస్థమై వుంది.
రామానుజాచార్యులవారు: భాష్యం లేదు. వీరు 1.19 నందు 1-19 శ్లోకాలకు భాష్యం రాసారు
మధ్వాచార్యులవారు: మధ్వాచార్యులు భాష్యం అందించలేదు, కానీ వారి పరంపరలో బలదేవ విద్యాభూషణ వారు భాష్యం అందించారు శ్రీకృష్ణుని పాంచజన్యం, ధనుంజయుని దేవదత్తం, వృకోదరుడు పౌండ్రం పూరించారు. వీరంతా తమకున్న దివ్యశంఖాలు ఊదారు అని చెబుతున్నారు ఇక్కడ. హృషీకేశుడు అంటే అందరి మనస్సులు నియంత్రింపగలిగినవాడు, కాబట్టి విజయం ఎవరిదీ అన్నది తెలుస్తూనే వుంది ఇక్కడ. అందరినీ నియంత్రించగలిగిన కృష్ణుడు ఎవరిని ఎలా దారిలో పెట్టగలడో చెప్పకనే చెబుతున్నది. ధనుంజయుడు అని అర్జునిని పిలవడం ద్వారా అందరి ధనాన్ని జయించగలిగిన విజయుడు అని చెప్పకనే చెబుతున్నారు. భీముని వృకోదరునిగా వర్ణించి అతడు చెయ్యబోయే భయంకరమైన యుద్ధం గురించి తెలియచేస్తున్నారు.

పాంచజన్యం

భగవాన్‌ శ్రీకృష్ణపరమాత్ముడి శంఖువు పాంచజన్యం. ఆయన ఈ శంఖాన్ని కురుక్షేత్ర యుద్ధంలో పూరించేవాడు.వసుదేవుడు బలరామ, కృష్ణులకు గర్గాచార్యుడనే పురోహితుడి ద్వారా ఉపనయనం చేయించాడు. అనంతరం ఆచార్యులు వారికి గాయత్రీ మంత్రాన్ని ఉపదేశించారు. తరువాత బలరామ కృష్ణులను సాందీప మహాముని ఆశ్రమానికి తీసుకువెళతారు. ఆ ఆశ్రమంలో అన్ని విద్యలను ఆచార్యుల వారు వారికి బోధించారు. ఈ ఆశ్రమంలోనే కుచేలుడు బాల కృష్ణునికి స్నేహితుడిగా పరిచయమవుతాడు.
కొంతకాలం అనంతరం శిక్షణ ముగియడంతో బలరాముడు, కృష్ణుడు ఆచార్యులకు ప్రణమిల్లి గురుదక్షిణ ఏమివ్వాలో ఆజ్ఞాపించమని కోరతారు. వీరు సామాన్యులు కాదని వైకంఠం నుంచి భువిపై అవతరించిన వారని తన దివ్యజ్ఞానంతో సాందీపుడు తెలుసుకొంటాడు. తన మరణించిన కుమారుడిని తిరిగి బతికించమని కోరతాడు. గురుపత్ని శోకాన్ని నివారించినట్టు అవుతుందని వారికి సూచిస్తాడు. గురుకుమారుడు కొంతకాలం క్రితం సముద్రస్నానం చేస్తూ భారీ అల రావడంతో కడలిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. ఆ సముద్రతీరానికి వెళ్లిన బలరామ కృష్ణులు గురుకుమారుడిని తిరిగివ్వమని సాగరుణ్ని కోరారు. సాక్షాత్తు నారాయణుడే తన దగ్గరకు రావడంతో సముద్రుడు వారికి వినమ్రంగా నమస్కరించి ‘గురుపుత్రుడిని మింగింది పంచజనుడనే రాక్షసుడనీ, కడలి గర్భంలో దాగి వున్నాడనీ’ వెల్లడిస్తాడు. దీంతో వారు సముద్రంలోపలికి వెళ్లి పంచజనుడితో యుద్ధం చేసి అతన్ని సంహరిస్తారు. అనంతరం అతని కడుపును చీల్చిచూడగా గురు కుమారుడు కనిపించడు. ఒక శంఖువు మాత్రమే కనిపిస్తుంది. శంఖాన్ని శ్రీకృష్ణుడు తీసుకున్నాడు. గురుకుమారుడు నరకంలో వున్నాడని గ్రహించిన వారు అక్కడికి చేరుకుంటారు. అక్కడ ఆ శంఖువును పూరిస్తాడు కృష్ణుడు. ఆ శబ్దానికిభీతిల్లిన యమధర్మరాజు అక్కడకు చేరుకొని ఇద్దరినీ తీసుకెళ్లి అతిథి మర్యాదలు చేసి ఎందుకొచ్చారో తెలుసుకుంటాడు. భగవంతుని ఆజ్ఞ కావడంతో వెంటనే సాందీపుని కుమారుడిని వారితో పంపిస్తాడు. మునికుమారుడిని వెంటబెట్టుకొని ఆశ్రమానికి చేరుకుంటారు. మృతుడైన తమ కుమారుడు తిరిగి రావడంతో సాందీప దంపతులు ఎంతో సంతోషిస్తారు. పంచజనుడి నుంచి తీసుకున్న శంఖం కనుకనే దానికి పాంచజన్యం అని పేరొచ్చింది.

భీష్ముడు

మహాభారతంలో శంతన మహారాజు పుత్రుడు భీష్ముడు. పూర్వ నామం "దేవవ్రతుడు". భారతంలో ఒక ప్రధానమైన, శక్తివంతమైన పాత్ర భీష్ముడిది. సత్యవర్తనుడిగా, పరాక్రముడిగా భీష్ముని పాత్ర అనిర్వచనీయమైనది.

భీష్ముని జననం

ఆయన అసలు పేరు దేవవ్రతుడు. ఆయన కారణ జన్ముడు. అష్ట వసువులలో ఒకడు. అష్ట వసువులు అనగా దేవలోకం లో ఇంద్రునికి, విష్ణువుకు సహాయంగా ఉండే శక్తివంతమైన దేవతలు. మహాభారతం ప్రకారం సాక్షాత్తూ బ్రహ్మ ప్రజాపతి పుత్రులు. ప్రకృతి తత్వానికి ప్రతీకలు. ధర, అనిల, అనల, అహ, ప్రత్యూష, ప్రభాస, సోమ, ధృవులు.
ఒక సారి వారు తమ భార్యలతో కలిసి వనవిహారం చేస్తుండగా అరణ్యంలో ఒక దివ్య తేజస్సు గల ఆవు కనిపించింది. అది వశిష్టుని ఆశ్రమంలో ఉండే కామధేనువు. దానిని వారు దొంగతనంగా తీసుకుని వెళతారు. వశిష్ఠుడు తన దివ్యదృష్టి ద్వారా జరిగింది గ్రహించి వారిని భూమిపై మానవులుగా జన్మించమని శపిస్తాడు. వారు వశిష్టుని క్షమించమని వేడుకోగా సహాయం చేసిన ఏడుగురు వసువులు భూమిపై కొద్ది రోజులు మాత్రమే జీవిస్తారని కానీ కామధేనువుని తీసుకుని వెళ్ళిన అష్టమ వసువు మాత్రం భూమిపై దీర్ఘకాలం ఉండక తప్పదని చెబుతాడు.
వారు ఆ శాపం గురించి ఆలోచిస్తుండగా గంగాదేవి వారి వద్దకు వస్తుంది. వారు ఆమెను మానవ రూపం ధరించి ఎవరైనా రాజును వివాహమాడి తమకు జన్మనిచ్చి, పుట్టిన వెంటనే నదిలో పారవేయ వలసిందిగా కోరతారు. గంగాదేవి అందుకు అంగీకరిస్తుంది.
ఒకనాడు చంద్రవంశానికి చెందిన ప్రతీపుడు అనే మహారాజు గంగానదిలో సూర్యునికి అర్ఘ్యం సమర్పిస్తుండగా గంగాదేవి అందమైన మానవకాంత రూపం ధరించి వచ్చి ఆయన కుడి తొడమీద

భీష్మ ఏకాదశి

శ్రీ విష్ణు సహస్ర నామ జయంతి. మాఘ శుక్ల ఏకాదశినే భీష్మ ఏకాదశి అంటాము.
శ్రీ విష్ణు సహస్రనామం భీష్మపితామహుడు పాండవులకు చేసిన మహోపదేశం. భారత సంగ్రామం పూర్తి అయిన తర్వాత భీష్మపితామహుడు అంపశయ్యపైనే ఉండి పొయ్యాడు. ఎక్కడి వాళ్ళు వారి వారి రాజ్యాలకు వెళ్ళి పోయారు. సుమారు నెల రోజులు గడిచాయి, పాండవులు శ్రీకృష్ణుడు సల్లాపాలు ఆడుకొనే ఒక సమయంలో ఒక నాడు హటాత్తుగా శ్రీకృష్ణుడు పాండవులతో మాట్లాడుతూ ఆగిపోయాడు. పాండవులకు గాబరా వేసింది. ఏమైంది అని శ్రీకృష్ణుడిని అడిగారు. శ్రీకృష్ణుడు వారికి సమాధానం చెబుతూ "మాంధ్యాతి భగవాన్ భీష్మః తపోమే తద్గతం మనః" కురుక్షేత్రంలో అంపశయ్యపై పవళించి ఉన్న భీష్మపితామహుడు నన్ను స్మరించుకుంటున్నాడు. అందుకే నామనస్సు అక్కడికి వెళ్ళి పోయింది. 'హే పాండవులారా! బయలుదేరండి, భీష్ముడి దగ్గరికి. ఎందుకంటే భీష్ముడు ఆస్తికాగ్రేసరుడు, ధర్మాలను అవపోశణం పట్టినవాడు. శాస్త్రాలను పూర్తిగా ఆకలింపు చేసిన మహనీయుడు. మానవాళి తరించడానికి కావల్సిన మార్గాలను స్పష్టంగా తెలిసిన మహనీయుడు. సులభంగా జీవకోటిని తరింపజేయడం ఎట్లానో అవగతం చేసుకొన్న మహనీయుడు. ధర్మ విషయంలో ఏ సంశయాలు ఉన్నా ప్రామాణికంగా తీర్చగలిగిన ఏకైక మహానుభావుడు. ఆయన దేహం నుండి నిష్క్రమించే సమయం ఆసన్నమవుతుంది. ఆయన అస్తమిస్తే లోకంలో ధర్మ సంశయాలని తీర్చే వ్యక్తులు ఎవ్వరూ ఉండరు. అందుకే సూక్శ్మ విషయాలను తెలుసుకుందురు రండి' అని భీష్మ పితామహుడి వద్దకు తీసుకు వచ్చాడు.
భీష్ముడు సుమారు నెలన్నర నుండి భాణాలపైనే పడి ఉన్నాడు. దేహం నిండా బాణాలు, శక్తి పూర్తిగా క్షీణించిపోయింది, అసలే మాఘమాసం ఎండకు ఎండుతూ, మంచుకు తడుస్తూ, నీరు లేదు, ఆహారం లేదు. స్వచ్ఛంద మరణం తెచ్చుకోగలడు, కాని ఆయన ఇన్ని బాధలు భరిస్తూ ఉండిపొయ్యాడు. ఉత్తరాయణం వరకు ఉండాలి అని అనుకున్నాడు. ఒక ఏకాదశి నాడు దేహం నుండి నిష్క్రమించాలని భగవంతుడిని తలచుకుంటున్నాడు. మనస్సులో శ్రీకృష్ణుడిని సాక్షాత్కరించు కోగలిగేవాడు ఆయన. తన హృదయ మందిరంలోనే శ్రీకృష్ణుడితో మాట్లాడగలిగే వాడు ఆయన. అంత జ్ఞానులైన మహనీయులకు ఈరోజు ఆరోజు అనే నియమం ఉండదు అని ఉపనిషత్తు చెబుతుంది. మరి అట్లాంటి వారు ఏ రోజు నిష్క్రమించినా పరమపదం లభిస్తుంది.ఎవరు కర్మ చేస్తారు అనే నియమం కూడా లేదు. భీష్ముడు తనకి "మాతా పితా బ్రాతా నివాసః శరణం సుహ్రుత్ గతిః గమ్యం సర్వం నారాయణః" అని అనుకున్న మహనీయుడు. ఆయనకు సర్వం శ్రీకృష్ణుడే అని విశ్వసించేవాడు. అందుకు ఆయన ఏనాడు మరణించినా భగవంతుడి సాయిజ్యం కలగక మానదు.
మరి అన్ని రోజులు అంపశయ్య పై ఎందుకు ఉండి పొయ్యాడు ?
ఆయనకు తను చేసిన దోషం ఒకటి స్పష్టంగా జ్ఞాపకం ఉంది. చేసిన ప్రతి దోషం శరీరం పైనే రాసి ఉంటుందట! అది తొలగితే తప్ప సద్గతి ఏర్పడదట. ఏ దోషం చేసాడాయన ? ద్రౌపతికి సభామధ్యంలో అవమానం జరుగుతుంటే ఏం చేయలేక పోయాడు. భగవత్ భక్తురాలికి అవమానం జరుగుతుంటే చూస్తు కూర్చుండి పోయాడు. ద్రౌపతికి శ్రీకృష్ణుడంటే అత్యంత ప్రేమ. తన గురువు వసిష్ఠులవారు చెప్పారట "మహత్యాపది సంప్రాప్తే స్మత్తవ్యః భగవాన్ హరిః" హే ద్రౌపతి! ఇత్రులు ఎవ్వరు తొలగించని ఆపద వచ్చినప్పుడు శ్రీహరిని స్మరించుకో అని. ఆనాడు సభామధ్యంలో తన అయిదుగురు అతి పరాక్రమమైన భర్తలు ఏం చెయ్యలేక పోయారు. వారు కౌరవులకి బానిసలై పోయారు. కౌరవులను ఎదురించడానికి వీలులేకుండా పోయ్యింది. వారు కేవలం సామాన్య ధర్మాన్నే పాటించారు, కాని సాటి మనిషిగా ఆమెను కాపాడాలనే విశేష ధర్మాన్ని ప్రక్కన పెట్టారు. శ్రీకృష్ణుడు తన భక్తులకి జరిగే అవమానాన్ని సహించలేడు. అలా చేసినందుకు మొత్తం వంద మంది కౌరవులను మట్టు పెట్టాడు. ఆ దోషంతో పాండవులకూ అదే గతి పట్టేది. కానీ అలా చేస్తే చివర తను ఎవరిని రక్షించాలని అనుకునాడో ఆ ద్రౌపతికే నష్టం జరుగుతుందని వారిని అట్టే ఉంచాడు. ఈ విషయం భగవంతుడే అర్జునుడితో చెప్పాడు. ఎప్పుడైతే ద్రౌపతికి అవమానం చేసారో వారందరిని అప్పుడే తీసి పాడేసాను, ఇప్పుడు వారు కేవలం కాలిపోయిన కాగితం వలె ఉన్నారే తప్ప, వారిని నేను ఎప్పుడో ఏరిపారేసాను, నీకు ఆ గౌరవం కట్టబెట్టాలని యుద్ధం చేయమని చెబుతున్న అని శ్రీకృష్ణుడు అర్జునుడితో అన్నాడు.
భీష్మ పితామహుడు ఆనాడు ధర్మరాజుకు తలెత్తిన సందేహాలను తీరుస్తుంటే, ప్రక్కనే ఉన్న ద్రౌపతి నవ్వుతూ 'తాతా! ఆనాడు నాకు అవమానం జరుగుంటే ఏమైయ్యాయీ ధర్మాలు' అని అడిగిందట. అందుకు భీష్ముడు 'అవును ద్రౌపతి! నా దేహం దుర్యోదనుడి ఉప్పు తిన్నది, నా ఆధీనంలో లేదు. నాకు తెలుసు నీకు అవమానం జరుగుతుందని, కానీ నా దేహం నా మాట వినలేదు. అంతటి ఘోర పాపం చేసాను కనక, ఆ పాప ప్రక్షాళన కోసం ఇన్నాల్లూ అంపశయ్యపై పడి ఉన్నాను'అని చెప్పాడు. హస్తిన సింహాసనాన్ని కాపాడుతాను అని తాను తన తండ్రికి ఇచ్చిన వాగ్దానానికి కట్టుబడి ఉండిపోయాడు భీష్ముడు. కానీ, పరిస్థితుల ప్రభావంచే విశేష ధర్మాన్ని ప్రక్కన పెట్టాడు. ' హే ద్రౌపతీ! కృష్ణ భక్తిలో ఎట్లాంటి కల్మషం లేదు, కానీ శరీరం దుష్టమైపోయింది. దాన్ని పరిశుద్ధం చేసుకోవాలనే అంపశయ్యపై పడి ఉన్నాను, అందుకు ఈ నాడు నేను ధర్మాలను చెప్పవచ్చును' అని పాండవులకు ఎన్నో నీతులను బోధించాడు. శ్రీకృష్ణుడు భీష్మపితామహుడికి దేహబాదలు కలగకుండా వరం ఇచ్చి చెప్పించాడు. నాకెందుకు శక్తినిచ్చి చెప్పిస్తున్నావు, నీవే చెప్పచ్చుకదా అని భీష్ముడు అడిగాడు. అందుకు కృష్ణుడు నేను చెప్పొచ్చుకానీ, నీలాంటి అనుభవజ్ఞుడు చెబితే వచ్చే స్పష్టత నేను చెబితే ఉండదు. నేను చెబితే అది తత్వం, నీవు చెబితే అది తత్వ ద్రష్టం. తత్వాన్ని చూసినవాడు తత్వాన్ని చెప్పాలే తప్ప తత్వం తన గురించి తాను చెప్పుకోదు. నేల నేను ఇంత సారం అని చెప్పగలదా! ఆ నేలలో పండిన మ్రొక్క చెబుతుంది, ఆ నేల ఎంత సారమో. అలాగే నీవు అనుభవజ్ఞుడవి, నీవు ఉపదేశంచేస్తే అది లోకానికి శ్రేయస్సు.
భగవంతుడు సముద్రం లాంటి వాడు, నీరు ఉంటుంది కానీ పాన యోగ్యం కాదు.అదే నీటిని మెఘ వర్షిస్తే పానయోగ్యం. అందుకే భగవత్ జ్ఞానం నేరుగా కాకుండా భగవత్ తత్వం తెలిసిన భీష్ముడి ద్వారా అది అందితే లోకానికి హితకరం. అట్లా శ్రీకృష్ణుడు వరం ఇచ్చి, భీష్ముడి ద్వారా ధర్మ సారాన్ని పాండవులకు ఉపదేశం చేయించాడు. భగవద్గీత శ్రీకృష్ణుడు నేరుగా చెప్పాడు, శ్రీవిష్ణు సహస్రనామాల్ని భీష్ముడి ద్వారా చెప్పించాడు. అందుకే శ్రీవిష్ణు సహస్రనామాల వల్ల సులభంగా తరించ వీలు ఉంది.
ముఖ్యంగా విష్ణు సహస్ర నామ జపం, ధ్యానం వల్ల భయం తొలగుతుంది, శుభం కలుగుతుంది. గణపతిని, వ్యాస భగవానుని, పితామహుని, పాండవులను, తల్లి తండ్రులను, గురువులను భక్తీ పూర్వకంగా స్మరించి తదుపరి, ఈ దివ్య నామములను జపిస్తూ తేజో మయుడైన, పరమాత్ముని ధ్యానించి బాధల నుంచి విముక్తుల మవుదాం.
జై శ్రీమన్నారాయణ
శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి ప్రవచనం. ఆమె తనను మోహిస్తుందేమోనని ఆయన బాధపడి ఆమె ఎందుకు అలా కూర్చుందో అడుగుతాడు. సాధారణంగా కూతుళ్ళు, కోడళ్ళు మాత్రమే అలా కూర్చుంటారు. తనకు కుమారుడు కలిగితే అతన్ని పెళ్ళాడవచ్చునని సూచిస్తాడు. అది విని ఆమె అంతర్ధానమైపోతుంది.
కొద్ది కాలానికి ప్రతీపునికి శంతనుడనే పుత్రుడు జన్మిస్తాడు. ఆయన ఒకసారి గంగాతీరంలో విహరిస్తుండగా మానవ రూపంలో ఉన్న ఆమెను చూసి మోహిస్తాడు. శంతనుడు ఆమెను పెళ్ళి చేసుకోవాలంటే కొన్ని షరతులు విధిస్తుంది. దాని ప్రకారం పెళ్ళి తర్వాత ఆమె ఏం చేసినా శంతనుడు అందుకు అడ్డు చెప్పకూడదు. ఆక్షేపించ కూడదు. అలా చేసిన పక్షంలో ఆమె అంతర్ధానమైపోతుంది. శంతనుడు అందుకు అంగీకరించి ఆమెను పెళ్ళి చేసుకుంటాడు.
కొద్ది కాలానికి వారికి ఒకరి తర్వాత ఒకరు ఏడుగురు మగ సంతానం కలుగుతారు. అయితే ఆమె ఒక్కో బిడ్డ పుట్టిన వెంటనే నదిలో పారవేస్తూ ఉంటుంది. ఆ ఏడుగురి విషయంలోనూ ఎలాగోలా ఊరుకున్న శంతనుడు ఎనిమిదవ బిడ్డ విషయంలో మాత్రం ఆమెను వారిస్తాడు. ఆమె ఆ శిశువును శంతనుడికిచ్చి అంతర్ధానమై పోతుంది. ఆ శిశువే దేవవ్రతుడు. జీవితకాలం భూమి మీద జీవించాలన్న శాపానికి గురైన అష్టమ వసువు. గంగాదేవి జన్మనిచ్చింది కాబట్టి గాంగేయుడు అని కూడా పిలవబడ్డాడు. శంతనుడి కుమారుడు కాబట్టి శాంతనవుడు అయ్యాడు.

భీష్మ ప్రతిజ్ఞ

సంసార జీవితంపైన కోరికతో తాను మోహించిన సత్యవతిని వివాహమాడాలని నిశ్చయించుకుని శంతనుడు సత్యవతి తల్లిదండ్రులను సంప్రదించాడు. అప్పటికే భీష్ముడిని పుత్రుడిగా కలిగిన శంతనుడికి తమ కుమార్తెను ఇచ్చి వివాహం చేయటానికి వారు నిరాకరించారు. దానితో మనస్తాపం చెందిన తన తండ్రి ప్రవర్తనలోని తేడాను గమనించి, మంత్రి ద్వారా తండ్రి కోరికను తెలుసుకుని తానే స్వయంగా తండ్రి వివాహం జరిపించడానికి సిద్ధమయ్యాడు భీష్ముడు. ఈ వివాహంకోసం సత్యవతి తల్లిదండ్రులు పెట్టిన అన్ని ఆంక్షలను అంగీకరించి, తాను రాజ్యాధికారం చేపట్టనని, రాజ్య సంరక్షణా బాధ్యతను స్వీకరిస్తానని, తన పుత్రుల ద్వారా ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉండేందుకు, అసలు వివాహమే చేసుకోనని భీష్మించి, తన తండ్రికి సత్యవతితో వివాహం జరిపించాడు. ఈ భీషణ ప్రతినకు గాను అతడు భీష్ముడు అని ప్రసిద్ధుడయ్యాడు. తన వివాహం కోసం ఇంతటి త్యాగానికి సిద్ధపడిన పుత్రుని అభినందించి, తాను ఎప్పుడు కోరుకుంటే అప్పుడు మరణం సంభవించే స్వచ్ఛంద మరణ వరాన్ని భీష్మునికి ప్రసాదించాడు శంతనుడు.తన తండ్రి కోసం అతను బ్రహ్మచారి గా ఉంచానని ప్రతిఞ చేసిన గొప్ప వాడు.

పరశురామునితో యుద్ధం

తన పినతల్లికి కలిగిన సంతానం చిత్రాంగదుడు, విచిత్రవీర్యులకు తగిన కన్యల కోసం, యుద్ధంలో ఇతర రాజులను ఓడించి కాశీ రాజు కుమార్తెలు అంబ, అంబిక, అంబాలికలను తెచ్చాడు. పెద్ద కుమార్తె అంబ మాత్రం తాను సాళ్వుని వరించానని చెప్పింది. భీష్ముడు ఆమెను సాళ్వుని వద్దకు పంపించేసాడు. సాళ్వుడు, తాను భీష్మునితో యద్ధంలో ఓడిపోయినందున ఆమెను స్వీకరించనని చెప్పాడు. ఆమె తిరిగి భీష్ముని వద్దకు వచ్చి యుద్ధంలో తనను గెలిచి తెచ్చాడు కాబట్టి వివాహం చేసుకోమని కోరింది. తాను ఆజన్మ బ్రప్మచారిగా ఉంటానని ప్రమాణం చేసి ఉన్నందున భీష్ముడు అందుకు అంగీకరించలేదు.
ఆమె కోపంతో, భీష్ముడి గురువైన పరశురాముణ్ణి శరణు వేడుకుంది. పరశురాముడు తన శిష్యుణ్ణి పిలిచి ఆమెను పెళ్ళి చేసుకోమన్నాడు.ఆడినమాట తప్పనన్నాడు భీష్ముడు. అయితే యుద్ధం తప్పదన్నాడు పరశురాముడు. హోరాహోరీగా సాగిన పోరులో తన శస్త్రాస్త్రాలతో పరశురామునే నిలువరించాడు, భీష్ముడు. చివరకు పరశురాముడు తన గండ్రగొడ్డలిని ప్రయోగించగా, భీష్ముడు పరశురాముడే అనుగ్రహించిన బ్రహ్మాస్త్రాన్ని ప్రయాగించాడు. రెండూ ఢీకొంటే జగత్ప్రళయం తప్పదని భూదేవి వేడుకొనగా ఇద్దరూ తమ అస్త్రాలను ఉపసంహరించుకున్నారు. గురువును మించిన శిష్యుడివయ్యావంటూ పరుశురాముడు భీష్ముణ్ణి ప్రశంసించాడు.

అర్జునుని ప్రతిజ్ఞ

తన కుమారుని మరణించిన విధానం తెలుసుకున్న అర్జునుడు మనస్సు వికలమై మూర్చపోయాడు. శ్రీకృష్ణుడు యుధిష్టరుడు అర్జునుడికి ఉపచారములు చేసారు. మూర్ఛ నుండి తేరుకున్న అర్జునుడు కోపంతో ఊగిపోతూ ముఖం అంతా ఎర్రబడగా ” అందరూ వినండి ఇదే నా ప్రతిజ్ఞ. సైంధవుని రేపు సూర్యాస్తమయం లోపు చంపుతాను. ఆ సైంధవుడు నిన్ను శరణు వేడినా శ్రీకృష్ణుని శరణు వేడినా కడకు నన్నే శరణు వేడినా యుద్ధ భూమి నుండి పారిపోతే తప్ప అతడిని వదలను. సైధవుని రక్షించుటకు కౌరవసేన ఏకమై నా మీద అస్త్రశస్త్రములు ప్రయోగించినా వాడిని వదలను. నేను ఈ ప్రతిజ్ఞ తప్పిన ఎడల గురుద్రోహం, బ్రహ్మహత్య, మధ్యపానము మొదలగు ఘోర పాపములు చేసిన వాడను ఔతాను. దేవతలు, కింపురుషులు, రాక్షసులు వాడికి రక్షణగా వచ్చినా నేను వాడిని వదలను. లేని ఎడల అగ్ని ప్రవేశం చేసి ఆత్మాహుతి చేసుకుయంటాను ” అని ప్రతిజ్ఞ చేసాడు. వెంటనే తన గాండీవం తెచ్చి పూజాదికములు నిర్వహించాడు. నారి సారించాడు శ్రీకృష్ణుడు పాంచజన్యం పూరించాడు. అర్జునుడు దేవదత్తం పూరించాడు. పాండవ సైన్యములో తూర్యనాదములు మిన్నుముట్టాయి. సైనికులు సింహనాదములు చేస్తున్నారు. అర్జునుడి అక్షయ తుణీరంలోని అస్త్రశస్త్రాలు వీరావేశంతో నృత్యం చేసాయి. పక్కనే ఉన్న భీమసేనుడు అర్జునుడితో ” అర్జునా ! నీ వెంట నేను ఉన్నాను. విజృంభించు సైంధవుని త్రుంచు. దేవదత్తము, పాంచజన్య ఘోషలు విని కౌరవ వీరుల గుండెలు పగులుతాయి ఇది తథ్యం ” అని అన్నాడు.
ఆ రాత్రి సమయంలో పాండవ శిబిరంలో పాంచజన్య, దేవదత్త ఘోషలు విని కౌరవసేనలలో కలవరం రేగింది. వెంటనే వారు చారులను పిలిచి అడుగగా వారు జరిగినది అంతా సవిస్తరంగా చెప్పారు. అది విన్న సైంధవుని శరీరం కంపించింది. అక్కడ నిలువ లేక సిగ్గు విడిచి నీ కుమారుని శిబిరానికి పరుగు తీసి ” సుయోధనా ! నేను ఒక్కడినే అపకారం చేసినట్లు అర్జునుడు నాపై పగబూని నన్ను చంపుతానని ప్రతిజ్ఞ చేసాడట. మీరంతా సంతోషంగా ఉన్నారు. నేను మాత్రం ఎందుకు దుఃఖపడాలి ? అర్జునుడి ప్రతిజ్ఞకు దేవాసురులు, సిద్ధసాధ్యులుగాని అడ్డుపడగలరా ! సుయోధనా ! ద్రోణుడు, కృపుడు, కర్ణుడు, శల్యుడు, బాహ్లికుడు నీవు తలచిన యమపురి పోయిన వాడిని తీసుకురాగలరు. కానీ మీరు కాపాడవలెనని అనుకున్నట్లు లేరు కనుక నాకిక దేవుడే దిక్కు ” అన్నాడు. అతడి పెదవులు ఎండి పోతున్నాయి కాళ్ళు తడబడుతున్నాయి నిలబడ లేక పోతున్నాడు. ” సుయోధనా ! ముందు నేను అర్జునుడి కంట పడకుండా దాక్కుంటాను. మీకిక శలవు బ్రతికుంటే రేపు కలుస్తాను ” అని వెళ్ళబోయాడు.
సుయోధనుడు ” సైంధవా ! ఏమిటీ వెర్రి ! ఇప్పుడే కదా ! మా పరాక్రమము పొగిడావు. ద్రోణుని శౌర్యము, సోమదత్తుని ధైర్యము, శకుని వీరము, శల్యుని బలము నీకు తెలియనిదా ! మేము నిన్ను విడిచి పెడతామా భయపడకుము నిన్ను వెన్నంటి ఉంటాము ” అని ధైర్యము చెప్పాడు. వెంటనే సుయోధనుడు సైంధవుని వెంటబెట్టుకుని ద్రోణుని వద్దకు వెళ్ళాడు. సైంధవుడు ద్రోణునితో అర్జునుడికి తనకు ధనుర్విద్యలో కల తారతమ్యాలు అడిగాడు. ద్రోణుడు ” సైంధవా ! మీరందరూ నా దగ్గర విలు విద్య అభసించారు. నేను మీకందరికి ఒకే విధంగా నేర్పాను కాని అర్జునుడు కఠోర శ్రమకు ఓర్చి ఎన్నో ప్రయోగములు చేసి విలువిద్యలో మెళుకువలు తెలుసుకున్నాడు. కనుక మీ కంటే అర్జునుడు అధికుడు కాని నీవు అర్జునుడికి భయపడ పని లేదు నా రక్షణలో ఉండగా నిన్ను దేవతలు కూడా తేరిపార చూడ లేరు. అర్జునుడు కూడా భేదింప లేని వ్యూహము రేపు పన్నుతాను. నీవు క్షత్రియ ధర్మము ప్రకారం యుద్ధం చెయ్యి. వేదవేదాంగాలు అభ్యసించి, యజ్ఞయాగాదులు చేసిన నీవిలా మృత్యువుకు భయపడ తగునా ! యాదవులు, పాండవులు, కౌరవులు మొదలైన ఎవరైనా ఈ భూమిపై శాశ్వతులా కాలం తీరగానే అందరూ పోవలసిన వారే కదా ! మహా మునులు యజ్ఞము చేసి పొందు ఫలం వీరులు యుద్ధభూమిలో మరణించిన పొందవచ్చు. కనుక నిశ్చింతగా ఉండు ” అన్నాడు. ఆ మాటలకు ఊరట చెందిన సైంధవుడు సుయోధనునితో కలిసి తమ శిబిరానికి వెళ్ళాడు. ఇరుపక్షముల సైన్యాలు జరిగిన విషాదం తలపక రేపటి యుద్ధము గురించి ఆలోచించ సాగారు. సుయోధనుడు మరునాటి యుద్ధానికి సమాలోచనలు జరుపుతున్నాడు. ధర్మరాజు పాంచాల, కేకయ, మత్స్య, పాండ్య, యాదవ రాజులను మరునాటి యుద్ధానికి సమాయత్త పరుస్తున్నాడు.
అర్జునుడు చేసిన భీకర ప్రతిజ్ఞకు కృష్ణుడు కలవరపడి ” అర్జునా ! నాతో ఏమాత్రం ఆలోచించక ఘోర ప్రతిజ్ఞ చేసావు. దుస్తరమైన ఈ ప్రతిజ్ఞను నీవు నెరవేర్చక పోయిన నాకు కలిగే బాధను నువ్వు అర్ధం చేసుకున్నావా! చారులు తెచ్చిన సమాచారం ఏమంటే నీ ప్రతిజ్ఞ విన్న కౌరవ శిబిరంలో కలకలం రేగింది. వారు నీవు ఎప్పుడైనా నీ కుమారుని మరణానికి కారకులైన వారి మీద విరుచుకు పడతావని గ్రహించారు. సైంధవుడు సిగ్గు విడిచి సుయోధనుడి వద్ద తనను రక్షించమని వేడుకొనగా ద్రోణ, కృప, అశ్వత్థామ, శల్య, కర్ణాది కౌరవ వీరులు సైంధవుని ప్రాణానికి అభయం ఇచ్చారట. ద్రోణుడు అత్యంత క్లిష్టమైన వ్యూహము పన్ని సైంధవుని నీ కంట పడకుండా చేసి నిన్ను ఆపగలనని చెప్పాడట. అంత కట్టుదిట్టమైన వ్యూహంలో సకల కౌరవ యోధుల రక్షణలో ఉన్న సైంధవుని ఒక్క పగటిలో సంహరించుట సామాన్యం కాదు. కనుక దీని గురించి మనకు ఆప్తులైన వారితో ఆలోచించవలసిన అవసరం ఉంది ” అన్నాడు. అర్జునుడు ” కృష్ణా ! కౌరవ ప్రముఖుల బలాబలాలు నాకు తెలియనిదా. నా గురించి వారికి తెలియును నీ సహాయ సంపత్తి నా యడల ఉన్న సైంధవుని రక్షించగలిగిన వారెవ్వరు. సైంధవుని చంపునపుడు అడ్డగింన వారెవరైనా వారు నా క్రూర నారాచబాణములకు బలికాక తప్పదు. కౌరవ వీరుల అస్త్రశస్త్రములు నా అస్త్రశస్త్రముల ధాటికి నిలువ లేవు. ఒక్క సుయోధనుడి సేనలే కాదు సాక్షాత్తు పరమేశ్వరుడే వచ్చినా సైంధవుని రక్షించుటకు వీలు కాదు. నీ మీద, నా అస్త్రశస్త్రములు, దివ్యాస్త్రముల మీద ఆన రేపు గాండీవం నుండి వెలువడిన బాణము సైంధవుని తల త్రెంచుట ఖాయం. కృష్ణా ! నీ అండ దండలు నాకుండగా నాకిక అడ్డేమి. నా ప్రతిజ్ఞ నెరవేర్చు విధంగా ఆలోచన ఒసగి నన్ను కృతార్ధుని చెయ్యి ” అని నమస్కరించాడు. కృష్ణుడు అర్జునుడి మాటలకు సంతసించి నీ మనస్సు స్థిరముగా ఉన్నది నీవు పోయి నిద్రించుము ” అన్నాడు. అర్జునుడు తన శిబిరముకు వెళ్ళాడు.

గాంధారి వాన -

ఈ చక్కనిజాతీయంగురించి ఈ మధ్యనే వినడం జరిగింది. రాయలసీమ ప్రాంతంలో వాడే జాతీయమని తెలిసింది. మనకి భారత, భాగవత, రామాయణాలలో పాత్రల ఆధారంగా మనకెన్నో జాతీయాలు ఉన్నాయి. వాటిలో ఇదొకటి. మహా భారతంలో ధృతరాష్ట్ర మహారాజు పుట్టుకతో గుడ్డివాడు. అతని భార్య గాంధారి, భర్త చూడని ఈ లోకాన్ని తాను కూడా చూడవద్దనుకుని పతివ్రతా ధర్మంగా ఆమె తన కళ్ళకు నల్లటి వస్త్రాన్ని కట్టుకునేది. ఇది మహాభారతం కథ తెలిసిన వారందరికీ తెలిసినదే. ఎదుట ఏమున్నదో కనిపించనంత గాఢంగా , ఒక తెరలాగా పడుతున్న చిక్కని వర్షపు ధారలను వర్ణించడానికి ఆ వానను గాంధారి వాన అంటారు. గాంధారి తన కళ్ళకు వస్త్రాన్ని కట్టుకున్నప్పుడు ఎదుట ఏముందో చూడలేదు కదా అలాగే చిక్కగా పడుతున్న వర్షాన్ని వర్ణించడానికి ఈ జాతీయం పుట్టినట్టుంది. (ఈ జాతీయాన్ని రాయలసీమ ప్రాంతంలో ఎక్కువగా ప్రయోగిస్తారని తెలియజేసిన శ్రీ కట్టా శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు.)

పాండురాజు

పాండురాజు వ్యాసుని మూలముగా విచిత్రవీర్యునికి, అతని రెండవ భార్య అంబాలికకు కలిగిన సంతానము.

పుట్టుక

విచిత్రవీర్యుని మరణం తరువాత అతని తల్లి సత్యవతి తన మొదటి సంతానం అయిన ఋషి వేద వ్యాసుని పిలిచింది. వ్యాసుడు తన తల్లి అభీష్తం మేరకు విచిత్రవీర్యుని ఇరువురు భార్యలకు సంతానం కలిగించుటకు ఒప్పుకొనెను. విచిత్రవీర్యుని మొదటి భార్య అంబికకు వ్యాసుని చూచి కళ్లు మూసుకొనుటచే పుట్టు గుడ్డి అయిన దృతరాష్ట్రుడు జన్మించెను. సత్యవతి విచిత్రవీర్యుని రెండవ భార్య అంబాలికకు కళ్లు మూసుకొనవలదని చెప్పెను. అంబాలిక వ్యాసుని చూచి భయంతో కంపించుట వల్ల పాండురోగం కలిగిన పుత్రుడు పాండు జన్మించెను

జీవితం

పాండురాజు గొప్ప విలుకాడు. ఇతను దృతరాష్ట్రుని కొరకు సైన్యానికి అధిపతియై రాజ్యాన్ని పాలించుచుండెను. పాండురాజు కాశి, అంగ, వంగ, కళింగ, మగధ మొదలగు రాజ్యాలను జయించెను. ఆ విధంగా అందరు రాజులపై తమ ఆధిపత్యాన్ని చెలాయించెను. పాండురాజు కుంతి భోజుని కుమార్తె కుంతిని మరియు మాద్ర దేశపు రాజు కుమార్తె మాద్రిని వివాహం చేసుకొనెను. ఒకనాడు అడవిలో వేటాడుతూ లేడి రూపంలో సంభోగించుచున్న ఒక ఋషిని తన బాణంతో కొట్టెను. ఆ ఋషి పాండురాజుని తన భార్యతో సంభోగించ ప్రయత్నించిన మరణించెదవని శపించెను. దానితో విరక్తి కలిగిన పాండురాజు రాజ్యాన్ని విడచి తన భార్యలతో కలిసి అడవిలో నివసించుచుండెను. కుంతి తనకు దూర్వాసుని వలన కలిగిన వరమును ఉపయోగించి యముని వలన యధిష్టురుడు, వాయుదేవుని వలన భీముడు, ఇంద్రుని వలన అర్జునుడు లను పుత్రులుగా పొందెను. కుంతి తనకు వరము వలన తెలిసిన మంత్రమును మాద్రికి ఉపదేశించెను. మాద్రి ఆ మంత్రమును ఉపయోగించి అశ్విని దేవతల వలన నకులుడు మరియు సహదేవుడు అను కవలలను పుత్రులుగా పొందెను. ఆ విధంగా కుంతికి పాండురాజుతో వివాహముకు మునుపు సూర్యుని వలన కర్ణుడు జన్మించెను.

మరణం

ఒకరోజు కుంతి మరియు కుమారులు లేని సమయమున పాండురాజు మాద్రిని చూసి ఆకర్షితుడై తాకెను. ఆ విధంగా తనకుగల శాపం మూలంగా మరణించెను. మాద్రి పాండురాజు చితిపై కూర్చుని సతీసహగమనం చేసెను. కుంతి పాండవులని రక్షించుటకు బ్రతికి ఉండెను.

© Copyright శ్రీ భగవధ్గీత