వెనకకు భగవద్గీత ముందుకు
1 అర్జునవిషాద యోగము
||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ ప్రథమోऽధ్యాయః - అర్జునవిషాదయోగః

16 వ శ్లోకం

అనన్తవిజయం రాజా కున్తీపుత్రో యుధిష్ఠిరః |
నకులః సహదేవశ్చ సుఘోషమణిపుష్పకౌ ||1-16|| .

కుంతీపుత్రుడు ధర్మరాజు అనంతవిజయాన్నీ, సుఘోష, మణిపుష్పకాలనే వాటినినకుల సహదేవులు ఊదారు.


శ్రీకృష్ణుడు పాంచజన్యమును,అర్జునుడు దేవదత్తమను శంఖమును,భయంకరుడు వృకొదరుడునైన భీముడు పౌండ్రమను మహా శంఖమును,రాజు యుద్ధమందు స్థిరుడు,ధర్మానువర్తియైన యుధిష్ఠిరుడు అనంత విజయమను శంఖమును,నకుల,సహదేవులు సుఘోష,మణి పుష్పకములను శంఖములను పూరించిరి మహాధనుర్ధారియైన కాశీరాజు,మహారథుడైన శిఖండి,ధృష్టద్యుమన్నుడు,విరాటరాజు,అజేయుడైన సాత్యకి,ద్తౌపద మహారాజు,పృథివీపతులైన ద్రౌపదీదేవి అయిదు మంది కుమారులు, సుభద్రాదేవి కుమారుడు మహాభుజశాలి అయిన అభిమన్యుడును వేర్వేరుగ తమ శంఖములను పూరించిరి.
___________________

సాత్యకి

సాత్యకికి యుయూధనుడు అను పేరు కూడా ఉంది. ఇతను కృష్ణునికి చెందిన వృషణి యాదవ వంశమునకు చెందిన మహా యోధుడు.
సాత్యకి కృష్ణుని భక్తుడు. ఇతను అర్జునునితో కలసి ద్రోణుని వద్ద యుద్ధ విద్యలు అభ్యసించాడు. ఇతను అర్జునుడు మంచి స్నేహితులు. సాత్యకి తండ్రి సాత్యక. ఇతను కురుక్షేత్ర సంగ్రామంలో పాండవులతో కలసి కౌరవులపై యుద్ధం చేసెను. కృష్ణుడు శాంతి రాయబారమునకు హస్తినాపురంనకు వచ్చునపుడు సాత్యకితో కలసి వచ్చెను.
సాత్యకి మరియు కృతవర్మలు కురుక్షేత్ర సంగ్రామంలో పోరాడిన యాదవ వీరులలో ముఖ్యులు. వీరిలో సాత్యకి పాండవుల వైపు, కృతవర్మ కౌరవుల వైపు పోరాడారు. యుద్ధంలో ఒకసారి ద్రోణుని విల్లుని 101 సార్లు విరచి అతనిని ఆశ్చర్యపరిచాడు. కురుక్షేత్ర సంగ్రామంలో పదునాల్గవ రోజున అప్పటికే బాగా అలసియున్న సాత్యకి తమకు చాలా కాలంగా కుటుంబ వైరం ఉన్న భూరిశ్రవునితో యుద్ధం చేసాడు. చాలాసేపటి తరువాత ఆ యుద్ధంలో సాత్యకి అలసిపోయాడు. భూరిశ్రవుడు సాత్యకిని బాగా గాయపరిచి యుద్ధస్థలమునందు జుట్టు పట్టుకుని ఈడ్చాడు. కృష్ణుడు అర్జునునితో జరుగుతున్న పోరాటము గురించి వివరించి సాత్యకి ప్రాణములకు గల ముప్పు గురించి హెచ్చరించాడు. భూరిశ్రవుడు సాత్యకిని సంహరించుటకు తన ఖడ్గము పైకి ఎత్తాడు. అంతలో అర్జునుడు తన బాణంతో భూరిశ్రవుని చేయి ఖండించి సాత్యకి ప్రాణాలను కాపాడాడు.
భూరిశ్రవుడు ముందు హెచ్చరించకుండా తన మీద దాడి చేసి యుద్ధనీతి తప్పావని అర్జునుని నిందిస్తాడు. అలసిపోయి నిరాయుధుడైన సాత్యకిపై దాడి చేయుట యుద్ధనీతికి వ్యతిరేకం అని అర్జునుడు ప్రతినింద చేస్తాడు. అదియును గాక తన స్నేహితుడైన సాత్యకి ప్రాణాలు కాపాడుట తన విధి అని వివరిస్తాడు.
అంతట భూరిశ్రవుడు ఆయుధములు విడచి తన దేహము విడుచుటకు కూర్చుని ధ్యానం చేయసాగాడు. అప్పటికి స్పృహలోకి వచ్చిన సాత్యకి తన ఖడ్గంతో భూరిశ్రవుని తల ఖండించుటకు ఉద్యుక్తుడయ్యాడు. ప్రతిఒక్కరూ వారిస్తున్ననూ వినకుండా సాత్యకి భూరిశ్రవుని తల ఖండింస్తాడు.
కురుక్షేత్ర సంగ్రామంలో సాత్యకి, కృతవర్మ ఇద్దరూ బ్రతికారు. కృతవర్మ కృపాచార్యుడు మరియు అశ్వద్దామలతో కలసి రాత్రి వేళ పాండవుల కుమారులను నిద్రిస్తున్నప్పుడు చంపుటలో పాల్గొన్నాడు. 36 ఏళ్ల తరువాత ఒకరోజు రాత్రి జరిగిన పోరాటంలో సాత్యకి నిద్రపోతున్న సైనికులను చంపావని కృతవర్మని, కృతవర్మ నిరాయుధుడైన భూరిశ్రవుని చంపావని సాత్యకిని పరస్పరం నిందించుకొన్నారు. ఆ యుద్ధములో సాత్యకి, కృతవర్మ, మిగిలిన యాదవ వంశం మొత్తం గాంధారి శాపం మూలంగా నాశనం అయింది.

కృతవర్మ

కృతవర్మ ప్రముఖ యాదయ యోధుడు, సైన్యాధ్యక్షుడు. ఈయన కృష్ణుని సమకాలికుడు. మహాభారతం, విష్ణుపురాణము, భాగవతం మరియు హరివంశము వంటి ప్రాచీన సంస్కృత గ్రంథాలలో కృతవర్త ప్రసక్తి కనిపిస్తుంది.
కృతవర్మ యాదవకులంలోని అంధక తెగలో జన్మించాడు. కొన్ని మూలాలు ఈయన కృష్ణుని ముత్తాతైన హృతికుని సోదరునిగా ప్రస్తావించాయి. కానీ ఇది అసంబంద్ధంగా అనిపిస్తుంది. విష్ణుపురాణములో కృతవర్మ కృష్ణుని భక్తునిగా వర్ణించబడినా, ఈయనకు కృష్ణునితో మంచి సంబంధాలు ఉన్నట్టు కనిపించదు. శమంతకమణి వ్యవహారములో కృష్ణుని మామ అయిన సత్రాజిత్తును హతమార్చడానికి కుట్రపన్నిన వారిలో కృతవర్మ కూడా ఒకడు.
కురుక్షేత్ర యుద్ధ సమయంలో, కృతవర్మ కౌరవుల పక్షాన చేరి పాండవులకు వ్యతిరేకంగా యాదవ సైన్యాన్ని (దీన్నే నారాయణి సేన అని కూడా అంటారు) నడిపించాడు. మొత్తం కౌరవ సైన్యంలో కెల్లా సజీవంగా మిగిలిన ముగ్గురిలో కృతవర్మ ఒకడు. రాత్రి సమయంలో నిద్రిస్తున్న ఉపపాండవులను హత్య చేయటమనే నీచకార్యములో అశ్వద్దామకు సహకరించాడు. హత్యగావించబడిన వాళ్లలో పాండవ పక్ష సర్వసైన్యాధ్యక్షుడు దృష్టద్యుమ్నునితో పాటు శిఖండి మరియు ద్రౌపది యొక్క ఐదుగురు కుమారులు కూడా ఉన్నారు. ఈ ఘట్టము మహాభారతంలోని సౌప్తిక పర్వంలో వర్ణించబడింది. మహాభారత యుద్ధానంతరం కృతవర్మ తన రాజ్యానికి తిరిగి వెళ్ళాడు. మహాభారతంలోని మౌసల పర్వంలో తెలియజేసిన విధంగా యాదవ వినాశన కాలములో కృతవర్మ ద్వారకలో సాత్యకి చేతిలో మరణించాడు.

దృష్టద్యుమ్నుడు

దృష్టద్యుమ్నుడు ద్రుపదుని కుమారుడు.. ద్రౌపది అన్న.. ద్రుపదుడు చేసిన యజ్ఞంలో ద్రౌపదితో పాటు దృష్టద్యుమ్నుడు ఉద్భవించాడు.. తన స్నేహితుడు.. తనను అవమానించిన పాండవుల గురువు ద్రోణుని సంహరించేందుకు ద్రుపదుడు తపస్సు చేయగా.. వరం చేత దృష్టద్యుమ్నుడు జన్మించాడు.. ఇతడు కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల సైన్యానికి సర్వసైన్యాధ్యక్షుడిగా ఉన్నాడు.. కురుక్షేత్ర యుద్ధంలో ద్రోణుని హతమార్చి, తన తండ్రి ద్రుపదుని కోరికను నెరవేర్చాడు.. చివరికి ద్రోణుని కుమారుడు అశ్వత్థామ చేతిలో ఘోరంగా మరణించాడు

ద్రుపదుడు

ద్రుపదుడు పాంచాల దేశానికి రాజు. ఇతనికి యజ్ఞసేనుడు అని కూడా పేరు.
విద్యాభ్యాస సమయంలో ద్రోణుడు అతడికి సహాధ్యాయి, మంచి మిత్రుడు. తమ మైత్రిని పురస్కరించుకుని, తన సకల సంపదలను పంచుకుంటాను అని ద్రోణునికి మాట ఇచ్చాడు. ద్రుపదుడు రాజ్యాధికారానికి వచ్చాక ద్రోణుడు అతనిని కలసి, చిన్నప్పుడు ఇచ్చిన మాట గుర్తు చేసి సహాయం చేయమన్నాడు. ద్రుపదుడు అతడిని గుర్తించనట్లుగా నటించి, అవమానించి పంపివేసాడు. ఆ సంఘటనతో ద్రోణుడు ద్రుపదునిపై కోపం వహించి ఉన్నాడు. తరువాత ద్రోణుడు హస్తినాపురం సందర్శించి కౌరవ పాండవులకు గురువుగా నియమితుడయ్యాడు. విద్యాభ్యాసం పూర్తయిన తరువాత గురుదక్షిణగా ద్రుపదుని బంధించి తెమ్మని తన శిష్యులను అడిగాడు. అర్జునుడు ద్రుపదుని బంధించి తెచ్చి ద్రోణునికి సమర్పించాడు. ద్రోణుడు అతడిని అవమానించి, రాజసభలో ద్రుపదుడు తనకు చేసిన అవమానానికి ప్రతీకారం తీర్చుకున్నాడు.
భీష్ముని చేతిలో భంగపడిన అంబ, శిఖండిగా ద్రుపదునికి జన్మించింది. ద్రోణుడు తనకు చేసిన అవమానానికి ప్రతీకారం తీర్చుకొనేందుకు యాగం చేసాడు. ఆ యాగ ఫలంగా ద్రౌపది, దృష్టద్యుమ్నులను సంతానంగా పొందాడు.
కురుక్షేత్ర సంగ్రామంలో ద్రోణుడు ద్రుపదుని చంపాడు. ఆ యుద్ధంలోనే దృష్టద్యుమ్నుడు ద్రోణుని వధించాడు.

ద్రోణాచార్యుడు

భరద్వాజ మహాముని పుత్రుడు ద్రోణుడు. వేదవేదాంగాలన్నీ అభ్యసించాడు. ద్రోణుడితో పాంచాల దేశపు రాజకుమారుడు ద్రుపదుడు అస్త్రవిద్య నేర్చుకున్నాడు. వీరిద్దరికీ గాఢమైన స్నేహం కుదిరింది. ఆ కారణంగా ద్రుపదుడు తాను రాజయ్యాక ద్రోణుడికి సగ రాజ్యం ఇస్తానని మాటిచ్చాడు. ఆశ్రమవాసం పూర్తి చేసుకున్న తరువాత కృపాచార్యుడి చెల్లెలు కృపిని వివాహం చేసుకున్నాడు. వీరి కుమారుని పేరు అశ్వత్థామ. అశ్వత్థామ జననానంతరం అతనిని పోషించటం కూడా వీలుకాని దుర్భర దారిద్యంతో బాదపడుతున్న తరుణంలో బాల్య మిత్రుడు ద్రుపదుడు విద్యాభ్యాస సమయంలో ఇచ్చిన మాటను పురస్కరించుకుని ఆతని సహాయం కోరటానికి వెళతాడు. ద్రుపదుడు అతనిని అవమానించి రిక్త హస్తాలతో వెనుకకు పంపించాడు. ఆ అవమానాన్ని సహించ లేని ద్రోణుడు అతనిని ఎలాగైనా తిరిగి అవమానించాలని పంతం పట్టి తన శిష్యుడైన అర్జునిని సహాయంతో ద్రుపదుని పట్టి బంధించి అతనికి బుద్ధి చెప్పి తిరిగి పంపించటం భారతంలో ఒక ప్రధాన ఘట్టం.
అతనికి భార్యాబిడ్డలమీద ఉన్న అత్యంత ప్రీతి కారణంగా ఎలాగైనా ధనం సంపాదించాలని కోరిక ఉండేది.పరశురాముడు తన ధనమంతా బ్రాహ్మణులకు దానం ఇస్తున్నాడని విని అతని వద్దకు దానం స్వీకరించడానికి వెళ్తాడు. ద్రోణుడు అక్కడకు చేరే సమయానికి పరశురాముడు ధనమంతా దానం చేసాడు. పరశురాముడు ద్రోణుని చూసి "నాదగ్గర ఉన్న ధనమంతా దానం చేసాను ఇప్పుడు నా దగ్గర నా శరీరం అస్త్రవిద్య మాత్రమే ఉన్నాయి కాబట్టి అస్త్రవిద్య కావాలంటే నేర్పుతానని చెప్పాడు. ద్రోణుడు అందుకు సమ్మతించి అతని వద్ద అస్త్రవిద్య నేర్చుకున్నాడు. అది తరువాతి కాలంలో హస్థినాపురంలో కౌరవులకు పాండవులకు అస్త్రవిద్య నేర్పటానికి దారితీసింది.
ద్రోణాచార్యుడు మహాభారతంలో కౌరవులకూ మరియు పాండవులకు రాజగురువు. దేవశాస్త్రాలతో సహా యుద్ధ విద్యలలోనూ, అస్త్ర శస్త్ర విద్యలలోనూ ఆరి తేరిన వాడు. అర్జునుడు అతనికి ప్రియ విద్యార్థి. ద్రోణుడికి అర్జునుడి కన్న ప్రియమైన వారు ఎవరున్నా ఉన్నారంటే అది తన కుమారుడు అశ్వథ్థామ.

పరశురాముడు

శ్రీమహావిష్ణువు దశావతారములలో పరశురామావతారము (Parasurama Incarnation) ఆరవది. త్రేతాయుగము ఆరంభములో జరిగింది. అధికార బల మదాంధులైన క్షత్రియులను శిక్షించిన అవతారమిది. పరశురాముని భార్గవరాముడు, జామదగ్ని అని కూడా అంటారు[

పరశురాముని జన్మవృత్తాంతం

కుశ వంశానికి చెందిన మహారాజు గాధి. ఒకసారి భృగు వంశానికి చెందిన ఋచీకుడు అనే మహర్షి గాధి దగ్గరికి వెళ్ళి ఆయన కూతురు సత్యవతిని తనకిచ్చి వివాహం చెయ్యమని కోరగా ఆ మహారాజు నున్నటి శరీరం నల్లటి చెవులు గల వెయ్యి గుర్రాలు ఇమ్మని కోరుతాడు. ఋచీకుడు వరుణుని ప్రార్థించి వెయ్యి గుర్రాలు తెచ్చి సత్యవతిని పెళ్ళి చేసుకొన్నాడు[3]. ఇలా జరుగుతుండగా ఒక రోజు సత్యవతి ఋచీకుని దగ్గరకు వచ్చి తనకు, తన తల్లికి పుత్రసంతానం ప్రసాదించమని కోరగా ఉచీకుడు యాగం చేసి విప్రమంత్రపూతం అయిన ఒక హవిస్సు, రాజమంత్రపూతం అయిన ఒక హవిస్సు తయారుచేసి స్నానానికి వెళ్ళతాడు. సత్యవతి ఈ విషయం తెలియక రాజమంత్రపూతమైన హవిస్సు తను తీసుకొని విప్రమంత్రపూతమైన హవిస్సు తల్లికి ఇస్తుంది. ఋచీకునికి సత్యవతి విషయం తెలిపి ప్రాధేయపడగా తనకొడుకు సాత్వికుడిగ ఉండి, మనుమడు ఉగ్రుడు అవుతాడు అని పల్కుతాడు[4]. ఋచీకుని కుమారుడు జమదగ్ని. జమదగ్ని కొడుకు పురుషోత్తమాంశతో జన్మించినవాడు పరశురాముడు[3]. గాధి కొడుకే విశ్వామిత్రుడు. భృగు వంశాను చరితంగా జమదగ్నికి కూడా కోపము మెండు. ఆయన పత్ని రేణుకాదేవి. జమదగ్ని, రేణుకల చిన్న కొడుకు పేరు పరశురాముడు. పరశురాముడు శివుని వద్ద అస్త్రవిద్యలను అభ్యసించి, అజేయ పరాక్రమవంతుడై, ఆయన నుండి అఖండ పరశువు (గండ్ర గొడ్డలి) పొంది, పరశురాముడైనాడు.

కార్తవీర్యునితో వైరం.

హైహయ వంశజుడైన కార్తవీర్యార్జునుడు శాపవశమున చేతులు లేకుండా జన్మించాడు.. గొప్ప తపస్సుచేసి, దత్తాత్రేయుని ప్రసన్నము చేసుకొని, వేయి చేతులు పొంది, మహావీరుడైనాడు. ఒకమారు ఆ మహారాజు వేటకై వెళ్ళి, అలసి జమదగ్ని ఆశ్రమానికి చేరుతాడు. ఆ మహర్షి కార్తవీర్యార్జునునికి, ఆయన పరివారానికి పంచభక్ష్యాలతో భోజనం పెడతాడు. ఆ మహర్షి ఆర్భాటం చూసిన కార్తవీర్యార్జునుడు ఆశ్చర్యపడి, దీనికి కారణం అడుగగా జమదగ్ని తన దగ్గర కామధేనువు సంతానానికి చెందిన గోవు వల్ల ఇది సాధ్యపడింది అని తెలిపాడు. ఆ గోవును తనకిమ్మని ఆ మహారాజు కోరతాడు. జమదగ్ని నిరాకరిస్తాడు. కార్తవీర్యార్జునుడు బలవంతంగా ఆ గోవుని తోలుకుపోతాడు. పరశురాముడు ఇంటికి వచ్చి విషయం గ్రహించి మాహిష్మతికి పోయి కార్తవీర్యార్జునునితో యుద్ధంచేసి అతని వెయ్యిచేతులు, తలను తన అఖండ పరశువుతో ఛేదిస్తాడు[3]. ఈ విషయాన్ని తన తండ్రికి విన్నవించగా తండ్రి మందలించి పుణ్యతీర్థాలు సందర్శించి రమ్మంటాడు. ఒక సంవత్సరం పాటు వివిధ పుణ్యక్షేత్రాలు దర్శించి వస్తాడు.
కాలం ఇలా నడుచుచుండగా ఒకసారి రేణుక నీటి కొరకు చెరువుకు వెళ్తుంది. అక్కడ గంధర్వుల జలకేళి చూస్తూ ఉండటం వల్ల తిరిగి రావడం ఆలస్యమౌతుంది. కోపించిన జమదగ్ని ఆమెను సంహరించవలెనని కొడుకులను ఆదేశిస్తాడు. పెద్దకొడుకులు అందుకు సమ్మతించరు. తల్లిని, సోదరులను సంహరించమని జమదగ్ని పరశురాముని ఆదేశించగా, అతడు తండ్రి చెప్పినట్లే చేస్తాడు. జమదగ్ని సంతోషించి ఏమైనా వరము కోరుకొమ్మనగా పరశురాముడు తల్లిని, సోదరులను బ్రతికించమంటాడు. ఈ విధముగా పరశురాముడు తన తల్లిని సోదరులను తిరిగి బ్రతికించుకొంటాడు.
ఒకరోజు పరశురాముడు ఇంట్లోలేని సమయం చూసి, కార్తవీర్యార్జునుని కుమారులు జమదగ్ని తల నరికి మాహిష్మతికి పట్టుకు పొతారు. పరశురాముని తల్లి రేణుక తండ్రి శవంపై పడి రోదిస్తూ 21 మార్లు గుండెలు బాదుకుంటుంది. పరశురాముడు మాహిష్మతికి పోయి కార్తవీర్యార్జునుని కుమారులులను చంపి జమదగ్ని తలను తెచ్చి మెండానికి అతికించి బ్రతికిస్తాడు.
ఆ తరువాత పరశురాముడు యావత్ క్షత్రియ జాతిపై ఆగ్రహించి వారిపై 21 మార్లు దండెత్తి క్షత్రియవంశాలను నాశనం చేస్తాడు. శ్యమంతక పంచకమనే 5 సరస్సులను క్షత్రియుల రక్తంతో నింపి పరశురాముడు తల్లిదండ్రులకు తర్పణం అర్పిస్తాడు. దశరథునివంటి కొద్దిమంది రాజులు గోవుల మందలలో దాగుకొని తప్పుకొన్నారు. తరువాత పరశురాముడు భూమినంతటినీ కశ్యపునకు దానమిచ్చి తాను తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు.పరశురాముడు మహా పరాక్రమవంతుడు.

రామాయణంలో పరశురాముడు

సీతా స్వయంవరంలో శ్రీ రాముడు శివ ధనుస్సును విరచిన తరువాత సీతారాముల కల్యాణం జరిగింది. తన గురువైన శివుని విల్లు విరచినందుకు పరుశురాముడు కోపించి, రామునిపై యుద్ధానికి సిద్ధపడ్డాడు. దశరధుని అభ్యర్ధనలను, రాముని శాంత వచనాలనూ పట్టంచుకొనలేదు. చేతనైతే ఈ విష్ణుచాపాన్ని ఎక్కుపెట్టమని తన ధనస్సును రామునకిచ్చాడు. రాముడు దానిని అవలీలగా ఎక్కుపెట్టాడు. రామచంద్రమూర్తి ఎక్కుపెట్టిన బాణాన్ని ఎక్కడకు విడవాలి అని అడుగగా తన తపోశక్తి కొట్టై మని చెప్పి తాను మహేంద్రగిరిపై తపస్సు చేసికోవడానికి వెళ్ళిపోయాడు. ఆ విధంగా ధనస్సును పరశురాముడు రామునకు అందించినపుడు పరశురామునికీ రామునికీ భేదం లేదని ఇద్దరికీ అవగతమైనది.

మహాభారతంలో పరశురాముడు

మహాభారతంలో పరశురాముడు ముగ్గురు వీరులకు గురువైనాడు. గంగాదేవి అభ్యర్ధనపై భీష్మునకు అస్త్రవిద్యలు బోధీంచాడు. తరువాత అంబికను వివాహంచేసుకొనమని చెప్పగా ఆజన్మబ్రహ్మచర్యవ్రతుడైనందున భీష్ముడు అందుకు తిరస్కరించాడు. ఇద్దరికీ జరిగిన మహాయుద్ధంలో ఎవరూ వెనుకకు తగ్గలేదు. దేవతల అభ్యర్ధనమేరకు యద్ధం నిలుపబడింది.
కర్ణుడు తాను బ్రాహ్మణుడనని చెప్పి పరశురాముని వద్ద శిష్యునిగా చేరాడు. తరువాత కర్ణుని అబద్ధాన్ని తెలిసికొన్న పరశురాముడు యుద్ధకాలంలో విద్యలు గుర్తుకు రావని శపించాడు.
ద్రోణాచార్యుడు కూడా పరశురాముని వద్ద దివ్యాస్త్రాలను గ్రహించాడు. అర్జునుడు కూడా మహేంద్ర పర్వతంపై పరశురాముని దర్శించుకొన్నాడు

మరికొన్ని విషయాలు

స్కాంద పురాణం ప్రకారం పరశురాముడు వైశాఖ శుద్ధ తదియ నాడు జన్మించినట్లుగా పేర్కొనబడింది. అందువలన ఆ రోజు పరశురామ జయంతి జరుపుకుంటారు.
పరశురాముడు దత్తాత్రేయుని వద్ద శిష్యునిగా చేరి అనేక విద్యలను నేర్చుకొన్నాడు. ఈ అంశాలు స్కాంద పురాణంలో వివరించబడింది.
ఒకమారు పరశురాముడు శివుని దర్శించబోగా ద్వారం వద్ద వినాయకుడు అడ్డగించాడు. కోపంతో పరశురాముడు తన పరశువును విసిరేశాడు. తన తండ్రియైన శివుని ప్రసాదమైన పరశువుపై గౌరవంతో వినాయకుడు ఆ పరశువుతో తన దంతం విరిగేలా సమర్పించుకొన్నాడు.
పరశురాముడు చిరంజీవి. కల్క్యవతారమునకు విద్యలుపదేశిస్తాడనీ, తరువాతి మన్వంతరములో సప్తర్షులలో ఒకడవుతాడనీ కథ.
పరశురాముడు పూర్ణావతారము కాదనీ, అవశేషావతారమనీ అంటారు. కనుక పరశురాముని స్తోత్రాలూ, మందిరాలూ చాలా తక్కువ.
భూమినంతటినీ కశ్యపునకు దానమిచ్చిన తరువాత పరశురామునికి తపస్సు చేసికోవడానికి చోటు లేదు. ఆయన తన పరశువును సముద్రంలోకి విసిరేయగా, ఆయనపై గౌరవంతో అంతవరకు సముద్రుడు వెనుకకు తగ్గాడు. అలా వెలువడిన భూభాగమే నేటి కేరళ అని నమ్మిక. ఇలా వెలువడ భూమిలో గల 7 ప్రదేశాలను పరశురామక్షేత్రాలు అని అంటారు.
కేరళలో తిరువనంతపురం దగ్గర, తిరువళ్ళంలో కరమణ నది ఒడ్డున ఒక పురాతనమైన పరశురామ మందిరం ఉంది. ఇది 2వేల సంవత్సరాలనాటిదంటారు. ఇక్కడ పితృదేవతలను పూజించడం ఆచారం.

స్తోత్రాలు

రామదాసు రచించిన దాశరధీ శతకములో పరశురాముని స్తుతి
ఇరువదియొక్క మాఱు ధరణీశులనెల్ల వధించి తత్కళే
బర రుధిర ప్రవాహమున బైతృక తర్పణమొప్పజేసి భూ
సురవరకోటికిన్ ముదము సొప్పడ భార్గవరామమూర్తివై
ధరణినొసంగితీనె కద దాశరధీ కరుణా పయోనిధీ.
జయదేవుని దశావతార స్తుతి నుండి
క్షత్రియ రధిర మయే జగదపగతపాపమ్
స్నపయసి పయసి శమిత భవ తాపమ్
కేశవ! ధృత భృగుపతి రూప!
జయ జగదీశ ! హరే!