వెనకకు భగవద్గీత ముందుకు
1 అర్జునవిషాద యోగము
||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ ప్రథమోऽధ్యాయః - అర్జునవిషాదయోగః

17 వ శ్లోకం

కాశ్యశ్చ పరమేష్వాసః శిఖణ్డీ చ మహారథః | ధ
ృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చాపరాజితః ||1-17|| .

ఓ రాజా గొప్ప ధనువు కలిగినకాశీ రాజు, మహారధుదైన శిఖండీ, దృష్టద్యుమ్నుడూ, విరాటుడూ, అపరాజితుడైన సాత్యకీ;


పంచజనుడను రాక్షసుని యొక్క ఎముకలచే నేర్పడిన దగుటచే శ్రీకృష్ణుని శంఖమునకు పాంచజన్యమను పేరు గల్గినది. సర్వసాక్షి,ఇంద్రియములకు అధిపతియగుటచే శ్రీకృష్ణపరమాత్మకు హృషికేశుడను పేరు గల్గినది. రాజసూయయాగ సంధర్భమున ఎందరో రాజులనుండి ధనమును తెచ్చిన వాడగుటవల్ల అర్జుననకు ధనంజయుడను పేరు గల్గినది.వృకమను అగ్ని ఉదరమందు కలవాడగుటవల్ల భీమునకు వృకోధరుదను పేరు గల్గినది.
_________________

మహా భారతము

ఇది మహాభారత గాథను గురించిన వ్యాసం. తెలుగులో కవిత్రయం వ్రాసిన గ్రంధాన్ని గురించిన వ్యాసాన్ని శ్రీ మదాంధ్ర మహాభారతం వద్ద చూడవచ్చు. భారతము అయోమయ నివృత్తి పేజీ కూడా చూడండి
మహాభారతం హిందువులకు పంచమ వేదముగా పరిగణించబడే భారత ఇతిహాసము. సాహిత్య చరిత్ర (History of Epic Literature) పక్రారం మహాభారత కావ్యము వేద కాలం తర్వాత, అనగా సుమారు 400 B.C లో దేవనాగరి భాష అనబడిన సంస్కృతం భాషలో రచించబడినది [1][2][3][4][5][6] మహాభారత మహాకావ్యాన్ని వేదవ్యాసుడు చెప్పగా గణపతి రచించాడని హిందువుల నమ్మకం. 18 పర్వములతో, లక్ష శ్లోకములతో (74,000 పద్యములతో లేక సుమారు 18 లక్షల పదములతో) ప్రపంచము లోని అతి పెద్ద పద్య కావ్యములలో ఒకటిగా అలరారుచున్నది. ఈ మహా కావ్యాన్ని 14వ శతాబ్దంలో కవిత్రయముగా పేరు పొందిన నన్నయ, తిక్కన, ఎర్రన (ఎఱ్ఱాప్రగడ) లు తెలుగు లోకి అనువదించారు.

కావ్య ప్రశస్తి

"యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి న తత్క్వచిత్" - "ఇందులో ఏది ఉందో అదే ఎక్కడైనా ఉంది. ఇందులో లేనిది మరెక్కడా లేదు" అని ప్రశస్తి పొందింది. హిందువులకు ఎంతో పవిత్ర గ్రంథాలైన భగవద్గీత, విష్ణు సహస్రనామ స్తోత్రము కూడా మహాభారతంలోని భాగాలే. దీనిని బట్టి ఈ కావ్య విశిష్టతను అంచనా వేయవచ్చును.

ఈ కావ్యవైభవాన్ని నన్నయ:

“ దీనిని ధర్మ తత్త్వజ్ఞులు ధర్మశాస్త్రమనీ, ఆధ్యాత్మవిదులు వేదాంతమనీ, నీతి విచక్షణులు నీతి శాస్త్రమనీ, కవులు మహాకావ్యమనీ అంటారు. లాక్షణికులు సర్వ లక్షణ సంగ్రహమనీ, ఐతిహాసికులు ఇతిహాసమనీ, పౌరాణికులు బహుపురాణ సముచ్ఛయమనీ కొనియాడుతారు. వివిధ తత్త్వవేది, విష్ణు సన్నిభుడు అయిన వేదవ్యాసుడు దీనిని విశ్వజనీనమయ్యేలా సృజించాడు. ”
మహాభారత గాథను వ్యాసుడు ప్రప్రథమంగా తన శిష్యుడైన వైశంపాయనుడి చేత సర్పయాగం చేయించేటపుడు జనమేజయ మహారాజుకి చెప్పించగా, అదే కావ్యాన్ని తరువాత నైమిశారణ్యంలో శౌనక మహర్షి సత్రయాగము చేయుచున్నప్పుడు సూతమహర్షి అక్కడకు వచ్చిన ఋషులకు చెప్పాడు.
మహాభారతాన్నిచెరకుగడతో పోల్చారు. పర్వము అంటే చెరకు కణుపు. 18 కణుపులు (పర్వములు) కలిగిన పెద్ద చెరకుగడ, మహాభారతం. చెరకును నములుతున్న కొద్దీ రసం నోటిలోకి వచ్చి, నోరు తీపి ఎక్కుతుంది. అలాగే భారతాన్ని చదివిన కొద్దీ జ్ఞానం పెరుగుతుంది.

మహాభారతంలోని విభాగాలు

మహాభారతంలో 18 పర్వములు, వాటిలో జరిగే కథాక్రమం ఇది:
ఆది పర్వము: 1-19 ఉపపర్వాలు - పీఠిక, కురువంశం కథ, రాకుమారుల జననం, విద్యాభ్యాసం.
సభా పర్వము: 20-28 ఉపపర్వాలు - కురుసభా రంగం, మయసభ, పాచికల ఆట, పాండవుల ఓటమి, రాజ్యభ్రష్టత.
వన పర్వము (లేక) అరణ్య పర్వము: 29-44 ఉపపర్వాలు - అరణ్యంలో పాండవుల 12 సంవత్సరాల జీవనం.
విరాట పర్వము: 45-48 ఉపపర్వాలు - విరాటరాజు కొలువులో ఒక సంవత్సరం పాండవుల అజ్ఞాతవాసం.
ఉద్యోగ పర్వము: 49-59 ఉపపర్వాలు - కౌరవ పాండవ సంగ్రామానికి సన్నాహాలు.
భీష్మ పర్వము: 60-64 ఉపపర్వాలు - భీష్ముని నాయకత్వంలో సాగిన యుద్ధం.
ద్రోణ పర్వము 65-72 ఉపపర్వాలు - ద్రోణుని నాయకత్వంలో సాగిన యుద్ధం.
కర్ణ పర్వము: 73 వ ఉపపర్వము - కర్ణుని నాయకత్వంలో సాగిన యుద్ధం.
శల్య పర్వము: 74-77 ఉపపర్వాలు - శల్యుడు సారథిగా సాగిన యుద్ధం.
సౌప్తిక పర్వము: 78-80 ఉపపర్వాలు - నిదురిస్తున్న ఉపపాండవులను అశ్వత్థామ వధించడం.
స్త్రీ పర్వము: 81-85 ఉపపర్వాలు - గాంధారి మొదలగు స్త్రీలు, మరణించినవారికై రోదించడం.
శాంతి పర్వము: 86-88 ఉపపర్వాలు - యుధిష్ఠిరుని రాజ్యాభిషేకం. భీష్ముని ఉపదేశాలు.
అనుశాసనిక పర్వము: 89-90 ఉపపర్వాలు - భీష్ముని చివరి ఉపదేశాలు (అనుశాసనాలు)
అశ్వమేధ పర్వము: 91-92 ఉపపర్వాలు - యుధిష్ఠిరుని అశ్వమేధ యాగం.
ఆశ్రమవాస పర్వము: 93-95 ఉపపర్వాలు - ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి ప్రభృతులు చివరి రోజులు ఆశ్రమవాసులుగా గడపడం.
మౌసల పర్వము: 96వ ఉపపర్వం - యదువంశంలో ముసలం, అంతఃకలహాలు.
మహాప్రస్ధానిక పర్వము: 97వ ఉపపర్వం - పాండవుల స్వర్గ ప్రయాణం ఆరంభం.
స్వర్గారోహణ పర్వము:98వ ఉపపర్వం - పాండవులు స్వర్గాన్ని చేరడం.
హరివంశ పర్వము: శ్రీకృష్ణుని జీవితగాథ వీటిలో మొదటి అయిదు పర్వాలను ఆదిపంచకము అనీ, తరువాతి ఆరు పర్వాలను యుద్ధషట్కము అనీ, ఆ తరువాతి ఏడు పర్వాలను శాంతిసప్తకము అనీ అంటారు.

మహాభారతం ప్రత్యేకతలు

మహాభారత రచన చేసినది పరాశర మహర్షి కుమారుడయిన వేదవ్యాసుడు (500 B.C?-300 B.C?).
మహాభారతకథను వ్యాసుడు రచన చేసిన సమయం మూడు సంవత్సరాలు .
మహాభారతకథను చెప్పడానికి స్వర్గలోకంలో నారద మహర్షిని, పితృలోకములో చెప్పడానికి దేవల మహర్షిని, గరుడ గంధర్వ లోకాలలో చెప్పడానికి శుక మహర్షిని, సర్పలోకంలో చెప్పడానికి సుమంతుడిలని, మానవలోకంలో చెప్పడానికి వైశంపాయన మహర్షిని నియమించాడు.
అంతకు పూర్వం దేవాసురయుధ్దంలా కురుక్షేత్రంలో మహాభారత యుద్ధం జరిగింది.
ఈ యుద్ధంలో భీష్ముడు 10 రోజులు, ద్రోణుడు 5 రోజులు, కర్ణుడు 2 రోజులు, శల్యుడు అర్ధరోజు సైన్యాధ్యక్షత వహించారు. మిగిలిన సగం రోజు భీముడు ధుర్యోధనుడితో యుద్ధం చేసాడు.
ఈ యుద్ధంలో పోరాడి మరణించిన వారి సంఖ్య 18 అక్షౌహిణులు. వీరిలో కౌరవ పక్షం వహించి పోరాడిన వారి సంఖ్య 11

అష్టసిద్ధులు

అణిమా మహిమా చైవ గరిమా లఘిమా తథా,
ప్రాప్తిః ప్రాకామ్య మీశత్వం వశిత్వం చాష్ట సిద్ధయః

అణిమ: శరీరమును అతి చిన్నదిగా చేయుట
మహిమ: శరీరమును అతి పెద్దదిగా చేయుట
గరిమ: శరీరము బరువు విపరీతముగా పెంచుట
లఘిమ: శరీరమును అతి తేలికగా చేయుట
ప్రాప్తి: కావలసిన వస్తువులు పొందుట
ప్రాకామ్యం: కావలసిన భోగము అనుభవించుట
ఈశత్వం : ఎవరిపైనైనా, దేనిపైనైనా అధికారము పొందుట
వశీత్వం: అన్ని భూతములను లోబరచుకొనుట

అష్టాదశసిద్ధులు

మార్కండేయ పురాణములో అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశీత్వం అని సిద్ధులు అష్టవిధములుగా పేర్కొనబడినవి. బ్రహ్మ వైవర్త పురాణమున శ్రీకృష్ణ జన్మ ఖండమునందు సిద్ధులు అష్టాదశవిధములుగా తెలుపబడినవి.
అణిమ
లఘిమ
ప్రాప్తి
ప్రాకామ్యము
మహిమ
ఈశిత్వము, వశిత్వము
సర్వకామావసాయిత
సర్వజ్ఙత్వము
దూరశ్రవణము
పరకాయప్రవేశము
వాక్సిద్ధి
కల్పవృక్షత్వము
సృష్టి
సంహారకరణ సామర్ధ్యము
అమరత్వము
సర్వనాయకత్వము
భావన
సిద్ధి
గీతాప్రెస్, గోరఖ్ పూర్ వారి ప్రచురణ -"నవదుర్గ"లో "సిద్ధిధాత్రి" వివరణనుండి.