వెనకకు భగవద్గీత ముందుకు

1 అర్జునవిషాద యోగము


||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ ప్రథమోऽధ్యాయః - అర్జునవిషాదయోగః

22 వ శ్లోకం

యావదేతాన్నిరీక్షేऽహం యోద్ధుకామానవస్థితాన్ |
కైర్మయా సహ యోద్ధవ్యమస్మిన్ రణసముద్యమే ||1-22|| .

యుద్ధం చేయగోరి ఎదురు చూస్తూ నిలబది ఉన్న వారిన్లో నేను ఎవరితో యుద్ధం చేయాలో వారిని చూడాలి

. అర్జునుడు సేనయోర్ఉభయో అని ఇరు సేనల మధ్యలో నిలపమని అచ్యుతుని అంటే ఎప్పటికీ చ్యుతి లేని వాడిన శ్రీకృష్ణుని ప్రార్దిస్తున్నాడు. కౌరవులు కేవలం యుద్ధం కోసం కాంక్షించారు కానీ ఎప్పుడూ కూడా సంధి కానీ శాంతి కోసం కానీ ప్రయత్నం చెయ్యలేదు, కానీ పాండవులు యుద్ధాన్ని నివారించడానికి చివరదాకా ప్రయత్నించి ఇక కౌరవులు దిగిరాకపోతే తప్పనిసరి పరిస్థితులలో యుద్ధం చెయ్యడానికి వచ్చారు. అర్జునుడు ప్రేక్షకుడు కాదు కదా మరి రెండు సైన్యాల మధ్యలో నిలుచుని ఏమి చూడదలసుకున్నాడు అంటే ఈ యుద్ధం తన బంధువుల మధ్య జరుగుతున్నది, అర్జునుడు ఎవరెవరు వైరి పక్షంలో తన స్నేహితులు ఉన్నారో వారెవరు యుద్ధానికి సన్నద్దులయ్యరో ఎవరితో యుద్ధం చెయ్యాలో చూడడానికి మధ్యలో నిలపమన్నాడు.

పరీక్షిత్తు

పరీక్షిత్తు (సంస్కృతం: परिक्षित्, IAST: Parikṣit, with the alternative form: परीक्षित्, IAST: Parīkṣit) పాండవుల తరువాత భారతదేశాన్ని పరిపాలించిన మహారాజు. ఇతను అర్జునుడి మనవడు, అభిమన్యుని కుమారుడు. ఇతని తల్లి ఉత్తర. తల్లి గర్భంలో ఉన్నప్పుడే అశ్వత్థామ ఇతనిపై బ్రహ్మ శిరోనామకాస్త్రము ప్రయోగించెను. దాని మూలంగా కలిగిన బాధనోర్వలేక ఉత్తర శ్రీకృష్ణుని ప్రార్థించెను. ఆతని కరుణ వలన బాధ నివారణమై శిశువుగా ఉన్న పరీక్షిత్తు బ్రతికెను. ఇతడు ఉత్తరుని కూతురు ఇరావతిని వివాహము చేసుకొనెను. ఇతని కుమారుడు జనమేజయుడు.
అవి మహాభారతము యుద్ధము చివరి రోజు, దుర్యోధనుడు కూడా నేలకొరిగినాడు. అశ్వద్దామ మరియు అర్జునుడు ఇద్దరూ పరస్పరము బ్రహ్మాస్త్రాలు ప్రయోగించుకున్నారు: కానీ పెద్దల జోక్యముతో చివరకు అర్జునుడు బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించుకొనగా అశ్వద్దామ మాత్రం ఉపసంహరణవిధ్య తెలియక "అపాండవగుగాక" అని మరలించాడు, అనగా పాండవుల వారసులు అందరూ మరణించుగాక అని ప్రయోగించాడు. అప్పుడు కృష్ణుడు ఒక్కరిని కాపాడతాను అని మాట ఇచ్చి తల్లి కడుపులో ఉన్న పరీక్షిత్తుని తన యోగ మాయా శక్తి తో, చిన్న రూపుడై చతుర్భుజములతో, శంఖచక్రగదాకౌముదీ మొదలగు అస్త్రాలు ధరించి పిండరూపుడై ఉన్న బాలుని చుట్టూ తిరిగి కాపాడతాడు! అలా తిరుగుతున్నప్పుడు ఆ బాలుడు అలా ఉన్న కృష్ణుడిని చూసి "ఎవరు ఇతను" "ఇలా శంఖచక్రగదాకౌముదీ మొదలగు అస్త్రాలు ధరించి పీతాంబరాలతో, కిరీటముతో, వెలిగిపోతూ నా చుట్టూ తిరుగుతున్నాడు" అని తల్లి గర్భములోనే పరమాత్ముని పరీక్షించాడు. అందువల్ల ఇతనిని పరీక్షిత్తు అని అంటారు.
ఇతని కాలములోనే కలిపురుషుడు వస్తే అతనిని ఓడిస్తాడు. ధర్మరాజు అనంతరం పరీక్షిత్తునకు పాండు రాజ్యానికి పట్టాభిషేకం చేసెను. పరీక్షిత్తు 60 సంవత్సరాలు రాజ్యపాలన చేసెను. ఒకనాడు వేటకై అడవికి పోగా మృగమును తరుముచూ ఒక ముని ఆశ్రమము చేరెను. మృగమేమైనదని అడుగగా సమాధిలోనున్న ముని సమాధానం చెప్పలేదు. కోపించిన పరీక్షిత్తు అక్కడనున్న పాము శవాన్ని ముని మెడలో వేసి వెళ్ళిపోయాడు. ముని కుమారుడు శృంగి తన తండ్రి మెడలో సర్పమును వేసినవాడు ఏడు రోజులలో తక్షకుని చేత మృతి చెందుతాడని శపిస్తాడు. పరీక్షిత్తు తాను చేసిన నేరమునకు చింతించి సర్పములకు దుర్గమమైన చోట మేడ నిర్మించుకొని భద్రముగ ఉంటూ ప్రాయోపవిష్ఠుడై శుకుని వలన పుణ్యకథలను వినుచుండెను. శాప ప్రభావం వలన ఏడవ రోజు బ్రాహ్మణవేషధారులైన సర్పములు వచ్చి నిమ్మ పండ్లు కానుకిచ్చిరి. అందుండి వెలువడిన తక్షకుడు పరీక్షిత్తును కరచి అతనిని సంహరించెను. ఆ వారం రోజులలో విన్నదే మహాభాగవతము.
ఇతని కుమారుడు సర్పయాగం చేసిన జనమేజయుడు.

ఆస్తీకుడు

మహాభారతంలోని పాత్రలలో అస్తీకుడు కారణజన్ముడు. అస్తీకుని జన్మకు ఒక కారణం ఉంది. అర్జునుని మునిమనుమడు, అభిమన్యుని మనుమడు, పరీక్షిత్తు కుమారుడూ అయిన జనమేజయుడు ఉదంకుని ప్రేరణతో చేయతలపెట్టిన సర్పయాగాన్ని ఆపడానికి జన్మించినవాడే అస్తీకుడు.

దేవకి

దేవకి శ్రీకృష్ణుని తల్లి. దేవకుడి కూతురు. వసుదేవుడు ఈమె భర్త. కంసుడు ఈమె పినతండ్రి ఉగ్రసేనుడి కొడుకు. పూర్వజన్మలో ఈమె అదితి.
దేవకి స్వయంవరం సమయంలో శిని, సోమదత్తుడి మధ్య పోరాటం జరుగుతుంది. శిని తన స్నేహితుడు వాసుదేవుని కోసం ఆమెను అపహరిస్తాడు. దేవకి సోదరీమణులను కూడా వాసుదేవునికిచ్చి వివాహం జరిపిస్తాడు.
పెళ్ళి అయిన తర్వాత కంసుడు నూతన వధూవరులను రథంలో ఎక్కించుకుని మధురకు చేరుస్తానని ముందుకు వస్తాడు. వారు దారిలో వెళుతుండగా దేవకి గర్భంలో జన్మించే అష్టమ సంతానంతో అతనికి మరణం ప్రాపిస్తుందనీ పలుకుతుంది. దాంతో ఆగ్రహం చెందిన కంసుడు దేవకిని చంపబోతాడు. అప్పుడు వాసుదేవుడు అడ్డుకుని దయచేసి ఆమెను చంపవద్దనీ ఆమెకు పుట్టబోయే సంతానాన్ని కంసుడికి అప్పగిస్తాననీ మాట ఇస్తాడు. దాంతో కంసుడు ఆమెను చంపే ప్రయత్నాన్ని విరమించుకుంటాడు

వసుదేవుడు

వసుదేవుడు హిందూ పురాణాల ప్రకారం శ్రీకృష్ణుని తండ్రి. ఆయన చెల్లెలు కుంతీదేవిని పాండురాజు కిచ్చి వివాహం చేశారు. వసుదేవుడు కశ్యప మహర్షి యొక్క అంశతో జన్మించాడు. శ్రీకృష్ణునికి తండ్రి పేరును పోలిన వాసుదేవుడు అనే పేరు కూడా ఉంది. హరివంశ పురాణం ప్రకారం నందుడు, వసుదేవుడు అన్నదమ్ములు.

చారిత్రక నేపథ్యం

వసుదేవుడు అనే పేరు క్రీపూ 1000 నుంచి వైష్ణవ సాంప్రదాయంతో ముడిపడి ఉంది. ఆ కాలానికి వాసుదేవుడు (వసుదేవుని కుమారుడు వాసుదేవుడు అంటే శ్రీకృష్ణుడు) బ్రహ్మం గా ఆరాధింపబడేవాడు. దీనికి గ్రంథాల రూపంలోనూ, పురాతత్వ పరిశోధనల రూపంలోనూ ఆధారాలున్నాయి. మహానారాయణ ఉపనిషత్తులో ఏడవ అధ్యాయంలో ఒక శ్లోకం ఇలా ఉంది.
నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి, తన్నో విష్ణుః ప్రచోదయాత్
ఈ శ్లోకం ప్రకారం నారాయణుడన్నా, వాసుదేవుడన్నా, విష్ణువు అన్నా అంతా ఒకరే. అయితే దీని రచయిత, రాసిన సంవత్సరం మాత్రం తెలియలేదు. అయితే ఇందులో ఉన్న పాఠ్యం ఆధారంగా పరమేశ్వరానంద దీనిని కథోపనిషత్తు, మండూకోపనిషత్తు, ఈశోపనిషత్తు, శ్వేతాశ్వతారోపనిషత్తు కాలంలోనే రాసి ఉండవచ్చునని అభిప్రాయపడ్డాడు.

కంసుడు

కంసుడు భాగవత పురాణంలోని ఒక పాత్ర.
ఉగ్రసేనుడు అనె యాదవ రాజుకు కొడుకు. మధురాపురమునకు రాజు. శ్రీకృష్ణుని మేనమామ. ఇతడు పూర్వజన్మమునందు కాలనేమి అను రాక్షసుడు. కనుక ఈ జన్మమందును ఆవాసనతప్పక దేవతలకు విరోధియై అనేకులను రాక్షసులను తోడుచేసికొని సాధువులను బాధించుచు ఉండును. ఇట్లు ఉండి ఒకనాడు తన చెల్లెలు అగు దేవకీదేవిని వసుదేవునకు ఇచ్చి వివాహముచేసి ఆవధూవరులను రథముమీఁద కూర్చుండఁబెట్టుకొని తాను సారథియై మిక్కిలి ఉత్సాహముతో రథమును తోలుకొని పోవుచు, "నీచెల్లెలి యొక్క యెనిమిదవ కొడుకు నిన్ను చంపును" అను మాట ఒకటి చెవినిపడఁగానే మనసు చలింపఁగా, తటాలున రథమునుండి దిగి చెల్లెలు ఐన దేవకీ దేవిని కొప్పుపట్టి ఈడ్చి నేలఁబడవేసి తలనఱికి చంపఁబోయెను. అప్పుడు వసుదేవుఁడు బహువిధముల వేఁడుకోఁగా, చంపక విడిచి పెట్టి అది నిమిత్తముగా దేవకీవసుదేవులకు సంకెళ్లువేసి కారాగృహమునందు ఉంచి దేవకి కన్నకొడుకులను ఎల్లను చంపుచువచ్చి, కడపట యోగమాయవల్ల కృష్ణుఁడు వ్రేపల్లెలో నందునియింట చేరి ఉన్న సమాచారముతెలిసి, అతని చంపుటకు బహుప్రయత్నములుచేసి కడపట అతనిచేతనే చచ్చెను.

నందుడు

వసుదేవుడు కంసుడి చెల్లెలు అయిన దేవకిని పెళ్ళి చేసుకుంటాడు. అయితే వారికి అష్టమ గర్భంలో జన్మించిన సంతానంతో తనకు ప్రాణగండం ఉందని రాజ పురోహితుల ద్వారా తెలుసుకుంటాడు. అందుకని దేవకీ వసుదేవులను చెరసాల బంధించి వారికి పుట్టిన బిడ్డలందరినీ సంహరిస్తుంటాడు. అష్టమ సంతానంగా కృష్ణుడు జన్మించినపుడు ఆ శిశువును తీసుకు వెళ్ళి నందుని దగ్గర విడిచిపెట్టి అక్కడ ఉన్న ఆడశిశువు రూపంలో ఉన్న యోగమాయను తీసుకురమ్మని ఆకాశవాణి ఆదేశిస్తుంది. వసుదేవుడు అలాగే చేస్తాడు. అష్టమ సంతానం కలిగిందని తెలియగానే కంసుడు వచ్చి యోగమాయను ఆకాశం లోకి ఎగరేసి కత్తితో చంపబోతాడు. అప్పుడు విచిత్రంగా ఆ శిశువు అదృశ్యమైన అతన్ని సంహరించగల శిశువు మరెక్కడో పెరుగుతున్నాడని చెప్పి మాయమవుతుంది. అప్పటి నుంచి నందుని సంరక్షణలో ఉన్న శ్రీకృష్ణుని చంపడానికి కంసుడు అనేక రకాలుగా ప్రయత్నించి విఫలుడై చివరికి కృష్ణుని చేతిలో మరణిస్తాడు.
దేవకీ వసుదేవులు చెరసాలలో ఉన్నపుడు వసుదేవుడి మరో భార్యయైన రోహిణి పుత్రుడైన బలరాముని కూడా నందుడు తన సంరక్షణలో ఉంచుకుంటాడు.
నంద గోకులం చక్కని పాడి పశువులతో తులతూగుతుండేది. మొదట్లో నందుడికి శ్రీకృష్ణుడు మహా విష్ణువు అవతారం అని తెలియక కంసుడు పంపిన రాక్షసులు ఆయనకి కీడు తలపెట్టినప్పుడల్లా అతన్ని కాపాడమని మహా విష్ణువును ప్రార్థిస్తుండేవాడు

దుస్సల

దుస్సల ధుర్యోధనుని సోదరి. ఈమె సింధు దేశ రాజు జయద్రదుని వివాహము చేసుకొన్నది. కురుక్షేత్ర సంగ్రామంలో జయద్రదుని అర్జునుడు సంహరించాడు. ఈమెకు సురధుడు అను కుమారుడు ఉన్నాడు. కురుక్షేత్ర సంగ్రామం తరువాత అర్జునుడు యధిష్టురుని అశ్వమేధ యాగంలో భాగంగా సింధు దేశానికి వచ్చినప్పుడు దుస్సల మనుమడు అతనితో యుద్ధము చేసెను. సోదరి సమానురాలైన దుస్సల కోరిక మేరకు ఆమె మనుమని అర్జునుడు ప్రాణాలతో విడిచిపెట్టెను

కుంతీపుత్రుడు

మహాభారతంలో పాండవుల తల్లి కుంతీదేవి. పాండురాజు పిల్లలు పాండవులు.
కుంతి, మాద్రి పాండురాజు భార్యలు. పాండురాజుతో వివాహానికి పూర్వమే దూర్వాస మహాముని ఇచ్చిన మంత్రం మహిమను పరీక్షించడానికి ప్రయత్నిస్తూ కుంతి సూర్యుని ద్వారా ఒక పుత్రుడిని కన్నది. అతనే కర్ణుడు. కన్యగా ఉన్నప్పుడే తల్లి కావడం వల్ల లోకనిందకి వెరచి కుంతి అతని పుట్టుకను లోకానికి తెలియకుండా దాచింది. నదిలో వదిలిపెట్టింది. సూతుడు అతనిని పెంచాడు. కుంతి కి పుట్టినవారందరూ కుంతీ పుత్రులే అయినా కర్ణుడి పుట్టుకను మాత్రమే ప్రధానంగా తీసుకుని ఏర్పడిన జాతీయం ఇది.
కుంతీపుత్రుడు అంటే తల్లిపేరు తప్ప, తండ్రిగురించి తెలియనివాడు అనే అర్థంలో ఇప్పుడు వాడుతున్న జాతీయం ఇది.

ఆబాలగోపాలం

ఈ జాతీయం పోతనగారికన్నా ముందే ఉందోలేదో తెలియదు కానీ మహా భాగవతంలో గజేంద్ర మోక్షంలో ప్రముఖ పద్యంలో ప్రయోగించారు పోతన.
గజేంద్రుడిని కాపాడడానికి బయలుదేరిన మహా విష్ణువు స్వర్గంనుంచి బయలుదేరిన విధానాన్ని వర్ణించే తనవెంటన్ సిరి పద్యంలో విష్ణువు వెనకే వస్తున్న లక్ష్మీదేవి, ఆమె పరివారం, గరుత్మంతుడు, ధనుస్సు, కౌమోదకం(గద), శంఖచక్రాలు, నారదుడు, విష్వక్సేనుడు ఇలా అందరూ ఉన్నారని చెప్తూ వైకుంఠపురంబునంగలుగు వారాబాల గోపాలమున్ అని వర్ణించారు పోతన.
చిన్న పిల్లలనుంచి, పెద్దవారివరకు అందరికీ వర్తించేది అనే అర్థంలో "ఆబాల గోపాలము" అనే జాతీయం ఇప్పుడు వాడుతున్నాం.

కుబేరుడు

కుబేరుడికి చాలా గొప్ప కథే ఉంది మన పురాణాల్లో. విష్ణుపురాణం ప్రకారం కుబేరుడు విశ్రవుడి కుమారుడు. అతి చిన్న వయసులోనే శివభక్తుడిగా శివుడికోసం తపస్సుచేసి మెప్పించాడు. లంకానగరాన్ని, పుష్పకవిమానాన్ని, ధనాధ్యక్షతను, లోకపాలకత్వాన్ని వరంగా ఇచ్చాడు శివుడు. అయితే మహావిష్ణువు భయంతోపాతాళంలో దాక్కున్న రాక్షసులలో కుబేరుడి మారుతల్లి కొడుకు రావణాసురుడికి కుబేరుడిపై అసూయ కలిగింది. కుబేరుడిపైన దాడి చేసాడు. కుబేరుడు పారిపోయాడు. మళ్లీ శివుడికోసం తపస్సు చేసాడు. ఈసారి “లంకా నగరాన్ని మించిన దివ్యభవనాలతో, అపురూపమయిన చైత్ర రథం అనే ఉద్యానవనముతో, నవ నిధులతో, మణి మాణిక్యాలతో, సర్వ సంపదలతో అలకాపురం అనే పట్టణాన్ని నిర్మించి కుబేరుడికి కాననుకగా ఇచ్చాడు పరమశివుడు. యక్షులకి, గంధర్వులకి, మయులకి, గుహ్యకులకి రాజువై ఉండమని అనుగ్రహిస్తాడు.
రావణాసురుడు సీతను అపహరించి తెచ్చినప్పుడు, అలా చేయవద్దని అది ఎంత ప్రమాదమో తెలుసుకోమని తమ్ముడు రావణాసురడికి సలహా ఇస్తూ లేఖ రాసాడుట కుబేరుడు. తాను ఒకసారి పార్వతీదేవిని ఓరకంట చూచినందుకే తన కన్ను తెల్లగా అయిపోయిందని, పనిచేయలేదని చెప్పాడు. పరస్త్రీలను చూస్తే కళ్ళు పోతాయి అనే జాతీయం కూడా ఈ సందర్భంలోనిదే. పరాయి స్త్రీని చూసినందుకే ఓ కన్ను పోయిందని, ఇక ఆమె అనుమతి లేనిదే ఆశిస్తే ఎంతో ప్రమాదమని హెచ్చరించాడు కుబేరుడు, రావణాసురుడిని. కుబేరుని సంపద అంతులేనిది. కలియుగంలో వేంకటేశ్వరుడి కల్యాణానికి అప్పు ఇచ్చి ఆదుకున్నాడు కుబేరుడు
అందుకే ఇప్పుడు అంతలేని సంపదలు కలిగిన వారిని అపర కుబేరులు/కుబేరులు అనే జాతీయంతో గుర్తిస్తాం.

కురుక్షేత్రం

మహాభారతంలో దృతరాష్ట్రుడు, పాండురాజు అన్నదమ్ములు. వారి పిల్లలు కౌరవులు, పాండవులు. వీరి మధ్య జరిగిన మహా యుద్ధం భారతయుద్ధం. కురువంశంవారికి జరిగిన యుద్ధం జరిగిన చోటే కురుక్షేత్రం గా పేరు పొందింది కౌరవవీరులను, పాండువీరులను సమర్థించే వారు అటూ ఇటూ సైన్యంలో ఎదురు ఎదురుగా పోరాడారు. ఇది తెలుగువారికి జాతీయమయింది.
మహా మహులంతా తమ పరాక్రమాన్ని, గొప్పదనాన్ని ప్రదర్శించే వేదికలను కురుక్షేత్రం అని చెప్పడం పరిపాటి. అక్షయపాత్ర ఈ జాతీయం కూడా మహా భారతం నుంచి వచ్చినదే. మహాభారతంలో కౌరవులతో జూదం ఆడిన ధర్మరాజు ఓడిపోయాడు. ఫలితంగా పాండవులు పన్నెండేళ్ల అరణ్యవాసము, ఒక సంవత్సరం అజ్ఞాతవాసములకు బయలు దేరారు. పాండవులను అభిమానించే ప్రజలంతా వారి వెంట బయలుదేరారు. ఎంత వద్దన్నా వినలేదు. వీరందరికీ అన్నపానీయాలు ఎలా సమకూర్చగలను, ఆశ్రయించినవారికి లేదని ఎలా చెప్పగలను అని చింతించాడు ధర్మరాజు. అప్పుడు శౌనకముని ప్రపంచానికి వెలుగును, ఆహారాన్ని సమకూర్చే సూర్యభగవానుడికోసం తపస్సు చేయమని సలహా ఇచ్చాడు. ధౌమ్యుడు సూర్యోపాసనకోసం మంత్రాలను ఉపదేశించాడు. ధర్మరాజు జపానికి మెచ్చి సూర్యభగవానుడు అతనికి ఒక తామ్రపాత్రను ఇచ్చాడు. ఈ పన్నెండేళ్ళు ద్రౌపది వండిన కందమూలాలన్నీ అక్షయములైన నాలుగు రకాల ఆహార పదార్ధాలు అవుతాయి అని అనుగ్రహించాడు.
అక్షయము అంటే నాశనం లేనిది. ఎంత తీసుకున్నా ఇంకా మిగిలే ఉండడాన్ని అక్షయమైనది అని భావిస్తూ అటువంటి సందర్భంలో అక్షయపాత్ర జాతీయం వాడుతుంటారు.

ఏకపత్నీ వ్రతుడు

రామాయణంలో శ్రీరాముడు నాయకుడు. రామో విగ్రహాన్ ధర్మః అని వాల్మీకి ప్రస్తుతించాడు శ్రీరాముడిని. రాముడు అంటేనే ధర్మం. మూర్తీభవించిన ధర్మం. శ్రీరాముడు పాటించిన ధర్మాల్లో పితృవాక్య పరిపాలన, ఆడినమాట తప్పకపోవడంతో పాటు ఏకపత్నీ వ్రతం. తండ్రికి ముగ్గురు భార్యలున్నారు.ఆ వంశ ధర్మం ప్రకారం ఎంతమందినయినా వివాహం చేసుకోవచ్చు. కానీ రాముడు సీతపై గాఢంగా అనురక్తిని పెంచుకున్నాడు. సీతారాముల దాంపత్యం జగత్ప్రసిద్ధి పొందింది. అందువల్ల రాముడి ఏకపత్నీ వ్రతం కూడా జాతీయమై నిలిచింది.

అంపశయ్య

మహాభారత కథలో భీష్మా చార్యుడు గొప్పయోధుడు. పాండవులు శిఖండిని అడ్డు పెట్టుకొని యుద్ధం చేయడం వలన తాను అస్త్రసన్యాసం చేసాడు భీష్ముడు. వెంటనే అర్జునుడు మొదలయిన పాండువీరులంతా అతని శరీరంపై గోరు మోపినంత స్థలం కూడా వదలకుండా అస్త్ర ప్రయోగం చేస్తారు. ఆ నాటుకున్న బాణాలతో పాటుగా నేలను తాకకుండానే ఒరిగిపోతాడు భీష్ముడు. ఆ బాణాలు అతనికి శయ్యగా అమరగా ఆ స్థితిలోనే ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేవరకు ఆ అంపశయ్యమీదే మరణంకోసం ఎదురు చూసాడు భీష్ముడు.
ఎవరైనా అతి కష్టమైన పరిస్థితుల్లో గడుపుతూ ఉంటే ముళ్లమీద ఉన్నట్టున్నారు, అంపశయ్యమీద ఉన్నట్టు ఉన్నారు అని పోల్చి చెప్తారు ఈ జాతీయాన్ని ప్రయోగిస్తూ.

అస్త్ర సన్యాసం

మహాభారతం లోని ఘట్టాల ఆధారంగా ఏర్పడిన జాతీయం ఇది. భీష్మ, ద్రోణ, కృప,విదురుడు మొదలయిన కురువృద్ధులు, తన బంధువులు అందరినీ శత్రువుల పక్షంలో చూసి తాను యుద్ధం చేయలేనంటూ కురుక్షేత్రంలో ఆయుధాలను వదిలిపెట్టి వెళ్లిపోబోతాడు అర్జునుడు. అదే అస్త్ర సన్యాసం.అప్పుడు కృష్ణభగవానుడు గీతోపదేశం ద్వారా కర్తవ్యాన్ని ప్రబోధించాడు
ద్రోణుడు అశ్వత్ధామ చనిపోయాడు అని తెలిసిన వెంటనే అస్త్ర సన్యాసం చేసాడు.
భీష్ముడు శిఖండి ఎదురుగా వస్తే అస్త్ర సన్యాసం చేసాడు.
ఎవరితోనైనా వాద ప్రతివాదాలు చేస్తూ కానీ, ఎదిరించడానికి ప్రయత్నం చేస్తూ గానీ, ఆ పనినుంచి విరమించుకుంటే అస్త్ర సన్యాసం చేసాడు అనే జాతీయం వాడతారు.

© Copyright శ్రీ భగవధ్గీత