వెనకకు భగవద్గీత ముందుకు

1 అర్జునవిషాద యోగము


||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ ప్రథమోऽధ్యాయః - అర్జునవిషాదయోగః

7 వ శ్లోకం

అస్మాకం తు విశిష్టా యే తాన్నిబోధ ద్విజోత్తమ |
నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్బ్రవీమి తే ||1-7|| .

బ్రాహ్మణోత్తమా మనలో విశిష్టులైన వారెవరో తెలుసుకోండి. నా సైన్యంలోని నాయకులను మీ గుర్తుకోసం చెబుతాను.


......ధుర్యొధనుడు, ద్రోణాచార్యునితో- ఓ! భ్రాహ్మణోత్తమా! మన సైన్యమునందున్న చిశిష్ట యోధుల గురించి గూడా మీకు గుర్తుచేయుటకై తెలియజేయుచున్నాను. వీరందరు మన సైన్యములోని మహానాయకులు.
ప్రతిపక్ష వీరుల(పాండవుల) పరిచయం తర్వాత ధుర్యోధనుడు,సైన్యాధిపతి ద్రోణాచార్యునకు తన సేనయందలి మహానాయకులను అధికంగా ప్రశంసిస్తూ ధ్యైర్యం చేకూర్చ ప్రయత్నిస్తున్నాడు.
________________________________________

హిందూ ధర్మం అంటే ఏమిటి?మిగిలిన మతాలవలే కాకుండా, హిందు ధర్మం స్వర్గం/నరకం అనే మూఢ విశ్వాసం మీద ఆధారపడిలేదు. కొన్ని మూఢవిశ్వాసాలను ఆధారంగా చేసుకుని ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మమని చెప్పేది కాదు హిందు ధర్మం! హిందు ధర్మం దేనిని గుడ్డిగా నమ్మమని చెప్పదు, దేనిలో అయినా సత్యాన్ని పరిశోధించి తెలుసుకోమని బోధిస్తుంది. ఈ ప్రపంచంతరువాత స్వర్గం/నరకం అనేవి లేవు. కేవలం మన కర్మలే జీవితాన్ని స్వర్గం/నరకం అయ్యేలా చేస్తాయి.
హిందువు యొక్క ధర్మం ఏమిటంటే ప్రకృతిని, చుట్టూ ఉండే తోటి ప్రాణులను కాపాడడం !ఈ ప్రపంచంలో చెడు అనేది ఏమి లేదు, అంతా దైవత్వమే ! మన శరీరంలానే ఈ విశ్వం కూడా పంచభూతాలతో సృష్టింపబడినది. అంటే మన శరీరం కూడా చిన్న విశ్వంలాంటిదే! మన లోపల ఎలాగైతే తెలివి, జ్ఞానం, ఆత్మ ఉంటాయో అలానే ఈ విశ్వం లో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఉంటారు !
దేవుడు అనేవాడు ఒక వ్యక్తి/జీవం కాదు. దేవుడు అంటే పవిత్రమైన, అనంతమైన శక్తి. శివుదు(పరమాత్మ), గౌరీ మాత( శక్తి) కలయిక వలనే ఈ విశ్వం సృష్టిపబడుతూ ఉంటుంది. పరమాత్మను తెలుసుకుని మన ఆత్మను ఐక్యం చేయడమే ఆత్మ సాక్షాత్కారం ! అదే మన జీవిత గమ్యం మరియు ఇదే సులభమైన/ఉత్తమమైన మార్గం !
హిందు ధర్మం లొ శాస్త్రీయత/విజ్ఞానం ఉంది ! హిందు ధర్మం ద్వారా మీకు సత్యం తెలుసుకోవాలని లేకపోతే ఇతరులను బాధపెట్టకుండా మీకు ఇష్టం వచ్చినట్టు జీవించవచ్చు. దానినే ధర్మం అంటారు.
మతం ప్రపంచాన్ని నాశనం చేస్తుంది ఎందుకంటే అది మూఢ విశ్వాసలపై ఆధారపడి ఉంటుంది.
ధర్మం ప్రపంచాన్ని కాపాడుతుంది ఎందుకంటే అది జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది.
హిందు ధర్మం లోకి అందరికి స్వాగతం: సత్యాన్ని పరమాత్మను తెలుసుకోండి
....మీ హిందుబందువు
ఓం శివ శక్తి అంక్సాపూర్
----------------------------------------------------------------------

72 చిక్కు ప్రశ్నలు వాటికి ధర్మరాజు ఇచ్చిన జవాబులు.

యుధిష్ఠిరుడు లేదా ధర్మరాజు మహాభారత ఇతిహాసంలో ఒక ప్రధాన పాత్ర. పాండు రాజు సంతానమైన పాండవులలో పెద్దవాడు. కుంతికి యమధర్మరాజు అంశతో జన్మించాడు.కౌరవ పాండవులందరిలోనూ ధర్మరాజు అన్నివిధాలా అగ్రగణ్యుడై, తండ్రిని మించిన తనయుడిగా ప్రశంసలను పొందాడు. ఈ యోగ్యతను గమనించిన ధృతరాష్ట్రుడు ధర్మరాజును యువరాజు పదవిలో నియమించాడు.
అసూయతో దుర్యోధనుడు చేసిన దురాలోచన ఫలితంగా మాయాజూదంలో నేర్పరియైన శకుని చేతిలో ధర్మరాజు తన సర్వస్వాన్నీ, సోదరులనూ, చివరికు ద్రౌపదినీ ఒడ్డి ఓడిపోతాడు. మరల దుర్యోధనుడు రెండవసారి జూదమాడడానికి ధర్మరాజుని హస్తినాపురికి పిలిచాడు. ఓడినవాళ్ళు నారచీరలు ధరించి పన్నెండేళ్ళు అరణ్యవాసం, ఒకయేడు అజ్ఞాతవాసం చెయ్యాలి అనేది పందెం.
అజ్ఞాతవాస సమయంలో గనక గుర్తింపబడితే, ఆనాటి నుంచి మళ్ళీ పన్నెండేళ్ళు అరణ్యవాసం ప్రారంభించాలి. నియమానికి అంగీకరించిన ధర్మరాజు శకుని చేతిలో మళ్ళీ ఓడిపోయాడు. ధర్మరాజుకు అపకారం చేసిన కౌరవుల పాలనలో వుండడానికి ఇష్టంలేక ఎందరో పౌరులు తమ తమ కుటుంబాలతో పాండవుల వెంట అరణ్యాలకు తరలివచ్చారు. పెద్దల ఉపదేశానుసారం ధర్మరాజు సూర్యుణ్ణి ఆరాధించి అక్షయపాత్రను వరంగా పొందాడు.
దాని ప్రభావం వల్ల అతడు వెంటవచ్చిన యావన్మందినీ పోషిస్తూ, అరణ్యంలో కూడా మహారాజులాగా ప్రకాశిస్తూ ఉన్నాడు.అరణ్యవాసంలో ఉండగా ఒకనాడు వేటకువెళ్ళిన భీముని కొండచిలువ చుట్టేసి భక్షించబోయింది. ధర్మరాజు తమ్ముని వెదుకుతూ అక్కడకు వెళ్ళి ఆ మహాసర్పం అడిగిన ప్రశ్నలకు ధర్మబలంతో తగిన సమాధానాలిచ్చి, తమ్మున్ని విడిపించుకొని వచ్చాడు. ఆ పాము శాపం తొలగి నహుషుడు అనే మహారాజయ్యాడు.72 చిక్కు ప్రశ్నలు వాటికి ధర్మరాజు ఇచ్చిన జవాబులు.
1. సూర్యుణ్ణి ఉదయింప చేయువారు ఎవరు?
బ్రహ్మం
2. సూర్యుని చుట్టూ తిరుగువారెవరు?
దేవతలు 3. సూర్యుని అస్తమింపచేయునది ఏది?
ధర్మం
4. సూర్యుడు దేని ఆధారంగా నిలచియున్నాడు?
సత్యం
5. మానవుడు దేనివలన శ్రోత్రియుడగును?
వేదం
6. దేనివలన మహత్తును పొందును?
తపస్సు
7. మానవునికి సహయపడునది ఏది?
ధైర్యం
8. మానవుడు దేనివలన బుద్ధిమంతుడగును?
పెద్దలను సేవించుటవలన
9. మానవుడు మానవత్వముని ఎట్లు పొందును?
అధ్యయనము వలన
10. మానవునికి సాధుత్వాలు ఎట్లు సంభవిస్తాయి?
తపస్సువలన సాధుభావము, శిష్టాచార భ్రష్టతవం వల్ల అసాధుభావము సంభవించును.
11. మానవుడు మనుష్యుడెట్లు అవుతాడు?
మౄత్యు భయమువలన
12. జీవన్మౄతుడెవరు?
దేవతలకూ, అతిధులకూ పితౄసేవకాదులకు పెట్టకుండా తినువాడు
13. భూమికంటె భారమైనది ఏది?
జనని
14. ఆకాశంకంటే పొడవైనది ఏది?
తండ్రి
15. గాలికంటె వేగమైనది ఏది?
మనస్సు
16. మానవునికి సజ్జనత్వం ఎలావస్తుంది?
ఇతరులు తనపట్లఏపని చేస్తే , ఏ మాట మాట్లాడితే తన మనస్సుకు బాధ కలుగుతుందో తాను ఇతరుల పట్ల కూడా ఆ మాటలు మాట్లాడకుండా ఎవడు ఉంటాడో
అట్టి వానికి సజ్జనత్వం వస్తుంది)
17. తౄణం కంటె దట్టమైనది ఏది?
చింత
18. నిద్రలో కూడా కన్ను మూయనిది ఏది?
చేప
19. రాజ్యమేలేవాడు దైవత్వం ఎలా పొందుతాడు?
అస్త్రవిద్యచే
20. రాజ్యధినేతకు సజ్జనత్వం ఎలా కలుగుతుంది?
యజ్ణ్జం చేయుటవలన
21. జన్మించియు ప్రాణంలేనిది
గుడ్డు
22. రూపం ఉన్నా హౄదయం లేనిదేది?
రాయి
23. మానవుడికి దుర్జనత్వం ఎలా వస్తుంది?
శరణుజొచ్చిన వారిని రక్షించక పోవడంవలన
24. ఎల్లప్పుడూ వేగం గలదేది?
నది
25. రైతుకు ఏది ముఖ్యం?
వాన
26. బాటసారికి, రోగికి, గౄహస్ధునకూ, చనిపోయిన వారికి బంధువులెవ్వరు?
సార్ధం, వైద్యుడు, శీలవతి అనుకూలవతి అయిన భార్య, సుకర్మ వరుసగా బంధువులు
27. ధర్మానికి ఆధారమేది?
దయ దాక్షిణ్యం
28. కీర్తికి ఆశ్రయమేది?
దానం
29. దేవలోకానికి దారి ఏది?
సత్యం
30. సుఖానికి ఆధారం ఏది?
శీలం
31. మనిషికి దైవిక బంధువులెవరు?
భార్య/భర్త
32. మనిషికి ఆత్మ ఎవరు?
కూమారుడు
33. మానవునకు జీవనాధారమేది?
మేఘం
34. మనిషికి దేనివల్ల సంతసించును?
దానం
35. లాభాల్లో గొప్పది ఏది?
ఆరోగ్యం
36. సుఖాల్లో గొప్పది ఏది?
సంతోషం
37. ధర్మాల్లో ఉత్తమమైనది ఏది?
అహింస
38. దేనిని నిగ్రహిస్తే సంతోషం కలుగుతుంది?
మనస్సు
39. ఎవరితో సంధి శిధిలమవదు?
సజ్జనులతో
40. ఎల్లప్పుడూ తౄప్తిగా పడియుండునదేది?
యాగకర్మ
41. లోకానికి దిక్కు ఎవరు?
సత్పురుషులు
42. అన్నోదకాలు వేనియందు ఉద్భవిస్తాయి?
భూమి, ఆకాశములందు
43. లోకాన్ని కప్పివున్నది ఏది?
అజ్ణ్జానం
44. శ్రాద్ధవిధికి సమయమేది?
బ్రాహ్మణుడు వచ్చినప్పుడు
45. మనిషి దేనిని విడచి స్ర్వజనాదరణీయుడు, శోకరహితుడు, ధనవంతుడు, సుఖవంతుడు అగును?
వరుసగా గర్వం, క్రోధం, లోభం, తౄష్ణ వడచినచో
46. తపస్సు అంటే ఏమిటి?
తన వౄత్బికుల ధర్మం ఆచరించడం
47. క్షమ అంటే ఏమిటి?
ద్వంద్వాలు సహించడం
48. సిగ్గు అంటే ఏమిటి?
చేయరాని పనులంటే జడవడం
49. సర్వధనియనదగు వాడెవడౌ?
ప్రియాప్రియాలను సుఖ దు:ఖాలను సమంగా ఎంచువాడు
50. జ్ణ్జానం అంటే ఏమిటి?
మంచి చెడ్డల్ని గుర్తించ గలగడం
51. దయ అంటే ఏమిటి?
ప్రాణులన్నింటి సుఖము కోరడం
52. అర్జవం అంటే ఏమిటి?
సదా సమభావం కలిగి వుండడం
53. సోమరితనం అంటే ఏమిటి?
ధర్మకార్యములు చేయకుండుట
54. దు:ఖం అంటే ఏమిటి?
అజ్ణ్జానం కలిగి ఉండటం
55. ధైర్యం అంటే ఏమిటి?
ఇంద్రియ నిగ్రహం
56. స్నానం అంటే ఏమిటి?
మనస్సులో మాలిన్యం లేకుండా చేసుకోవడం
57. దానం అంటే ఏమిటి?
సమస్తప్రాణుల్ని రక్షించడం
58. పండితుడెవరు?
ధర్మం తెలిసినవాడు
59. మూర్ఖుడెవడు?
ధర్మం తెలియక అడ్డంగావాదించేవాడు
60. ఏది కాయం?
సంసారానికి కారణమైంది
61. అహంకారం అంటే ఏమిటి?
అజ్ణ్జానం
62. డంభం అంటే ఏమిటి?
తన గొప్పతానే చెప్పుకోవటం
63. ధర్మం, అర్ధం, కామం ఎక్కడ కలియును?
తన భార్యలో, తన భర్తలో
64. నరకం అనుభవించే వారెవరు?
ఆశపెట్టి దానం ఇవ్వనివాడు; వేదాల్నీ, ధర్మ శాస్త్రాల్నీ, దేవతల్నీ, పితౄదేవతల్నీ, ద్వేషించేవాడూ,దానం చెయ్యనివాడు
65. బ్రాహ్మణత్వం ఇచ్చేది ఏది?
ప్రవర్తన మాత్రమే
66. మంచిగా మాట్లాడేవాడికి ఏమి దొరుకుతుంది?
మైత్రి
67. ఆలోచించి పనిచేసేవాడు ఏమవుతాడు?
అందరి ప్రశంసలుపొంది గొప్పవాడవుతాడు
68. ఎక్కువమంది మిత్రులు వున్నవాడు ఏమవుతాడు?
సుఖపడతాడు
69. ఎవడు సంతోషంగా ఉంటాడు?
అప్పులేనివాడు, తనకున్న దానిలో తిని తౄప్తి చెందేవాడు
70. ఏది ఆశ్చర్యం?
ప్రాణులు ప్రతిరోజూ మరణిస్తూ ఉండడం చూస్తూ మనిషి తానే శాశ్వతంగా ఈ భూమి మీద ఉండి పోతాననుకోవడం
71. లోకంలో అందరికన్న ధనవంతుడెవరు?
ప్రియయూ అప్రియమూ, సుఖమూ దు:ఖమూ మొదలైన వాటినిసమంగా చూసేవాడు
72. స్ధితప్రజ్ణ్జుడని ఎవరిని ఆంటారు?
నిందాస్తుతులందూ, శీతోష్ణాదులందు, కలిమి లేములందూ,సుఖదు:ఖాదులందూ సముడై, లభించిన దానితో సంతౄప్తుడై అభిమాన్నని విడచి, అరిషడ్వర్గాలను జయించి స్ధిరబుద్దికలవాడైఎవరైఅతే ఉంటాడో వాని స్ధితప్రజ్ణ్జుడని ఆంటారు.