వెనకకు భగవద్గీత ముందుకు

2 సాంఖ్య యోగము


||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ ద్వితీయోऽధ్యాయః - సాఙ్ఖ్యయోగః

1 వ శ్లోకం

సఞ్జయ ఉవాచ|
తం తథా కృపయావిష్టమశ్రుపూర్ణాకులేక్షణమ్|
విషీదన్తమిదం వాక్యమువాచ మధుసూదనః|| 2-1 ||

సంజయుడన్నాడు:
ఆ ప్రకారంగా కరుణతో ఆవహింప బడి, కన్నీటితో నిండి కలత పడుతున్న చూపుతో, విషాదంలోఉన్న అర్జునుని చూసి మధుసూదనుడు ఇలా అన్నాడు.

నిత్యము పారాయణం చేసిన భక్తులందరికి సర్వపాపములు తీరి సర్వాభిష్టాలు సమకూరి సర్వశుభములు చేకూరును.

1.జగతికి మూలమైన ఆది దేవా !
   పాలకడలి శేషశయనా! లక్ష్మీ వల్లభా!
   భక్త హృదయా! సృష్టి విలాసా!,మహా విష్ణో!
   కేశవ! జయజగధీశ హరే!
   శ్రీచెంచులక్ష్మీ సమేత పావన నరసింహా
   రవ్వలకొండ మూర్తీవాసా నమో నమ:
 2 దయాఘనా ! నిర్మల చైతన్యా! మహాబాహో!
   దశావతారా! ఆనంద స్వరూపా! లక్ష్మీహృదయా!
   అనంతనాధా! త్రిమూర్తిరూపా! చక్రధారీ!
   కేశవ! జయజగధీశ హరే!
   శ్రీచెంచులక్ష్మీ సమేత పావన నరసింహా
   రవ్వలకొండ మూర్తీవాసా నమో నమ: 
 3.చిన్మయ, ఆత్మ స్వరూపా! అనంతలక్ష్మీనాథా!
   ప్రళయకాలమున జీవరాశులను దాటించిన
   శ్రీమన్నారాయణ వేదరక్షకా!మత్సావతారా!
   చెలి నీవే,చుట్టము నీవే,ఆత్మ స్వరూపుడవు నీవే
   కేశవ! జయజగధీశ హరే!
   శ్రీచెంచులక్ష్మీ సమేత పావన నరసింహా
   రవ్వలకొండ మూర్తీవాసా నమో నమ: 
 4.క్షీరసాగర మధనం- కూర్మావతారం
   మందరగిరికి ఆధారమయి కార్యము సఫలముజేసినావు.
   జనించిన త్రిజగన్మోహిని శ్రీమహాలక్ష్మిని  ఎదలో నిల్పుకున్నావు
   మోహినివై అమృతమును సురులకు పంచినావు
   ధరణీ ధరణ! సుధర్శనా!మధుసూధనా!
   కేశవ! జయజగధీశ హరే!
   శ్రీచెంచులక్ష్మీ సమేత పావన నరసింహా
   రవ్వలకొండ మూర్తీవాసా నమో నమ: 
 5.సాధు పరిరక్షకా! దుష్టశిక్షకా! శ్రీహరీ!
   మహా సూకరమై హిరాణ్యక్షున్ని చంపి,భూమినుద్ధరించి
   వేదములు కాపాడిన వరాహవతారా! గరుడవాహకా!
   ప్రళయకాలమందు బ్రహ్మస్తుతించిన యజ్ఞవరాహవతారా!
   తిరుమలకొండపై వెలసి,శ్రీవేంకటేశ్వరునికి ఆవాసమిచ్చిన
   కేశవ! జయజగధీశ హరే!
   శ్రీచెంచులక్ష్మీ సమేత పావన నరసింహా
   రవ్వలకొండ మూర్తీవాసా నమో నమ:
 6.ఇంతై ఇంతై వటుండింతై
   త్రివిక్రముడవై జగతిని రెండడుగులతో కప్పావు
   మూడవ అడుగుతో బలి చక్రవర్తిని పాతాళానికి పంపావు
  పాతాళానికి రాజునుచేసి వరాహమై కాపలాకాస్తివి.
   శ్రీహరి అవతారా! అధితి పుత్రా వామనా!
   కేశవ! జయజగధీశ హరే!
   శ్రీచెంచులక్ష్మీ సమేత పావన నరసింహా
   రవ్వలకొండ మూర్తీవాసా నమో నమ: 
 7.భార్గవరామా! పరమ శివుడిని మెప్పిం చావు
    పరశువును ఆయుధముగా పొంది
   పరశురాముడవై నావు
   కార్తవీరుని దుష్కార్యమునకు వాని కుమారుల వదించి
   తండ్రిని బతికించి క్షత్రియ జాతిపై ఆగ్రహంతో
   అధికార మధాంద క్షత్రియులను
   ఇరవై ఒక్కమార్లు దండెత్తి
   శిక్షించిన అవతారమూర్తీ పరశురామా!
   సీతా స్వయంవరంలో విష్ణుచాపాన్ని రామునికిచ్చి
   పరశురామునికి రామునికి భేదము లేదని తెల్పిన
   శ్రీహరి అవతారమూర్తీ పరశురామా!
   భీష్మ,ద్రోణ,కర్ణుల గురువైన శ్రీదత్తాత్రేయ శిష్యా!
   కేశవ! జయజగధీశ హరే!
   శ్రీచెంచులక్ష్మీ సమేత పావన నరసింహా
   రవ్వలకొండ మూర్తీవాసా నమో నమ: 
 8.రావణాది రాక్షసులను సంహరించి
   జీవితములో ఎన్నో కష్టాలను ఎదుర్కొని
   ధర్మపరిపాలనలో ఆదర్శ పురుషుడువైన
   రామావతారా శ్రీహరి ! సీతారామా!
   మానవుల  సంబంధ బాంధవ్యములను  
   ఆదర్శ జీవనానికి ప్రమాణముగ నిల్పిన రామా!
   కేశవ! జయజగధీశ హరే!
   శ్రీచెంచులక్ష్మీ సమేత పావన నరసింహా
   రవ్వలకొండ మూర్తీవాసా నమో నమ:
 9.గీతోపదేశముతో అర్జునునికి సత్యదర్శనముచేసి
    భగవద్గీతను లోకానికి ఉపదేశించి జగద్గురువైన
    పరిపూర్ణవతారమూర్తీ! శ్రీకృష్ణా! పరందామా!
    దుష్టశిక్షణ,శిష్టరక్షణ చేసిన లీలావతారా!
    కేశవ! జయజగధీశ హరే!
    శ్రీచెంచులక్ష్మీ సమేత పావన నరసింహా
    రవ్వలకొండ మూర్తీవాసా నమో నమ:
 10.భక్తుని మాటను నిజం చేయుటకై అవతరించిన మూర్తీ!
    సేవకుని (జయవిజయులు) శాపము నుంచి
     ముక్తుని చేసిన మూర్తీ!
    ఇలా కుదరదు అలాకుదరదు  అని హిరణ్యకశిపుని చంప
    ఎన్నో నియంత్రణలువున్నా నరసింహరూపుడై
    రాక్షస వధ చేసిన ఉగ్ర నరసింహా
    ప్రహ్లాద వరదా శ్రీ నరసింహావతారా!
    కేశవ! జయజగధీశ హరే!
    శ్రీచెంచులక్ష్మీ సమేత పావన నరసింహా
    రవ్వలకొండ మూర్తీవాసా నమో నమ:
 11.శ్రీమూర్తీ సంకల్పబలము-ధీక్షాఫలమున
     కాలజ్ఞాన వీరబ్రహ్మేంద్రుడు నడయాడిన
    రవ్వలకొండపై వెలసిన సర్వాంతర్యామి
    నిన్ను కొలిచిన చాలు సర్వాభీష్టాలు నెరవేరు
    ఈ  సగుణమంజరిని పఠించిన చాలు
    నశించు సర్వపాపములు-తీరు కష్టనష్టములు
    భక్తులందరికి జరుగు అన్నిశుభాశుభములు
   భక్త,పండిత పామర సేవలుగొను శ్రీహరిరూపా!
    కేశవ! జయజగధీశ హరే!
    శ్రీచెంచులక్ష్మీ సమేత పావన నరసింహా
    రవ్వలకొండ మూర్తీవాసా నమో నమ:

"రవ్వలకొండ శ్రీశ్రీశ్రీ చెంచులక్ష్మీ సమేత పావన నరసింహస్వామి - సగుణమంజరి" సంపూర్ణం

© Copyright శ్రీ భగవధ్గీత