వెనకకు భగవద్గీత ముందుకు

2 సాంఖ్య యోగము


||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ ద్వితీయోऽధ్యాయః - సాఙ్ఖ్యయోగః

11 వ శ్లోకం

శ్రీభగవానువాచ|
అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే|
గతాసూనగతాసూంశ్చ నానుశోచన్తి పణ్డితాః|| 2-11 ||

భగవంతుడన్నాడు :-
శోకింపతగని వాటిని గూర్చి నీవు శోకించుచున్నావు. మరియు నీ ప్రజ్ఞ (బుద్ధి ) నెల్లను ఉపయోగించి మాట్లాడుచున్నావు. పండితులు గతులు కల్గిన మరియు గతులు లేని వాటిని గూర్చి బాధపడరు

శ్రీపావన నరసింహ విశిష్టామృతము

28.హిందూ సంప్రదాయ దేవతార్చనలో మంగళ హారతి యివ్వడం ఒక ముఖ్యమైన భాగం. సాధారణంగా హారతి ఇస్తున్నప్పుడు అక్కడ ఉన్న పెద్దవారు ఆయా దేవతల మంగళ హారతి పాటని పాడతారు.స్వామీ! అటువంటి ప్రత్యేక మంగళహారతి పాట నీ కొరకు పాడుటకు సిద్దము చేశాను. ప్రతి రోజు ఉదయము సాయంత్రము యీ మంగళహారతి పాట యిచ్చేందుకు శక్తిని యివ్వు తండ్రీ!

రవ్వలకొండ స్థిరవాసా చెంచులక్ష్మీ సమేత పావన నరసింహా

నీ ముంగిట సిద్ధముగా నుంటిమి విశిష్టామృతము గ్రోల 

 29. భగవంతుని పూజలో చేసే అనేక ఉపచారాలలో హారతి ఒకటి. దీనినే నీరాజనం అని కూడా అంటారు. దీపం లేదా దీపాలు లేదా కర్పూరం వెలిగించి పూజా విగ్రహానికి ముందు త్రిప్పడం హారతిలో ప్రధాన విషయం. ఇందుకు అనుబంధంగా సంగీతం వాయిస్తారు. పాటలు, శ్లోకాలు, మంత్రాలు చదువుతారు. దీనిని "హారతి" లేదా "ఆరతి" అంటారు. హారతి సమయంలో భక్తులు పాట లేదా భజనలో పాలు పంచుకొంటారు. అనంతరం హారతిని కళ్ళకద్దుకొంటారు. నరహరీ! ప్రత్యేక హారతి పాటతో నిత్యము మంగళహారతి యిస్తాము తండ్రీ!

రవ్వలకొండ స్థిరవాసా చెంచులక్ష్మీ సమేత పావన నరసింహా

నీ ముంగిట సిద్ధముగా నుంటిమి విశిష్టామృతము గ్రోల 

 30.స్వామీ! నిన్ను రాతిమూర్తిగా బావించడం లేదు.కదలక మెదలక గుడిలో రాతి బొమ్మలావున్నావని నేను అనుకోవడంలేదు.సాక్షాత్తు వైకుంఠపురము నుంచి కదిలి వచ్చిన నీ ఆత్మ ఆవహించిన దేవాంస దివ్యావతార మూర్తిగా భావించి పూజిస్తున్నాను. నా ఆత్మవు, పరమాత్మవు నీవే తండ్రీ!

రవ్వలకొండ స్థిరవాసా చెంచులక్ష్మీ సమేత పావన నరసింహా

నీ ముంగిట సిద్ధముగా నుంటిమి విశిష్టామృతము గ్రోల 

 31 అవినీతి పరులు వేరు,భక్తులు వేరు.కొందరు భక్తులమని చెప్పుకుంటూనే అవినీతి, అక్రమార్జనకు పాల్పడుతున్నారు. సచ్చీలత, సదాచారము పాటించడంలేదు. ఇహం,పరం దేనికదే విడివిడిగా పొందవచ్చునన్న అభిప్రాయముతో వున్నారు. స్వామీ చెంచులక్ష్మీ సమేతా! పావన నరసింహా! నాలో అటువంటి గుణాలు, అభిప్రాయాలు లేకుండా చూడు తండ్రీ!

రవ్వలకొండ స్థిరవాసా చెంచులక్ష్మీ సమేత పావన నరసింహా

నీ ముంగిట సిద్ధముగా నుంటిమి విశిష్టామృతము గ్రోల 

 32. స్వకర్మణా తమభ్యర్చసిద్ధింవిందతి మానవ:”

మనం నారాయణార్పణ బుద్ధితో కర్మలను ఆచరిస్తే అది ఉపచారం.

నేను, నేను అనే అహంభావంతో చేస్తే అది అపచారం,

కనుక కర్తృత్వ భావనను తొలగించి నా ద్వారా జరిగే కర్మలను కర్త, ప్రేరకుడు నారాయణుడేయని గ్రహించేలా దీవించు.

అల్పమైన ఫలాలకు పరిమితము చెందక అంత:కరణ శుద్ధికై కర్మలను విధిగా ఆచరించేలా అనుగ్రహించు తండ్రీ!.

రవ్వలకొండ స్థిరవాసా చెంచులక్ష్మీ సమేత పావన నరసింహా

నీ ముంగిట సిద్ధముగా నుంటిమి విశిష్టామృతము గ్రోల 

© Copyright శ్రీ భగవధ్గీత