వెనకకు భగవద్గీత ముందుకు

2 సాంఖ్య యోగము

||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ ద్వితీయోऽధ్యాయః - సాఙ్ఖ్యయోగః

13 వ శ్లోకం

దేహినోऽస్మిన్యథా దేహే కౌమారం యౌవనం జరా|
తథా దేహాన్తరప్రాప్తిర్ధీరస్తత్ర న ముహ్యతి|| 2-13 ||

ఈ శరీరంలో దేహధారికి బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం ఎలాకలుగుతాయో, అలాగే మరోదేహం లభించడం కూడాను. వివేకి ఈవిషయంలో భ్రమపడడు.

శ్రీపావన నరసింహ విశిష్టామృతము

39.భక్తి, జ్ఞానం, యోగం అనేవి మనకు అంతో ఇంతో తెలుసు. కాని ముక్తి అనే గమ్యం చేరడానికి అవి ఎలా ఉపయోగపడతాయో పూర్తిగా తెలియదు. అయితే మనం కొన్నింటిమీద ఆసక్తి కలిగి చేస్తూ ఉంటాము. ఆసక్తి లేనప్పుడు దేనికైనా దూరంగా ఉంటాము. కొందరైతే వారి కుటుంబంలో పెద్దల ద్వారా వారసత్వంగా గాని, సంప్రదాయంగా గాని ఆచరిస్తూ ఉంటారు. స్వామీ! నాకు గురువై భక్తి,జ్ఞానమార్గం బోధించు తండ్రీ!

రవ్వలకొండ స్థిరవాసా చెంచులక్ష్మీ సమేత పావన నరసింహా

నీ ముంగిట సిద్ధముగా నుంటిమి విశిష్టామృతము గ్రోల 

 40.మౌనం మనస్సుని శుద్ధి చేస్తుంది. స్నానం దేహాన్ని శుద్ధి చేస్తుంది. ధ్యానం బుద్దిని శుద్ధి చేస్తుంది. ప్రార్థన ఆత్మను శుద్ధి చేస్తుంది. దానం సంపాదనను శుద్ధి చేస్తుంది. ఉపవాసం ఆరోగ్యాన్నీ శుద్ది చేస్తుంది. అలాగే క్షమాపణ సంబంధాలను శుద్ది చేస్తుంది. గుణాలు పెంపొందించు తండ్రీ!

రవ్వలకొండ స్థిరవాసా చెంచులక్ష్మీ సమేత పావన నరసింహా

నీ ముంగిట సిద్ధముగా నుంటిమి విశిష్టామృతము గ్రోల 

 41.మనిషిలో అహం తగ్గిన రోజు ఆప్యాయత అంటే అర్ధం అవుతుంది. గర్వం పోయిన రోజు ఎదుటివారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది. నేనే నాకేంటి అనుకుంటే చివరకు ఒక్కడిగానే ఉండాల్సివస్తుంది. గౌరవమర్యాదలు ఇచ్చిపుచ్చుకుంటూ అందరితో కలిసి ఆనందంగా జీవించడమే మంచి జీవితం. నాలోని అహం,గర్వం తొలగించి ఆనంద జీవితాన్ని అందించు తండ్రీ!

రవ్వలకొండ స్థిరవాసా చెంచులక్ష్మీ సమేత పావన నరసింహా

నీ ముంగిట సిద్ధముగా నుంటిమి విశిష్టామృతము గ్రోల 

 42.జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. చాలానే చూడాల్సివస్తుంది. వాటన్నింటినీ ఎదుర్కొనే ధైర్యం ఉన్నప్పుడే జీవితం అర్ధవంతంగా ఉంటుంది. క్షణంలో అయితే మన పట్ల మనం నమ్మకాన్ని కోల్పోతామో క్షణం నుండే మనం చచ్చిన శవంతో సమానం.స్వామీ! లక్ష్మీవల్లభా! నాలోని ధైర్యాన్ని, నమ్మకాన్ని కోల్పోకుండా చూడు తండ్రీ!

రవ్వలకొండ స్థిరవాసా చెంచులక్ష్మీ సమేత పావన నరసింహా

నీ ముంగిట సిద్ధముగా నుంటిమి విశిష్టామృతము గ్రోల 

 43.మనిషి జీవితంలో చక్ర భ్రమణం అనేది ఒక భాగంగా చేరి ఉంది. మనం గమనిస్తే కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం... దీన్నియుగచక్రంఅంటారు. వర్షకాలం, చలికాలం, ఎండకాలం... దీన్నిరుతుచక్రంఅంటారు. రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు... దీన్నికాల చక్రంఅంటారు. బాల్యం, కౌమారం, యౌవనం, వార్ధక్యం... దీన్నిజీవిత చక్రంఅంటారు. ఇలా సృష్టి, స్థితి, లయ కారకుడవైన పరమాత్మా! నీ నిర్దేశానుసారం యీచక్ర భ్రమణంనిరంతరంగా సాగిపోయేల చూడు తండ్రీ!.

రవ్వలకొండ స్థిరవాసా చెంచులక్ష్మీ సమేత పావన నరసింహా

నీ ముంగిట సిద్ధముగా నుంటిమి విశిష్టామృతము గ్రోల 

 44.మనిషి జీవిత ప్రయాణం గమ్యం వైపు సాగాలి. కోరిక గమ్యాన్ని నిర్దేసిస్తుంది.ధనం,సుఖం,కీర్తి... యీ మూడు కోరికను ప్రేరేపిస్తాయి. అయితే ఎంత ధనం సంపాదించాలి,ఎంత సుఖపడాలి,ఎంత కీర్తి మూటకట్టుకోవాలి? అన్న విషయములో సరైన అవగాహన లేక జీవితం నాశనము చేసుకుంటున్నాము. బాల్యం అమాయకంగాను, కౌమారం జిజ్ఞాసతోను,యౌవనం ఆశలతోనే గడిచిపోయింది. అసలు సమస్య వార్దక్యములోనే మొదలవుతున్నది. అటువంటి సమస్యలు మా జీవితంలో తలెత్తకుండ చూడు తండ్రీ!

రవ్వలకొండ స్థిరవాసా చెంచులక్ష్మీ సమేత పావన నరసింహా

నీ ముంగిట సిద్ధముగా నుంటిమి విశిష్టామృతము గ్రోల 

© Copyright శ్రీ భగవధ్గీత