వెనకకు భగవద్గీత ముందుకు

2 సాంఖ్య యోగము

||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ ద్వితీయోऽధ్యాయః - సాఙ్ఖ్యయోగః

14 వ శ్లోకం

మాత్రాస్పర్శాస్తు కౌన్తేయ శీతోష్ణసుఖదుఃఖదాః|
ఆగమాపాయినోऽనిత్యాస్తాంస్తితిక్షస్వ భారత|| 2-14 ||

కుంతీకుమారా! ఇంద్రియాల ద్వారా కలిగే విషయ స్పర్శలే శీతోష్ణ, సుఖదః ఖాలను కలిగిస్తాయి అవి వస్తూ పోతుంటాయి. నిలకడలేనివి. అర్జునా వాటిని సహించాలి.

శ్రీపావన నరసింహ విశిష్టామృతము

45.ప్రాణంకోసం కాకుండ ప్రాణము శాశ్వతం కాదు అనే పరిపక్వ స్థితిని చేరడమే ఆత్మజ్ఞాన దర్శనం.అలాంటి పరిపక్వ స్థితిని చేరుకున్నవారు చక్రభ్రమణంలో తనను తెలుసుకుంటూ, కోరికలకు, ఆశలకు అతీతంగా జీవించ గలుగుతారు. నిగ్రహం, నిర్మోహం, నిరాపేక్షత అనే త్రిలక్షణాలను త్రికరణ శుద్ధిగా ఆచరించ గలుగుతారు. స్వామి నీవే నా గురువు,అంతర్యామివీ! నిన్ను చేరుకునే, అలౌకిక ఆనందం సిద్దించే ఆత్మజ్ఞానము సిద్దింపజేయుము తండ్రీ!

రవ్వలకొండ స్థిరవాసా చెంచులక్ష్మీ సమేత పావన నరసింహా

నీ ముంగిట సిద్ధముగా నుంటిమి విశిష్టామృతము గ్రోల 

 46.ప్రాపంచికం, పారమార్ధికం వేరు వేరు కాదు, రెండింటి మేళవింపే జీవితం'. మానసిక కాలుష్యాన్ని తోలగించుకోడమే ఆధ్యాత్మిక సాధన. స్వామీ నరహరీ! ప్రహ్లదవరదా! ఆధ్యాత్మిక సదనకు మంచి ఆరోగూముతోపాటు మనస్సు, మనుగడ కూడా చక్కగా వుండేలా కాపాడు తండ్రీ!

రవ్వలకొండ స్థిరవాసా చెంచులక్ష్మీ సమేత పావన నరసింహా

నీ ముంగిట సిద్ధముగా నుంటిమి విశిష్టామృతము గ్రోల 

 47.ధ్యానం, సేవ అనేవి రెండు శక్తివంతమైన సాధనములు. ధ్యానం లేని సేవ, సేవ లేని ధ్యానం పూర్ణజ్ఞానసిద్ధిని కల్గించలేవు. సేవ, ధ్యానం రెండు కూడా మనోశుద్ధి ప్రక్రియలు, పాపనాశన సాధనములు.సేవ స్థూలంగా మనస్సుని శుద్ధి చేస్తే, ధ్యానం సూక్ష్మంగా మనస్సును శుద్ధి చేస్తుంది. సేవ చేస్తేగాని ధ్యానం చేసే శక్తి కలగదు, ధ్యానం చేస్తేగాని సేవ పవిత్రంగా జరగదు. చక్కగా ధ్యానం చేస్తే, చేసే సేవ పవిత్రంగా వుంటుంది. చక్కగా సేవ చేస్తే చేసే ధ్యానం నిశ్చలంగా వుంటుంది. ప్రశాంతంగా వుంటుంది.

  సింహరూపా! నీకు సేవ,ధ్యానము చేసుకునే భాగ్యాన్ని యివ్వు. నాలోని అహంకారాన్ని ప్రాలద్రోలే చిత్తశుద్ధిని ప్రసాదించు తండ్రీ!

రవ్వలకొండ స్థిరవాసా చెంచులక్ష్మీ సమేత పావన నరసింహా

నీ ముంగిట సిద్ధముగా నుంటిమి విశిష్టామృతము గ్రోల 

 48."ధ్యానంమనలో వున్న ఆత్మశక్తిని పెంచి సమస్యలను ఎదుర్కోగలిగే సామర్ధ్యాన్నీ, మరి బుద్ధికుశలతతో మన సమస్యలను సావధానంగా ఎదుర్కోగలిగే స్థిరచిత్తాన్ని ఇస్తుంది. తద్వారా మేము మాకు అందుబాటులో వున్న భౌతికపరమైన వనరులతో పాటుగా మా ఆత్మకు వున్నటువంటి అనంత దైవ శక్తులను కూడా కూడగలుపుకుని ..మా సమస్యను మరింత సమర్ధవంతంగా ఎదుర్కోగలిగే అవగాహన కల్గించు తండ్రీ!

రవ్వలకొండ స్థిరవాసా చెంచులక్ష్మీ సమేత పావన నరసింహా

నీ ముంగిట సిద్ధముగా నుంటిమి విశిష్టామృతము గ్రోల 

రవ్వలకొండ స్థిరవాసా చెంచులక్ష్మీ సమేత పావన నరసింహా

నీ ముంగిట సిద్ధముగా నుంటిమి విశిష్టామృతము గ్రోల 

 49.ఆత్మజ్ఞానం లేనివాళ్ళకు " జీవితంఅంటే ఒక దుర్భరమైన ..భీభత్సమైన యుద్ధంలా కనిపిస్తుంది, మరి అదే జీవితం ఒకానొక ఆత్మజ్ఞానికితన ఆత్మోన్నతి కోసం ఆడే ఒక మహాక్రీడలా అనిపిస్తుంది. ఎప్పుడైతే మనం పూర్తిగా ప్రాపంచికంలో పడిపోయి ఆత్మజ్ఞాన లోపంతో కూడిజీవితం అన్నది ఒక ఆట మాత్రమేఅన్న సంగతి మరచిపోతామో .. ఇక అప్పుడు మనకు ఎదురయ్యే సమస్యలూ సవాళ్ళు మనకంటే పెద్దవిగా మారి .. భూతాల్లా మనల్ని భయపెడతాయి. అదే మనం సరియైన ఆధ్యాత్మిక బాటలో పయనిస్తూ ఆత్మజ్ఞానప్రకాశకుల్లా మారి సమస్యల పట్ల సరియైన అవగాహనతో మెలగితే .. ఇక సమస్యలు అన్నీ మనకంటే చిన్న చిన్నగా మారిపోయి మరి వాటి పరిష్కారాలు సులభతరం అయిపోతాయి. ఇలా జరగాలంటే నీ తోడు నీ దీవెన కావాలి తండ్రీ!

రవ్వలకొండ స్థిరవాసా చెంచులక్ష్మీ సమేత పావన నరసింహా

నీ ముంగిట సిద్ధముగా నుంటిమి విశిష్టామృతము గ్రోల 

 50.కర్మ చేసేందుకు నాకు అధికారము యిచ్చావు. కాని ఫలితము పట్ల నాకు అదికారం ఏలా? తక్కువ పని చేసి ఎక్కువ ఫలితాన్ని కోరడం అత్యాశ,ఎక్కువ పనిచేసి తక్కువ ఆశింఛడం ఆత్మవంచన అవుతుంది. పనిచేశాక వచ్చే పూర్తి ఫలాన్ని తిరస్కరించకుండ అహంబావమునకు లోను కాకుండా నా మనసును నియంత్రించు తండ్రీ!

రవ్వలకొండ స్థిరవాసా చెంచులక్ష్మీ సమేత పావన నరసింహా

నీ ముంగిట సిద్ధముగా నుంటిమి విశిష్టామృతము గ్రోల 

© Copyright శ్రీ భగవధ్గీత