వెనకకు భగవద్గీత ముందుకు

2 సాంఖ్య యోగము


||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ ద్వితీయోऽధ్యాయః - సాఙ్ఖ్యయోగః

5 వ శ్లోకం

గురూనహత్వా హి మహానుభావాన్
శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే|
హత్వార్థకామాంస్తు గురూనిహైవ
భుఞ్జీయ భోగాన్ రుధిరప్రదిగ్ధాన్|| 2-5 ||

మహానుభావులైన గురువులను వధించకుండా ఈ లోకంలో బిచ్చం ఎత్తి అయినా జీవించడమే మేలు. గురువుల్ని వధించి ఆ నెత్తుటితో తడిసిన సంపదలు, భోగాలు ఈ లోకంలో మాత్రమే అనుభవిస్తాను

శ్రీపావన నరసింహ విశిష్టామృతము

శ్రీవినాయక-పార్వతీ తనయా!  "విశిష్ట"  అను నామమున

శ్రీ పావన నరసింహ విశిష్టామృతమురాయను సంకల్పించి కలం పట్టితిని.

గజాననా! విఘ్నములు  మాపి రచన సాపీగా సాగు లాగున అనుగ్రహించు  తండ్రీ

1.భారతదేశం ఎంతో గొప్పది. దీనిని దేవభూమి అని అంటారు. దేశం ఇంత గొప్పగా ఉండడానికి ఇక్కడి సంస్కృతి సంప్రదాయాలే కారణం. ప్రపంచంలోని సుమారు రెండు వందల ముప్పై దేశాలలో కేవలం భారతదేశంలోనే దేవతలు పుట్టారు. అలాగే మనం బాగుండటం కోసం ఎంతో మంది ఋషిములు, మహర్షులు, మహాను భావులు వారి తపఃశక్తిని సర్వస్వాన్ని త్యాగం చేసి హిందూ ధర్మాన్ని మనకందించారు. ఇంత గొప్ప దేశంలో నేను పుట్టడం ఎన్నో జన్మల పుణ్యఫలం, నేను కూడా దేశ సంస్కృతులకు వారసునిగా వాటిని కాపాడుకోవడం నా కనీస బాధ్యత, తండ్రీ

రవ్వలకొండ స్థిరవాసా చెంచులక్ష్మీ సమేత పావన నరసింహా

నీ ముంగిట సిద్ధముగా నుంటిమి విశిష్టామృతము గ్రోల 

© Copyright శ్రీ భగవధ్గీత