వెనకకు భగవద్గీత ముందుకు

2 సాంఖ్య యోగము


||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ ద్వితీయోऽధ్యాయః - సాఙ్ఖ్యయోగః

6 వ శ్లోకం

న చైతద్విద్మః కతరన్నో గరీయో
యద్వా జయేమ యది వా నో జయేయుః|
యానేవ హత్వా న జిజీవిషామస్-
తేऽవస్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః|| 2-6 ||

ఈ రెండింటిలో ఏది మేలో మాకు తెలియడం లేదు. యుద్ధం చేసినా మేము గెలుస్తామో వాళ్ళే గెలుస్తారో, ఎవరిని చంపాక జీవించడానికి ఇష్ట పడమో, ఆధృతరాష్ట్రనందనులే ఎదురుగా నిలబడి ఉన్నారు

శ్రీపావన నరసింహ విశిష్టామృతము

2.ధర్మానికి హాని కలిగినప్పుడు, దుస్టులను రూపు మాపి సత్పురుషులను పరిరక్షించుటకు, భక్తుల మాట నిలబెట్టుటకు అవతరించిన నరహరీ!, నిన్ను స్తుతించు నా యీ భాగ్యమునకు, నా యీ చిన్న ప్రయత్నమునకు సహాయముచేయి తండ్రీ!

రవ్వలకొండ స్థిరవాసా చెంచులక్ష్మీ సమేత పావన నరసింహా

నీ ముంగిట సిద్ధముగా నుంటిమి విశిష్టామృతము గ్రోల   

 3.పశుపక్షిమనుష్యాది రూపాలను ఎత్తటం అవతారం అంటారు. మంచి వాళ్లను రక్షించి, చెడ్డవాళ్లను శిక్షించడానికి, ధర్మరక్షణకు దేవుడు వివిద పశుపక్షిమనుష్యాది రూపాలలో భూమిపైన అవతరించునని మా నమ్మకం. అటువంటి మా నమ్మకానికి ప్రతీకవు నీవు తండ్రీ!.

రవ్వలకొండ స్థిరవాసా చెంచులక్ష్మీ సమేత పావన నరసింహా

నీ ముంగిట సిద్ధముగా నుంటిమి విశిష్టామృతము గ్రోల 

 4.భౌతిక రూపముతో భూమిపై అవతరించి,దుష్టశిక్షణ చేసి భక్తుల ఆపదలు తోలగించడం భగవంతుని కల్పన. అటువంటి నమ్మకానికి, అవతార కల్పనకు మూలాధారము నీవు. నీ అవతార విశేష విశిష్టను వేనోళ్ళ పొగడ బలము యివ్వు తండ్రీ!

రవ్వలకొండ స్థిరవాసా చెంచులక్ష్మీ సమేత పావన నరసింహా

నీ ముంగిట సిద్ధముగా నుంటిమి విశిష్టామృతము గ్రోల 

© Copyright శ్రీ భగవధ్గీత