వెనకకు భగవద్గీత ముందుకు

2 సాంఖ్య యోగము

||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ ద్వితీయోऽధ్యాయః - సాఙ్ఖ్యయోగః

7 వ శ్లోకం

కార్పణ్యదోషోపహతస్వభావః
పృచ్ఛామి త్వాం ధర్మసమ్మూఢచేతాః|
యచ్ఛ్రేయః స్యాన్నిశ్చితం బ్రూహి తన్మే
శిష్యస్తేऽహం శాధి మాం త్వాం ప్రపన్నమ్|| 2-7 ||

కార్పణ్య దోషం చేత నా బుద్ధి దెబ్బ తిన్నది. ధర్మమేదో తెలియని వాడినై నిన్ను అడుగు తున్నాను. ఏది నిశ్చితంగా శ్రేయస్కరమో అది తెలియ చెయ్యి. నీ శిష్యుడిని, నీ శరణు జొచ్చిన నాకు బోధ చెయ్యి.

శ్రీపావన నరసింహ విశిష్టామృతము

5.దేవతలు మాత్రమే అవతారమెత్తేవారు. ఇప్పుడు స్వార్థం, ద్వేషము, అసూయలతో మానవులు అనేక అవతారాలు దాల్చి విశ్వవినాశానికి పూనుకుంటున్నారు. శ్రీమన్నారాయణ అవతార మూర్తి లోకపాలకా! యీ జగతిని రక్షించి కాపాడు తండ్రీ!..

రవ్వలకొండ స్థిరవాసా చెంచులక్ష్మీ సమేత పావన నరసింహా

నీ ముంగిట సిద్ధముగా నుంటిమి విశిష్టామృతము గ్రోల 

6 అన్ని జీవరాశులలో మానవజన్మ ఉన్నతమైనది. అందుకే దేవతలు సైతము యీ రూపము దాల్చుటకు యిష్టపడుతారు.   అటువంటి ఉన్నతజన్మ నాకు లభించినందుకు నేను చేసుకున్న పుణ్యఫలం. పుట్టినందుకు జన్మకు సార్థకత చేకూర్చి నీ సేవలో తరించు భాగ్యము అనుగ్రహించు తండ్రీ!

రవ్వలకొండ స్థిరవాసా చెంచులక్ష్మీ సమేత పావన నరసింహా

నీ ముంగిట సిద్ధముగా నుంటిమి విశిష్టామృతము గ్రోల 

 7.ప్రస్తుత నవజీవన విధానములో ఎవరికి ఎవరో అర్థము కావడంలేదు. విచ్చలవిడి స్వేచ్చాయుతం, తెలిసి చేస్తున్నారో, తెలియక చేస్తున్నారో వారికే అవగతము కావడం లేదు. అటువంటి వారిని ఉద్దరించూ తండ్రీ!

రవ్వలకొండ స్థిరవాసా చెంచులక్ష్మీ సమేత పావన నరసింహా

నీ ముంగిట సిద్ధముగా నుంటిమి విశిష్టామృతము గ్రోల 

 8.ఏమి చదువుతున్నారో లేక ఏమి చదివారో వారికే తెలియదు. ఏమి చేయాలొకూడ వారికి తెలియదు పెద్దపెద్ద చదువులు చదివామన్న అహంబావము. కాని అందులో జ్ఞానము శూన్యము.వీరి అజ్ఞానాన్ని బాపి సరైన మార్గములో నడిపించు తండ్రీ!

రవ్వలకొండ స్థిరవాసా చెంచులక్ష్మీ సమేత పావన నరసింహా

నీ ముంగిట సిద్ధముగా నుంటిమి విశిష్టామృతము గ్రోల