వెనకకు భగవద్గీత ముందుకు

2 సాంఖ్య యోగము

||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ ద్వితీయోऽధ్యాయః - సాఙ్ఖ్యయోగః

9 వ శ్లోకం

సఞ్జయ ఉవాచ|
ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశః పరన్తప|
న యోత్స్య ఇతి గోవిన్దముక్త్వా తూష్ణీం బభూవ హ|| 2-9 ||

ఓ రాజా. అర్జునుడు శ్రీ కృష్ణునితో ఈ ప్రకారంగా చెప్పి, యుద్ధం చేయనని గోవిందునితో పలికి మాట్లాడకుండా ఊరకున్నాడు.

శ్రీపావన నరసింహ విశిష్టామృతము

13.సత్వ గుణం వలన జ్ఞానము, రజోగుణం వలన లోభము, తమోగుణం వలన మూఢత్వము కలుగుతాయి. దేనినీ ద్వేషింప కుండా, కాంక్షించకుండా, సమత్వంతో నిర్మల మనస్కుడైనవాడు అమృతత్వాన్ని పొందుతాడు. భగవంతుని అచంచల భక్తి విశ్వాసాలతో ఆరాధించేవాడు గుణాతీతుడై బ్రహ్మ పదాన్ని పొందడానికి అర్హుడౌవుతాడని బోధచేసిన పరమాత్మ స్వరూపా! తండ్రీ!

రవ్వలకొండ స్థిరవాసా చెంచులక్ష్మీ సమేత పావన నరసింహా

నీ ముంగిట సిద్ధముగా నుంటిమి విశిష్టామృతము గ్రోల 

 14.సూర్యుడు తన కీరణములను విశ్వమంతా వ్యాపింపచేస్తున్నట్లే, దేవాది దేవా! సర్వవ్యాపియై నీ ఉనికిని ప్రదర్శింప చేస్తూ వున్నావు. సకల జీవులు, బ్రహ్మ మొదలుకుని చాలా చిన్న ప్రాణియైన చీమ వరకు నీలోనే వున్నాయన్న సత్యాన్ని తెలుసుకొన లేకున్నాము. అటువంటి మా మూడత్వము మాపి అనుగ్రహించు తండ్రీ!

రవ్వలకొండ స్థిరవాసా చెంచులక్ష్మీ సమేత పావన నరసింహా

నీ ముంగిట సిద్ధముగా నుంటిమి విశిష్టామృతము గ్రోల 

15.పిల్లలు వారు చేయాల్సిన పనులకు పెద్దలు ఆక్షేపణ చేస్తే వ్యతిరేకిస్తున్నారు.ఇవన్నీ ఈర్ష,కామ, లోభము వలన కలిగే ఫలితాలు. ఇలా ఎన్నో జరగకూడనివి జరుగుతూ ఉంటాయి. ఇది నిజం. అందువలన వాళ్ళు ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. తాము అనుకున్న దానికి విరుద్ధంగా జరిగినప్పుడు విచక్షణా రహితులు అవుతారు. ప్రపంచమంతా వాంఛల సుడిగుండంలో పడి కొట్టుకుంటూ ఉంది. సర్వాత్మా! వారిని ఆధ్యాత్మికత పట్ల కాస్త మొగ్గు చూపునట్లు మార్పు తీసుకురా! తండ్రీ!

రవ్వలకొండ స్థిరవాసా చెంచులక్ష్మీ సమేత పావన నరసింహా

నీ ముంగిట సిద్ధముగా నుంటిమి విశిష్టామృతము గ్రోల 

 16.ఒక సామాన్యుడు తన ఆశలను తీర్చుకోడానికి ఎన్నో తప్పుదార్లు ఎంచుకుంటున్నాడు. తమ బుద్ధిని,ఇంద్రియాలను సంతృప్తి పరచు కోడానికి ఏకంగా భగవంతుని అవతారము ఎత్తి, తన గారడితో జనాన్ని మోసము చేస్తున్నాడు. దయామయా! వీరి మోసములో పడకుండ చూడు తండ్రీ!

రవ్వలకొండ స్థిరవాసా చెంచులక్ష్మీ సమేత పావన నరసింహా

నీ ముంగిట సిద్ధముగా నుంటిమి విశిష్టామృతము గ్రోల 

 17.ఆది వరాహా! బ్రహ్మ స్తుతించిన యజ్ఞవరాహా! మహా సూకరా! హీరణ్యాక్షుణుడిని చంపి,భూమిని ఉద్దరించి,వేదములు కాపాడిన వేదవరాహమూర్తీ! కేశవా! అజ్ఞానం వలన జన్మించిన నన్ను నాహృదయంలో ఉన్న సంశయాన్ని ఆత్మజ్ఞానమనే ఖడ్గంతో ఛేదించు,యోగాన్ని అనుగ్రహించు తండ్రీ!

రవ్వలకొండ స్థిరవాసా చెంచులక్ష్మీ సమేత పావన నరసింహా

నీ ముంగిట సిద్ధముగా నుంటిమి విశిష్టామృతము గ్రోల 

© Copyright శ్రీ భగవధ్గీత