వెనకకు భగవద్గీత ముందుకు

1 అర్జునవిషాద యోగము


||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ ప్రథమోऽధ్యాయః - అర్జునవిషాదయోగః

28 వ శ్లోకం

కృపయా పరయావిష్టో విషీదన్నిదమబ్రవీత్ |
అర్జున ఉవాచ |
దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితమ్ ||1-28|| .

అర్జునుడు ఇలాఅన్నాడు; ఉదృతమైన కరుణ ఆవహించగా విషాదంతో ఇలా అన్నాడు. యుద్ధం చేయగోరి సమావేశమై ఉన్న నా బంధువులను చూడగా;
. సర్వశక్తిమంతుడైన పరమాత్మ ఎంతో దయతో శ్రీకృష్ణుని అవతారంలో ఈ ఇలలో ఆత్మజ్ఞానం బోధించడానికి అర్జునుని నిమిత్తమాత్రుని చేసుకుని సర్వమానవాళికి ఈ జ్ఞానం అందించారు. అర్జునునికి చాన్దోగ్యోపనిశాద్ 8.15 శ్లోకంలో చెప్పిన “ఆహిమ్స్యాత్ సర్వభూతాని” అంటే ఏ జీవునికి మనం హాని చెయ్యకూడదు అన్న విషయం స్ఫురింపచేసి దానినుండి మాయలోకి దించాడు. ఏదైనా శ్లోకాన్ని తప్పుగా అర్ధం చేసుకుంటే వచ్చే బాధలను అర్జునుని ద్వారా మనకు బోధింపదలచాడు. ఒక క్షత్రియుడు ఇటువంటి మాటలు చెప్పి తన ధర్మం నుండి తప్పుకోకూడదు. కౌంతేయ అని అర్జునుని పిలవడం ద్వారా కుంతీదేవికి జరిగిన అవమానాలు, ఎంతటి కష్టాల్లోనైనా నిలదొక్కుకుని ముందుకు నడిచిన అతని తల్లిని గుర్తు చేస్తూ అర్జునుని కర్తవ్యం గుర్తు చేస్తున్నాడు. పరయా అన్న పదం ద్వారా తన సేనల మీదనే కాక తన శత్రువుల సైన్యాల మీద కూడా జాలి, దయ పెచ్చరిల్లి తన కర్తవ్యాన్ని మర్చిపోయి దైన్యంలోకి కూరుకుపోయే యోధుని గురించి తెలుపుతూ, విశిదన్ అన్న పదం ద్వారా బెంగ పెట్టుకున్న వాడిగా, గద్గదమైన గొంతుతో మాట పెగలక, వణుకుతూ బాధలో ఉన్న, గొంతు తడి ఆరిపోయిన అర్జునుడు ఇలా పలకడం మొదలుపెట్టాడు.

మత్స్యావతారము

 Matsya avatar.jpg 
హిందూమతం పురాణాలలో శ్రీమహావిష్ణువు యొక్క దశావతారాలలో మొదటి అవతారం మత్స్యావతారం. మత్స్యం అనగా చేప. ఈ అవతారంలో విష్ణువు రెండు పనులు చేసినట్లుగా పురాణ గాథ. ప్రళయకాలంలో జీవరాసులను నావలో జలనిధిని దాటించడం. వేదాలను కాపాడడ 
ఆ రాక్షసుడిని సంహరించిన విధం పోతన భాగవతంలో ఇలా వర్ణించాడు (పోతన పద్యం)
ఉరకంభోనిధిలోని వేదముల కుయున్ దైత్యున్ జూచి వే
గరులాడించి ముఖంబు సాచి పలువీతన్ తోక సారించి మేన్
మెరయన్ దౌడలు గీరి మీసలడరన్ మీనాకృతిన్ విష్ణుడ
క్కరటిన్ దాకి వధించె ముష్టి దళిత గ్రావున్ హయగ్రీవున్
ఆ శ్రీమన్నారాయణుని సత్యవ్రతుడు ఇలా ప్రస్తుతించాడు (పోతన పద్యం)
చెలివై చుట్టమవై మనస్థితుడవై చిన్మూర్తివై ఆత్మవై
వలనై కోర్కెల పంటవై విభుడవై వర్తిల్లు నిన్నొల్లకే
పలువెంటన్ బడి లోకమక్కటా వృధా బద్ధాశమై పోయెడున్
నిలువన్నేర్చునె హేమరాశి గనియున్ నిర్భాగ్యుడంభశ్శయ్యాపహా!
సత్య వ్రతుని కీర్తనలకు సంతోషించి శ్రీమత్స్యావతారమూర్తి అతనికి సాంఖ్యయోగ క్రియను, పురాణ సంహితను ఉపదేశించెను. అందరితోను, మూలబీజములతోను ఉన్న ఆ నావను ప్రళయాంభోనిధిని దాటించెను.
సత్యవ్రతుడు ప్రస్తుతం నడుస్తున్న "వైవస్వత మన్వంతరానికి" అధిపతి అయ్యాడు.

© Copyright శ్రీ భగవధ్గీత