వెనకకు భగవద్గీత ముందుకు

1 అర్జునవిషాద యోగము


||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ ప్రథమోऽధ్యాయః - అర్జునవిషాదయోగః

39 వ శ్లోకం

కథం న జ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్నివర్తితుమ్ |
కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన ||1-39|| .

జనార్ధనా! కులక్షయం వలన ఏర్పడే దోషాన్ని తెలిసిన మనం ఈ పాపం నుండి ఎందుకు తొలగ కూడదు?

భృగు మహర్షి

భృగు మహర్షి బ్రహ్మ మానస పుత్రుడైన ప్రజాపతి, సప్తర్షులలో ఒకరు. మొట్టమొదటి జ్యోతిష రచయిత, వేదాల కాలంలో రచించిన భృగు సంహిత కర్త. భృగు మహర్షి బ్రహ్మహృదయము నుండి ఉద్భవించిన నవబ్రహ్మలలో ఒకడు. వాయు పురాణం ప్రకారం భృగువు మామగారైన దక్షుని యజ్ఞంలో పాల్గొన్నాడు.

భృగు వంశావలి : బ్రహ్మ - మానస పుత్రుడు "భృగు మహర్షి"

భృగువు -ఖ్యాతిదేవి (దక్ష ప్రజాపతి పుత్రిక) వారలకు ముగ్గురు సంతానం కలిగిరి 1) దాత 2) విధాత 3) శ్రీ మహాలక్ష్మి

1) దాత - అయతి (మేరు పర్వతరాజు) వారల సంతానం - ప్రాణుండు ప్రాణుండు:

3) శ్రీ మహాలక్ష్మీ - శ్రీ మహా విష్ణువుకి ఇచ్చి వివాహం చేసిరి

2) విధాత - నియతి (మేరు పర్వతరాజు) వారల సంతానం -మృఖండమహర్షి - మనస్విని (ముద్గల మహర్షి) వారల సంతానం

మార్కండేయుడు -దూమ్రావతి దేవి (అగ్ని) వారల సంతానం

శ్రీ మహా విష్ణువు అంశ భావణారాయణుడు (వేద శీర్షుడు) - భద్రావతి దేవి (సూర్య పుత్రిక) వారల సంతానం

101 మంది ఋషి శ్రేష్టులు (పద్మశాలీ అను బిరుదాంకితులు)

భృగు మహర్షి -పులోమ (కర్థమ ప్రజాపతి) వారల సంతానం

చ్యవణుడు -1) అర్శిని 2) సుకన్య వారల సంతానం

1) ఔర్వుడు -ప్రమద్వర వారల సంతానం

ఋచిక మహర్షి - సత్యవతి వారల సంతానం

జమదగ్ని మహర్షి - రేణుక దేవి వారల సంతానం

1) కమణ్వత 2) సుశేన 3) వసు 4) విశ్వావసు 5) పరశు రామ ( మహా విష్ణువుదశావతారములలో ఒకటి)

భృగు మహర్షి - ఉషనల (ఊర్జ మహా ఋషి) వారల సంతానం 1) జావంతి 2) సుజన్మద్ 3) శుచి 4) కామ 5) మూర్థ్న 6) తాజ్య 7) వసు 8) ప్రభవ 9) అత్యాయు 10) దక్ష్య 11) ఇతివర 12) శుక్రాచార్యుడు (దైత్య గురువు, నవ గ్రహములలో ఒకరు)

శుక్రాచార్యుడు -1) గోమతి 2) ఊర్జ సతి 3) జయంతి అను ముగ్గరు భార్యలు వారల సంతానం 1) చండ, అర్క 2) తార్ష్య, వరుచ 3) దేవయాని

భృగు సంహిత

భృగుమహర్షి ఒక గొప్ప హైందవ జ్యోతిష్య శాస్త్ర పితామహుడు, ఇతని మొదటి జ్యోతిష్య శాస్త్ర గ్రంథం భృగుసంహిత దానికొక తర్కాణం. ఈ గ్రంథంలో సృష్టిలోని దాదాపు అన్ని రకాల జీవుల గురించి వ్రాయబడ్డాయి. అనగా దాదాపు 50 లక్షల ప్రాణుల జాతకాలు పొందుపర్చబడ్డాయి. ఒక పరిసశీలన ప్రకారం ఇప్పుడు కేవలం 01 శాతం జీవులు మాత్రమే మిగిలి ఉన్నాయని అంటున్నారు. భృగుమహర్షి ఒక గొప్ప ధర్మశాస్త్రప్రవక్తగా కాత్యాయనుడు పేర్కొన్నాడు.

త్రిమూర్తులు:ఎవరు గొప్ప?

ఒకనాడు సరస్వతి నదీ తీరమున మహర్షులకు సత్క్రతువులు ఆచరించిన పిమ్మట మాటల సందర్భములో త్రిమూర్తులలో ఎవరు గొప్ప అనే సంశయము వచ్చింది. త్రిమూర్తుల గుణగణములు, ప్రాశస్త్యములు పరిశీలించిన పిదప, మహర్షులందరు భృగువు మహర్షి కంటే గొప్ప మహాత్ముడు లేడు అని నిర్ణయించుకొని, ఈ సంశయ విషయము నిర్ధారణ చేసుకునేందుకు భృగువుకు తెలియ జేస్తారు. మహర్షుల నిజ దైవము ఎవరో తెలుసుకునేందుకు బ్రహ్మ, శంకరుడు, విష్ణువు దగ్గరకు వెళ్లడము, అక్కడ విష్ణువు ద్వారా తన అహంకారము పరాభవముతో నశించడము, ముకుందుడు నుండి ఆనందం పొందడము, భక్తి పారవశ్యముతో తిరిగి భూలోకమున సరస్వతి నదీ తీరమునకు చేరుకుంటాడు.[5]. మహర్షులకు పుండరీకాక్షుడు/విష్ణువు ఒక్కడే దైవమని తెలియజేస్తాడు.

భగవద్గీత భృగు ప్రస్తావన

భగవంతుడు శ్రీకృష్ణుడు ఉపదేశించిన భగవద్గీతలో మహర్షుల గురించి తెలియజేస్తూ ఈ భృగు మహర్షి  ప్రస్తావన కూడా రావడము జరుగుతుంది.

1. భృగువు బ్రహ్మమానసపుత్రులలో ఒకఁడు. కొందఱు వరుణుని యజ్ఞమందలి అగ్నినుండి ఇతఁడు పుట్టినట్లు చెప్పుదురు. ఇతని పుత్రుఁడు కవి. పౌత్రుడు అసురులకు గురువు అయిన శుక్రాచార్యులు. ఇదికాక ఇతనికి ఖ్యాతివలన ధాత, విధాత అని ఇరువురు కొడుకులు కలిగిరి. అందు ధాతకు మృకండుఁడు, విధాతకు ప్రాణుఁడును జన్మించిరి. ప్రాణుని కొడుకు వేదశిరుఁడు. వేదశిరుని కొడుకు ఉశేనస్సు. మృకండుని కొడుకు మార్కండేయుఁడు. ఇతని మీసములను దక్షయాగమున వీరభద్రుఁడు పెఱికివేసినట్లు పురాణముల వలన తెలియవచ్చుచున్నది. 2. భృగువు ఒక మహర్షి. ఇతఁడు భాగీరథీ దక్షిణతీరమున మహాపద్మము అనియెడు పురమునందు ఉండెను. ఇతఁడు ఒకప్పుడు అగ్నిహోత్రము చేయుటకు తన భార్య పులోమను అగ్నులను ఏర్పఱపుము అని ఆజ్ఞాపించి తాను స్నానము చేయుటకై నదికిపోయెను. అప్పుడు పులోముడు అను దానవుఁడు ఒకఁడు అచ్చటికి వచ్చి అగ్నిదేవునివలన ఆమె ఇతని భార్య అని ఎఱిఁగి ఆమెను ఎత్తుకొనిపోవ యత్నింపఁగా వెఱపుచేత పూర్ణ గర్భిణి అయిన అమె తత్తఱపడునపుడు గర్భము భేదిల్లి గర్భస్రావము అయ్యెను. ఆస్రావమైన పిండము చ్యవనుడు అనఁబరఁగిన ఋషి అయి తన కోపపు చూపు చేతనే ఆరక్కసుని భస్మము చేసెను. ఇది అంతయు భృగుమహర్షి ఎఱిఁగి అగ్నిమీఁద అలిగి అతనిని సర్వభక్షకుఁడవు కమ్ము అని శపియించెను. అట్లైనను బ్రహ్మ అగ్ని యొక్క శుచిత్వమునకు లోపము కాకుండునట్లు అనుగ్రహించెను

© Copyright శ్రీ భగవధ్గీత