వెనకకు భగవద్గీత ముందుకు

1 అర్జునవిషాద యోగము


||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ ప్రథమోऽధ్యాయః - అర్జునవిషాదయోగః

42 వ శ్లోకం

సఙ్కరో నరకాయైవ కులఘ్నానాం కులస్య చ | పతన్తి పితరో హ్యేషాం లుప్తపిణ్డోదకక్రియాః ||1-42|| .

సాంకర్యం వలన కులానికి, కులాన్ని నాశనం చేసినవారికి నరకమే గతి. వీరి పితరులు పిండోదక క్రియలు లేక నరకంలో పడతారు.

పులస్త్యుడు

 

పులస్త్యుడు బ్రహ్మ మానస పుత్రులైన ఏడుగురు ప్రజాపతులులో ఒకరు., ప్రస్తుతం జరుగుతున్న మన్వంతరములోని (ఏడవ మన్వంతరము) సప్తర్షులలో ఒకడు..

కొన్ని పురాణాలు పులస్త్యుని ద్వారానే మానవాళికి చేరాయి. ఈయన బ్రహ్మ నుండి విష్ణు పురాణాన్ని పొంది, పరాశరునికి బోధించాడు. పరాశరుడు విష్ణు పురాణాన్ని సమస్త లోకానికి తెలియజేశాడు.

పులస్యుడు కర్ధముని తొమ్మిది మంది కుమార్తెలలో ఒకతయిన హవిర్భును వివాహమాడినాడు. హవిర్భు ద్వారా పులస్యునికి అగస్త్యుడు జన్మించాడు. పులస్యునికి ఇద్దరు భార్యలు. పులస్త్యుని రెండవ భార్య, రాజర్షి పుత్రిక అయిన తృణబిందు నకు కుమారుడు విశ్రవసుడు కలిగాడు. సుమాలి కూతురైన కైకసి వలన విశ్రవసునికి రావణుడు, విభీషణుడు, కుంభకర్ణుడు, శూర్పణఖ జన్మించారు. మరో భార్య ఇద్విద ద్వారా కుబేరుడు జన్మించాడు. ఈ విధంగా పులస్త్యుడు కుబేరుడు, రావణుడు వంటి వారితో సహా సమస్త రాక్షసులకు మూలపురుషుడు.

పులస్యుడు దక్షుని కూతురైన ప్రిథిని వివాహమాడినాడు. ఈమెనే భాగవతములో హవిస్భూగా చెప్పబడింది.

ఇద్విద, తృణబిందుడు, అలంబూష అనే అప్సరసల కూతురు. తృణబిందుడు వైవస్వత మనువు వంశములోని మరుత్తుని సంతతికి చెందినవాడు. తృణబిందుడు యాగము చేసి బిందెల నిండా బంగారాన్ని బ్రాహ్మణులకు దానమిచ్చాడు. అంత తీసుకొని వెళ్ళలేని బ్రాహ్మణులు చాలా బిందెలను అక్కడే వదిలి వెళ్ళారు. యుధిష్ఠిరుడు యాగము చేసినప్పుడు ఈ బంగారాన్నే తీసుకొని యాగంలో ఉపయోగించాడు. తృణబిందుడు చక్రవర్తి, అందగాడు.

© Copyright శ్రీ భగవధ్గీత