వెనకకు భగవద్గీత ముందుకు

2 సాంఖ్య యోగము


||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ ద్వితీయోऽధ్యాయః - సాఙ్ఖ్యయోగః

8 వ శ్లోకం

న హి ప్రపశ్యామి మమాపనుద్యాద్
యచ్ఛోకముచ్ఛోషణమిన్ద్రియాణామ్|
అవాప్య భూమావసపత్నమృద్ధం
రాజ్యం సురాణామపి చాధిపత్యమ్|| 2-8 ||

ఇంద్రియాలను దహింపచేసే నాయీశోకాన్ని తగ్గించే దేదో నేను తెలుసుకోలేకుడా ఉన్నాను. భూమిలో ఏకచ్చత్రాధిపత్యం కాని, దేవలోకాధిపత్యం కాని దీనిని తొలగించ లేదు.

శ్రీపావన నరసింహ విశిష్టామృతము

9.త్రిమూర్తులలో ఒకడైన విష్ణువు లోకపాలకుడు. సాధు పరిరక్షణకొఱకు, దుష్టశిక్షణ కొఱకు ఆయన ఎన్నో అవతారాలలో యుగయుగాన అవతరించాడు. అవతారాలలో ముఖ్యమైన అవతారమూర్తీ! నృసింహా! మాకు సదా నీవే రక్ష మరియు ఆధారము తండ్రీ!

రవ్వలకొండ స్థిరవాసా చెంచులక్ష్మీ సమేత పావన నరసింహా

నీ ముంగిట సిద్ధముగా నుంటిమి విశిష్టామృతము గ్రోల 

 10.బ్రహ్మ దేవుని వద్ద నుంచి వేదాలను కాజేసి సముద్రములో దాచిన సోమకాసురున్ని సంహరించి వేదాలను కాపాడితివి. సత్యవ్రతుని కీర్తనలకు సంతోషించి,అతనికి సాంఖ్యయోగ క్రీయను, పురాణ సంహితను ఉపదేసించిన శ్రీమత్స్యావతారమూర్తీ! నీకు వందనము. శ్రీవేదనారాయణస్వామిగా వేదపురిలో వెలసిన మూర్తివాసా! తండ్రీ!

రవ్వలకొండ స్థిరవాసా చెంచులక్ష్మీ సమేత పావన నరసింహా

నీ ముంగిట సిద్ధముగా నుంటిమి విశిష్టామృతము గ్రోల 

 11."దేవతలు శక్తిహీనులు" కమ్మని దేవేంద్రుని ప్రవర్తనకు దూర్వాస మహర్షి కోపించి శపించాడు. దానవులచేతిలో పరాజయం పొందుతున్న దేవతలు విష్ణువును వేడుకున్నారు. "సకల ఔషధులకు నిలయమైన పాలకడలిని చిలికి అమృతాన్ని సాధించండి" అని విష్ణువు చేప్పిన ఉపాయము ప్రకారము, మందర పర్వతం కవ్వంగా, వాసుకి త్రాడుగా క్షీరసముద్ర మథనం మొదలయ్యింది. కాని మందరగిరి బరువుకి మునిగిపోకుండ శ్రీ మహావిష్ణువు కూర్మావతారమును ధరించిన తండ్రీ!

రవ్వలకొండ స్థిరవాసా చెంచులక్ష్మీ సమేత పావన నరసింహా

నీ ముంగిట సిద్ధముగా నుంటిమి విశిష్టామృతము గ్రోల 

 12.జీవుని మోక్ష రహష్యాన్ని తెలియజేసే బ్రహ్మవిద్య, విద్యలలో ఉత్తమమైనది మరియు నిగూడమైనది. జగత్తుకు తల్లివి, తండ్రివి, కర్మఫల ప్రదాతవు నీవే. సర్వాన్నీ భరించేవాడివి, ఆశ్రయాన్ని, బీజాన్ని, శరణునొసగేవాడివి, సాక్షివి,సృష్టి స్థితి లయ కారకుడవు, సత్స్వరూపుడవు, అమృతుడవు నీవే. మూడులు ఇది తెలియక వ్యర్థమైన ఆశలతో, నిష్ప్రయోజనమైన కర్మలతో నశిస్తున్నారు. అందువలన నేను సదా కీర్తిస్తూ జ్ఞానయోగము ద్వారా ఆరాదిస్తాను. అనన్య చింతనతో నిన్ను ఉపాసించుతున్నాను. నా యోగక్షేమాలన్నీ నీవే వహించాలి తండ్రీ!

రవ్వలకొండ స్థిరవాసా చెంచులక్ష్మీ సమేత పావన నరసింహా

నీ ముంగిట సిద్ధముగా నుంటిమి విశిష్టామృతము గ్రోల 

© Copyright శ్రీ భగవధ్గీత