వెనకకు భగవద్గీత ముందుకు

1 అర్జునవిషాద యోగము


||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ ప్రథమోऽధ్యాయః - అర్జునవిషాదయోగః

3 వ శ్లోకం

పశ్యైతాం పాణ్డుపుత్రాణామాచార్య మహతీం చమూమ్ |
వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా ||1-3|| .

ఆచార్యా! బుద్ధిమంతుడైన మీ శిషుడు ధృష్టద్యుమ్నుని చేత ఏర్పరచ బడిన పాండవుల ఈ పెద్ద సైన్యాన్ని చూడండి.

దుర్యోధనుడు ద్రోణుని వద్దకు వెళ్లి ఆయనను యుద్ధానికి మరింత పురికోల్పేలా మాట్లాడుతున్నాడు. ద్రోణుడు శిష్యవాత్సల్యంవలన యుద్ధానికి సుముఖత చూపించకపోవచ్చు అన్న శంక దుర్యోధనునికి వుంది. పాండవులంటే ద్రోణునికి ప్రత్యేక అభిమానం, వారు ప్రియశిష్యులు. అందుకే దుర్యోధనుడు “పశ్యైతాం” – అంటే గమనించండి, అంటూ మీ ప్రియశిష్యులే మిమ్మల్ని దిక్కరించేలా మీమీద యుద్ధానికి పూనుకున్నారు, ఇది మీకు అవిధేయత ప్రకటించడం సుమా అన్న అర్ధంలో అంటున్నాడు. ఆయనను మరింత క్రోధునిగా చెయ్యడం కోసం మరొక ప్రియశిష్యుడు దృష్టద్యుమ్నుడు ఏ వ్యూహం పన్నాడో చూసారా అంటున్నాడు. ఇక్కడ నేరుగా దృష్టద్యుమ్నుని పేరు తీసుకోవచ్చు, కానీ ఈయన బద్ధశత్రువు ద్రుపదుని పుత్రునిగా అభివర్ణిస్తున్నాడు, ఎందుకంటె ద్రోణుని మరణమే కోరికగా ద్రుపదుడు చేసిన యజ్ఞం వల్ల పుట్టిన దృష్టద్యుమ్నుడు. ఈ విషయం ఆయనకు అర్ధమయ్యేలా అతని పేరును అలా పలికాడు. అతడిని తెలివైనవాడిగా ఎందుకు అన్నాడంటే ఎవరి చావుకోసం పుట్టాడో, అతని వద్దనే శిష్యరికంచేసి యుద్ధ విద్యలు నేర్చుకున్నాడు ద్రుపదపుత్రుడు. కాగా తనను చంపేవాడు వీడు అని తెలిసికూడా ద్రోణుడు ఇతడికి యుద్ధవిద్యలు నేర్పినందుకు ఆయనవలన ఈ యుద్ధంలో జరగబోయే కష్టాల గురించి ఆయనను బాద్యుడిని చేస్తున్నట్టు మాట్లాడాడు దుర్యోధనుడు.

గతంలో ఆయన చేసిన తప్పుని, తన అస్త్రవిద్యా గురువు ద్రోణాచార్యుడికి యుక్తి తో ఎత్తి చూపాడు దుర్యోధనుడు. ద్రోణాచార్యుడికి గతంలో ద్రుపద మహారాజు తో రాజకీయ వైరం ఉండేది. వైరం తో ఆగ్రహం చెందిన ద్రుపదుడు ఒక యజ్ఞం చేసి, ద్రోణాచార్యుడిని సంహరించ గలిగే పుత్రుడు కలగాలనే వరం పొందాడు. ఆ వరం ఫలితంగా ద్రుపదునికిదృష్టద్యుమ్నుడు పుట్టాడు.
ద్రోణాచార్యుడికి దృష్టద్యుమ్నుడి జన్మ ప్రయోజనం తెలిసినా, తన వద్దకు సైనిక విద్య ని అభ్యసించడానికి వచ్చినప్పుడు, పెద్ద మనసుతో, దృష్టద్యుమ్నుడికి తనకు తెలిసిన విద్యనంతా సంశయం లేకుండా బోధించాడు. కానీ ఇప్పుడు దృష్టద్యుమ్నుడు, పాండవ పక్షం లో సర్వ సైన్యాధి పతిగా సైనిక వ్యూహాన్ని ఏర్పాటు చేసాడు.దుర్యోధనుడు ఈ విధంగా, గతంలో గురువు గారి కనికరమే ప్రస్తుత ఇబ్బంది కి దారి తీసింది అని భావిస్తూ, ఇకనైనా ద్రోణాచార్యుడు ఇంకాకనికరం చూపించకుండా పాండవులతో యుద్ధం చేయమని సూచిస్తున్నాడు.

సనాతన ధర్మం అంటే ఓ లోతైన పరిశీలన!


మీరు విశ్వవిద్యాలయం అనే వేదిక మీదికి సనాతన ధర్మాన్ని తీసుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి మీరు అంతిమ ప్రక్రియను ఓ పరిమిత విద్యా వేదిక మీదికి తీసుకు వస్తున్నారు. ఈ పని చేసే సమయం ఆసన్నమైంది- అందులో సందేహము లేదు. అయితే దానిని ఇంకో వేదాంత ప్రక్రియలా కాకుండా, కొన్ని ప్రాధమిక జాగ్రత్తలు తీసుకుని ప్రజలలో జ్ఞానపిపాసను కలిగించేలా చేయాలి.
సనాతన ధర్మ అంటే మీరు ఎదో ఒక విషయాన్ని నమ్మాలి, లేకపొతే మరణిస్తారు అని కాదు. అది అలాంటి సంస్కృతి కాదు. నేను ఏదన్న ఒక విషయo మీకు చెప్తే, దాని వల్ల మీలో మీరు ఊహించిన దానికంటే ఎక్కువ ప్రశ్నలు ఉదయించాలి. సనాతన ధర్మ ప్రక్రియ అంతా కూడా మీలో ప్రశ్నలను పెంచడం గురించే గానీ , సంసిద్ధముగా ఉన్న సమాధానాలను ఇవ్వడం గురించి కాదు. ప్రశ్నలు లేవనెత్తబడుతాయి, అలా లోతుగా ప్రశ్నించటం వలన మీరు సహజంగానే మీ మూలాన్ని కనుగొంటారు. ఆ కోణాన్ని తీసుకురావటం కోసం, అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటూ, ఇది మరొక వేదాంత పరమైన అధ్యయనంగా మారకుండా చూడటం చాలా ముఖ్యం.
అర్జునుడే తనకు తాను కొన్ని లక్షల ప్రశ్నలు వేసుకున్నాడు. మీరు కేవలం అది అనుసరిస్తే చాలు, అప్పుడు ఈ జీవితం ఇవ్వబడడంలోని మౌలిక ఉద్దేశo మీకు తెలుస్తుంది.
భారతదేశంలో, అలాగే భారతదేశం వెలుపల ఉన్నవారిలో తమను తాము నిరూపించుకోవాలనే తహతహ వల్ల, ఎలాగైనా సాధించాలనే తాపత్రయం ఏర్పడింది. ఇతరులు తమను దాటి పోతారనే భావన కలుగుతోంది. అనాదిగా వస్తున్న జ్ఞానాన్ని వారు అందరు అనుసరించవలసిన మరో పవిత్ర గ్రంధముగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అది ఎన్నడూ మన మార్గం కాదు. మనమందరం కూడా భగవద్గీతను పాటించాలి అని చెప్తున్నారు. అది సరికాదు. అర్జునుడే తనకు తాను కొన్ని లక్షల ప్రశ్నలు వేసుకున్నాడు. మీరు కేవలం అది అనుసరిస్తే చాలు, అప్పుడు ఈ జీవితం ఇవ్వబడడంలోని మౌలిక ఉద్దేశo మీకు తెలుస్తుంది.
ప్రాధమిక ఉద్దేశం జ్ఞానపిపాసను కలిగించడమే కావాలి గానీ, మనము చేసేవాటిని వేరే వారి మీద రుద్దటం కాదు. ”మన” అనే మార్గమే లేదు. మాకంటూ ప్రత్యేకమైన మార్గం లేదు. జీవితాన్ని ఒక విధంగా అమర్చుకుంటే, అది ఓ వ్యక్తి యొక్క, అలాగే సమాజం యొక్క శ్రేయస్సుకు ఉత్తమంగా పనిచేస్తుందని మనం కనుగొన్నాం. కాని “ఇంతే” అని మాత్రం చెప్పటం లేదు. ప్రతీ రోజు ప్రశ్నించవచ్చు – కొన్ని లక్షల ప్రశ్నలు అడగవచ్చు. మీరు ప్రశ్నలకు భయపడ్డారు అంటే, దాని అర్థం మీరు బలహీనమైన పునాదిపై నిలిచి ఉన్నారనే. నేను మూడు ప్రశ్నలు అడిగితే, అది కూలిపోతుంది. మీరు సత్యంలో ఉంటే, నేను మిమ్మలని కొన్ని లక్షల ప్రశ్నలు అడగవచ్చు - సమస్య ఏమిటి? మీరు అబద్ధంలో ఉంటేనే, ప్రశ్న అనేది సమస్య అవుతుంది. ఏ ప్రశ్న అయినా సరే ఎప్పటికీ తప్పు కాదు.సమాధానాలు మాత్రమే తప్పు కావచ్చు.
కాబట్టి సనాతన ధర్మం యొక్క ఉద్దేశము విచారణా తత్వాన్ని ఉత్తేజ పరిచేదిగా ఉండాలే గానీ, మన ఆలోచనలని వేరే వారి మీద రుద్దేలా కాదు. - ఏమయినప్పటికీ , ఆ విధముగా అది పనిచేయదు.ఈ గ్రహం మీద మానవ జీవితపు పునాదులను చెదరగొట్టే ఒక పెద్ద యుద్ధం లేదా ఉపద్రవం వస్తే తప్ప, రాబోయే యాభై సంవత్సరాలలో యోగా ఇతర మతాలన్నింటి కంటే కూడా ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. "యోగా" అని చెప్పినప్పుడు మనం సనాతనధర్మ సిద్ధాంతం ఒక నిర్దిష్ట మార్గంలో సూచిoచే ప్రక్రియల గురించి మాట్లాడుతున్నాం.
మానవ చరిత్రలోనే మొట్టమొదటిసారి, మానవ మేధస్సు ముందెన్నడు లేని విధంగా చిగురిస్తూ ఉంది. చాలా కాలం వరకు, గ్రామాల్లో ఓ పెద్ద మనిషే మిగతావారి గురించి కూడా ఆలోచించే వారు. ఆ కాలము ఇప్పుడు పోయిoది. త్వరలోనే ఎవరికీ వారు తమ సొంత పద్దతుల్లో తమ గురించి తాము ఆలోచిoచుకుంటారు. ప్రతి ఒక్కరికి ప్రపంచంలో ఉన్నవన్ని అందుబాటులో ఉంటాయి. అది జరిగినప్పుడు, ”నేను చెప్పేది మీరు నమ్మాలి, లేకుంటే మీరు చనిపోతారు” అనే సిద్ధాంతం పనిచేయదు..
"హిందూ” అనే పదం ఒక భౌగోళిక గుర్తింపు నుండి వచ్చింది.
స్వర్గంలో పరిష్కారాలు లభిస్తాయి అన్న సిద్ధాంతాలు పనికిరావు. తర్కానికి నిలబడని సిద్దాంతాలు పని చేయవు. ప్రజలు ప్రతిదాని విషయంలో ఆచరణాత్మక పరిష్కారాలు కోరుకుంటారు. తర్కానికి నిలబడి, మీ జీవితంలో అమలు చేస్తే ఇప్పుడే ప్రభావం చూపే ఒక ఆచరణాత్మక పరిష్కారం మాత్రమే రాబోయే యాభై సంవత్సరాలలో పని చేస్తుంది. మనం చూడని ప్రదేశంలో ఎక్కడో లభంచే పరిష్కారాన్ని మానవజాతి పట్టించుకోవడం చాలా చాలా తగ్గిపోతుంది. చుట్టూ ఏమి జరుగుతుందో తెలుసుకునే అవకాశం చాలా తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే అలాంటి పరిష్కారాన్ని మానవజాతి పట్టించుకుంటుంది.
కాబట్టి సనాతన ధర్మాన్ని మళ్ళీ ముందుకు తీసుకురావడానికి తగిన సమయం ఇది. అది హిందూ మతం అని ప్రచారం కాకుండా చూడటం చాలా ముఖ్యం, ఎందుకంటే అది హిందూ మతం కాదు. హిందూ మతం అనే ఆలోచన ఒక విదేశీ ఆలోచన - ఆ ఆలోచన ఈ దేశంలో ఎప్పుడూ లేదు. "హిందూ” అనే పదం ఒక భౌగోళిక గుర్తింపు నుండి వచ్చింది. హిమాలయాలూ, ”ఇందు సాగరం” మధ్య ఉన్న ప్రదేశాన్ని “హిందూ” గా పిలిచారు. కావున సనాతన ధర్మాన్ని మళ్ళీ ముందుకు తీసుకురావడానికి తగిన సమయం ఇది. అది హిందూ మతం అని ప్రచారం కాకుండా చూడటం చాలా ముఖ్యం, ఎందుకంటే అది హిందూ మతం కాదు.
హిందూ మతం అనే ఆలోచన ఒక విదేశీ ఆలోచన - ఆ ఆలోచన ఈ దేశంలో ఎప్పుడూ లేదు. "హిందూ” అనే పదం ఒక భౌగోళిక గుర్తింపు నుండి వచ్చింది. హిమాలయాలూ, ”ఇందు సాగరం” మధ్య ఉన్న ప్రదేశాన్ని “హిందూ” గా పిలిచారు. భారతదేశంలో పుట్టిన ఒక వానపాముని ‘ఒక హిందూ వానపాము’ అని నేను అన్నానని భారతదేశంలోని జాతీయ మీడియాలో ఓ పెద్ద వివాదం చెలరేగింది. వాళ్ళు “మీరెమంటున్నారు?” అని అడిగారు. అప్పుడు నేను ”మీరు ఆఫ్రికాలో జన్మించిన ఒక ఏనుగును ఆఫ్రికన్ ఏనుగు అని పిలుస్తారు. అలాగే హిందూస్థాన్‌లో జన్మించిన ఒక వానపాము హిందూ వానపాము అయింది. ఒక మిడతైనా, మీరైనా కూడా అంతే కదా. మీరు ఈ దేశంలో జన్మించారు,కాబట్టి మిమ్మల్ని ‘హిందూ’ అని పిలుస్తారు.” అన్నాను.
ఈ ప్రదేశపు భౌగోళిక లక్షణాల్ని బట్టే మేము గుర్తింపు పొందాము. హిమాలయాలూ, హిందూ మహాసముద్రo చేత రక్షించబడ్డాం కాబట్టే, 6000 నుంచి 8000 సంవత్సరాల పాటు మా సొంత మేధాశక్తితో ఆధ్యాత్మిక ప్రక్రియ, సంగీతము, గణితం, ఖగోళశాస్త్రాలను ఎవరి జోక్యం లేకపోవడం వల్ల అంత ఎత్తుకు తీసుకెళ్లగలిగే స్వేచ్ఛ మాకు లభించిందని మేము గ్రహించాము. ఈ రెండు భౌగోళిక అంశాల పట్ల మాకున్న ప్రగాఢమైన భక్తి వల్లే హిందు అని పిలవబడ్డాం. ఇవి లేకపొతే వేల సంవత్సరాలుగా అవిరామంగా పరిణామం చెందుతున్న ఈ సంస్కృతి ఉండేది కాదు.
ప్రేమతో,
సద్గురు

© Copyright శ్రీ భగవధ్గీత