వెనకకు భగవద్గీత ముందుకు

1 అర్జునవిషాద యోగము


||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ ప్రథమోऽధ్యాయః - అర్జునవిషాదయోగః

ఒకటవ శ్లోకం

ధృతరాష్ట్ర ఉవాచ |
ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః |
మామకాః పాణ్డవాశ్చైవ కిమకుర్వత సఞ్జయ ||1-1||.

ధృతరాష్ట్రుడు పలికెను. ఓ సంజయా, ధర్మభూమి అయిన కురుక్షేత్రం లో కూడియుండి,
యుద్ధానికి సన్నద్ధమైన నా పుత్రులు మరియు పాండు పుత్రులు ఏమి చేసారు?
ఓ సంజయా! యుద్ధ సన్నద్ధులై ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునకు చేరియున్న నా కుమారులును, పాండవులును ఏమి చేసిరి?.
మధ్వాచార్యులవారు: శ్రీకృష్ణద్వైపాయన వ్యాసుల వారి మహాభారత గ్రంధంలో శ్రీకృష్ణ అర్జున సంవాదం 700 శ్లోకాల భగవద్గీత. ఈ 27 శ్లోకాలు సంజయుడు ధృతరాష్ట్ర మహారాజుకు చెప్పినట్టు వైశంపాయన మహాముని అర్జుని మనుమడు జనమేజయ మహారాజుకు వివరించారు. ఇక్కడ ధృతరాష్ట్రుడు సంజయుని కురుక్షేత్రంలో నా కుమారులు, పాండుకుమారులు ఏమి చేసారు అని అడగడానికి అక్కడకు యుద్ధానికి వెళ్ళారని తెలియకనా? కాదు. కురుక్షేత్రం అన్నది ధర్మ క్షేత్రం, ఎందరో దేవతల నిలయం, ఎన్నో యజ్ఞాలు జరిగిన స్థలం. ఆ ధర్మక్షేత్ర ప్రభావం ఏమైనా తన కుమారులపై పడిందా అన్న ఉత్సుకత ఆయనను అలా అడిగేలా చేసింది. అధర్మం వైపున్న తన కుమారుల మనసేమైనా మారిందా? లేక పాండుకుమారులు వంశక్షయానికి వెరసి ఏమైనా యుద్ధం ఆపారా, ఆపి వారు అడవులకు తపస్సుకు పోయారా అన్న కుతూహలం. ఇక్కడ ధృతరాష్ట్రుడు నా కుమారులు(మామకః), పాండుకుమారులు (పాండవ: ) అన్న భావం ప్రకటించడం ద్వారా పాండు కుమారులను తన కుమారులుగా అంగీకరించక వారిని వైరులగానే చూస్తున్నాడు అన్నది తెలియచేస్తుంది. క్షేత్రం అంటే దున్నే స్థలం. సేద్యం చేసే పొలంలో ఎలాగైతే కలుపు తీసివేయబడుతుందో అలాగా కౌరవులు దునుమాడబడతారు అన్నది ధర్మక్షేత్రానికి అర్ధం.

"ఎవ్వనిచే జనించు జగ మెవ్వనిలోపలనుండు లీనమై,
యెవ్వనియందుడిందు బర మేశ్వరుడెవ్వడు మూలాకారణం ,
బెవ్వాడనాదిమధ్యలయు డెవ్వడు సర్వము దాన యైనవా ,
డెవ్వడు వాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేడెదన్ ."

ఎవనివల్ల జగములుపుట్టి, పెరిగి నశించుచున్నవో, ఎవ్వడన్ని వస్తువులకు ప్రభువో,
ఎవ్వడన్నిటికి మూలకారణుడో, ఎవ్వనికి మొదలు నడుమ ఆఖరు అనునవి లేవో,
ఎవడు సర్వాత్మస్వరూపుడో, అట్టి భగవంతుని నన్ను కాపాడమని వేడుచున్నాను.

వసుదేవసుతం దేవం[క్రిష్ణాష్టకం}

వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనమ్ |
దేవకీపరమానందం కృష్ణం వందే జగద్గురుమ్ || 1 ||

ఆతసీపుష్పసంకాశం హారనూపురశోభితమ్ |
రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్గురుమ్ || 2 ||

కుటిలాలకసంయుక్తం పూర్ణచంద్రనిభాననమ్ |
విలసత్కుండలధరం కృష్ణం వందే జగద్గురుమ్ || 3 ||

మందారగంధసంయుక్తం చారుహాసం చతుర్భుజమ్ |
బర్హిపింఛావచూడాంగం కృష్ణం వందే జగద్గురుమ్ || 4 ||

ఉత్ఫుల్లపద్మపత్రాక్షం నీలజీమూతసన్నిభమ్ |
యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుమ్ || 5 ||

రుక్మిణీకేళిసంయుక్తం పీతాంబరసుశోభితమ్ |
అవాప్తతులసీగంధం కృష్ణం వందే జగద్గురుమ్ || 6 ||

గోపికానాం కుచద్వంద్వ కుంకుమాంకితవక్షసమ్ |

శ్రీ నికేతం మహేష్వాసం కృష్ణం వందే జగద్గురుమ్ || 7 ||

శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలావిరాజితమ్ |
శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుమ్ || 8 ||

కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుత్థాయ యః పఠేత్ |
కోటిజన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి || 9 ||